Hair Fall In Summer: ఎండాకాలంలో జుట్టు రాలుతోందా?..ఈ సహాజసిద్ధ పదార్థాలతో చెక్ పెట్టండి..!!

ఎండాకాలం మొదలైంది. ఎండలు భగభగ మండిపోతున్నాయి. ఈ క్రమంలో జుట్టుపై శ్రద్ధ,శుభ్రత చాలా అవసరం.

  • Written By:
  • Updated On - May 4, 2022 / 11:57 AM IST

ఎండాకాలం మొదలైంది. ఎండలు భగభగ మండిపోతున్నాయి. ఈ క్రమంలో జుట్టుపై శ్రద్ధ,శుభ్రత చాలా అవసరం. సాధారణంగా వేసవిలో జుట్టు సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి. ఈ సీజన్ లో వేడి, చెమట కారణంగా జుట్టు జిడ్డుగా మారుతుంది. హానికరమైన అతినీలలోహిత కిరణాల కారణంగా జుట్టు, నిర్జీవంగా, పొడిగా మారుతుంది. ఈ సీజన్ లో జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మీకు ఆరోగ్యకరమైన, అందమైన జుట్టు కోసం అనేక ఇంటి చిట్కాలను పాటించవచ్చు. మీ ఇంట్లోనే తయారు చేసిన అనేక రకాల హెయిర్ మాస్క్ లను ఉపయోగించి…ఈ సమస్యలను అధిగమించవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

1. కలబంద:
అలోవెరా జుట్టు పెరుగుదలకు చక్కగా ఉపయోగపడుతుంది. జుట్టు రాలకుండా అరికడుతుంది. దురద, డాండ్రఫ్ వంటి స్కాల్ప్ సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అంతేకాదు సహజ పీహెచ్ స్థాయిని పునరుద్దరిస్తుంది. చుండ్రుకు మంచి చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. పొడిబారిన జుట్టును నిగనిగ మెరిసేలా చేస్తుంది. కలబంద జెల్ ను మీ వెంట్రుకల కుదుళ్లకు పట్టించి…చక్కగా మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేసినట్లయితే…మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. వెంట్రుకలు రాలే సమస్య తగ్గుతుంది.

2. మెంతులు:
మెంతులు…జుట్టును మెరిసేలా చేస్తాయి. జుట్టు రాలడాన్ని అరికట్టడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అత్యంత ప్రభావవంతమైన హెయిర్ ఫాల్ రెమెడీలలోఇది ఒకటి. ఇది జుట్టు కుదుళ్లను పునరుద్దరిస్తుంది. జుట్టు పెరిగడానికి సహాయపడుతుంది. ప్రోటీన్లు, నికోటినిక్ యాసిడ్ మెంతులలో పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును స్ట్రాంగ్ గా ఉంచేలా సహాయపడతాయి. మెంతులను రాత్రంతా నానబెట్టి..తెల్లవారి పేస్టులా గ్రైండ్ చేసుకుని జుట్టకు పట్టించండి. దాదాపు 30 నుంచి 40 నిమిషాలు ఉంచిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది.

3. కొబ్బరినూనె..
కొబ్బరినూనెలో ప్రొటిన్స్, మినరల్స్, ఎసెన్సియల్ ఫ్యాట్స్ ఉంటాయి. కొబ్బరి నూనె జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. అంతేకాదు జుట్టును బలంగా ఉంచడంతోపాటు..జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కొబ్బరినూనెలో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టును తేమగా ఉంచేందుకు సహాయపడుతుంది. మీ జుట్టు రాలడాన్ని నియంత్రంచడంతోపాటు..పొడవుగా మందంగా ఉంచేలా చేస్తుంది. వారానికి మూడు సార్లు తలకు కొబ్బరి నూనెతో మసాజ్ చేసినట్లయితే చక్కటి ఫలితం ఉంటుంది.

4. బీట్ రూట్ జ్యూస్:
విటమిన్ సి, ఫోలేట్, మాంగనీస్, బీటైన్, పొటాషియంతో నిండిన బీట్‌రూట్‌ను ఉపయోగించడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. విలమిన్ సి జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. అంతేకాదు జుట్టు వేగంగా పెరుగేలా ప్రోత్సహిస్తుంది.

5. ఆనియన్ జ్యూస్:
ఉల్లిపాయల జ్యూస్ తో మీ జుట్టుకు అద్భుతాలు చేయవచ్చు. ఉల్లిపాయలలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు స్కాల్ప్ ఇన్ఫెక్షన్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడతాయి. ఇందులో ఉండే సల్ఫర్ కంటెంట్ హెయిర్ ఫోలికల్స్‌కి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంతోపాటు జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది.

6.గుడ్డు లోని పచ్చసొన:
గుడ్లు సల్ఫర్, ఫాస్పరస్, సెలీనియం, అయోడిన్, జింక్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ జుట్టును మెరుగుపరచడంలో శక్తివంతంగా పనిచేస్తాయి. గుడ్డులోని పచ్చసొనలో ఆలివ్ ఆయిల్, తేనె కలిపి గుడ్డు మాస్క్‌ను సిద్ధం చేసుకోండి. దీన్ని మీ జుట్టు ,స్కాల్ప్‌కి సమానంగా అప్లై చేసి 20-25 నిమిషాల పాటు అలాగే ఉంచి తేలికపాటి షాంపూతో కడిగేయండి. చక్కటి ఫలితం ఉంటుంది.

7. గ్రీన్ టీ:
గ్రీన్ టీ మీ జుట్టు పెరుగుదలను పెంచి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఉండే యాంటీఆక్సిడెంట్ల కారణంగా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా మీ జుట్టు పొడవు ఆధారంగా, 2 కప్పుల నీటిలో 2-3 టీ బ్యాగ్‌లను వేసి మరగించండి. అది చల్లారిన తర్వాత, ఈ ద్రవాన్ని మీ జుట్టుకు, కుదుళ్లకు పట్టించండి. ఒక గంట లేదా రెండు గంటల తర్వాత, చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. జుట్టు మెరుస్తూ…నిగనిగలాడుతుంది.

మీరు ఎంచుకున్న సహజమైన హెయిర్ ఫాల్ ట్రీట్‌మెంట్ ఏదైనా, దానిని 4-5 సిట్టింగ్‌ల పాటు ప్రయత్నించండి. తర్వాతే మీ జుట్టు ఎదుగుదలను జాగ్రత్తగా గమనించండి.