Grooms For Sale: బాబోయ్.. అమ్మాయిలకు పెళ్ళికొడుకులను అమ్మేస్తున్న జనాలు.. ఎక్కడంటే?

అక్కడి మార్కెట్లో పెళ్ళికొడుకులను పెళ్లికూతురులకు అమ్ముతుంటారట. ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా! మీరు విన్నది

  • Written By:
  • Publish Date - August 11, 2022 / 09:30 AM IST

అక్కడి మార్కెట్లో పెళ్ళికొడుకులను పెళ్లికూతురులకు అమ్ముతుంటారట. ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా! మీరు విన్నది నిజమే. వరుడు లను అమ్మకానికి పెట్టి మార్కెట్ కూడా ఉందట. అయితే ఇది ఏదో సినిమా కథలా ఉంది అనుకుంటే బ్రమపడినట్లే. ఎందుకంటే ఇలా ఒక మార్కెట్లో నిజంగానే పెళ్ళికొడుకులను అమ్మేస్తారట. మరి అక్కడ అలా ఎందుకు చేస్తున్నారు? ఆ ప్లేస్ ఎక్కడ ఉంది? ఇలాంటి విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. పెళ్ళికొడుకులను మార్కెట్లో అమ్మకానికి పెట్టే అంగడి బీహార్ లో ఉంది. అయితే బిహార్ అంటే ప్రస్తుతం నితీష్ కుమార్ రాజకీయమే కదా అని కొట్టిపారేయకండి.

ఈ రాజకీయాలు ఒక వైపు నడుస్తుండగానే,మరో వైపు ఆసక్తికర కథనం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిహార్‌లోని మధుబని జిల్లాలో పెళ్లి కొడుకులను అమ్మకానికి పెట్టే మార్కెట్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మధుబనిలోని పెళ్లి కొడుకుల మార్కెట్ తొమ్మిది రోజులపాటు సాగుతుంది. పచ్చని రావి చెట్ల నీడ కింద ఈ సంత నిర్వహిస్తారు. పెళ్లి కొడుకులు సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమంటారు. లేదా జీన్స్, ప్యాంట్ ధరించి కూడా ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. వారు తమ ఆస్తి, చదువు, అర్హతలు ధ్రువపరిచే డాక్యుమెంట్లను వెంట పెట్టుకుని తమని తాము అమ్ముకోవడానికి రెడీగా కూర్చుని ఉంటారు. తమ సంరక్షకులు, కుటుంబ సభ్యులతో ఆ పెళ్లి కొడుకులు వేలాది మంది ఆ అంగడికి కనిపిస్తారు.

 

సౌరథ్ సభ అని పిలిచే ఈ మార్కెట్‌కు మైథిల్ బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన కుటుంబీకులు వచ్చి పెళ్లి కొడుకును సెలెక్ట్ చేసుకుంటారు. అయితే అమ్మాయి తరఫు కుటుంబాలు, తమ ఇంటి ఆడపిల్లకు పెళ్లి చేయాలనుకునే వారు ఆ సంతకు వచ్చి వారికి తగిన సంబంధం కోసం వెతుకుతూ ఉంటారు. అమ్మాయికి తగ్గిన వరుడు దొరికితే ఆ తర్వాత కార్యక్రమాలకు చర్చ మొదలవుతుంది. ఇక పెళ్ళికొడుకు ఎంపిక అవ్వగానే పెళ్లి పనులను వేగంగా పెళ్ళికూతురు కుటుంబం చేసుకుంటుంది. అయితే ఒక రంగా చెప్పాలి అంటే ఇది ఆఫ్లైన్ మ్యాట్రిమోనీ లా ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే ఇలా ఎందుకు చేస్తున్నారు అన్న విషయానికి వస్తే..స్థానికుల విశ్వాసాల ప్రకారం, కర్ణాత్ వంశ పాలకుల కాలంలో ఈ పద్ధతి పుట్టినట్టు చెబుతారు. రాజా హరి సింగ్ ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు స్థానికులు భావిస్తున్నారు. వేర్వేరు గోత్రాల మధ్య పెళ్లిళ్లను ప్రోత్సహించేలా ఈ పద్ధతిని ఆయన అవలంబించినట్టు వివరిస్తున్నారు.