Summer Vs Mosquitoes : వేసవి టైంలో దోమల బెడద.. తగ్గించుకునే చిట్కాలివీ

Summer Vs Mosquitoes : సాధారణంగానైతే వర్షాకాలంలోనే దోమల బెడద ఎక్కువగా ఉంటుంది.

  • Written By:
  • Publish Date - April 24, 2024 / 09:47 AM IST

Summer Vs Mosquitoes : సాధారణంగానైతే వర్షాకాలంలోనే దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే సమ్మర్ టైంలో వాటి ఊసే ఉండదని భావిస్తే తప్పులో కాలేసినట్టే!  సమ్మర్ సీజన్‌లో దోమల విషయంలో ప్రజలు అంత అలర్ట్‌గా ఉండరు. ముఖ్యంగా మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రాత్రి టైంలో ఆరుబయట నిద్రిస్తుంటారు. అలాంటి వారికి దోమలు కుట్టే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా వారికి మలేరియా, డెంగ్యూ, జికా వైరస్ సోకే రిస్క్ పెరుగుతుంది. ఇక ఇళ్లలోకి కూడా దోమలు ప్రవేశించి హల్‌చల్ చేస్తుంటాయి. సాయంత్రం తర్వాత ఇంటి తలుపులు, కిటికీలను తెరిస్తే చాలు.. దోమలు ప్రవేశించి కుట్టడం మొదలు పెడుతుంటాయి. ఇటువంటి తరుణంలో దోమలను(Summer Vs Mosquitoes) కంట్రోల్ చేసేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.

We’re now on WhatsApp. Click to Join

  • తెల్లవారుజామున, సాయంత్రం టైంలో దోమలు యాక్టివ్​గా ఉంటాయి. ఆ సమయంలో తలుపులు, కిటికీల నుంచి ఇంట్లోకి దోమలు ప్రవేశించకుండా వాటికి అడ్డుగా మెస్ పెట్టాలి.
  • దోమల రిప్లెంట్స్‌ను కూడా వాడొచ్చు. ఇవి దోమలతో పాటు ఈగల బెడదను కూడా తగ్గిస్తాయి.
  • డీఈఈటీ, పికారిడిన్ లేదా నిమ్మకాయ, యూకలిప్టస్ నూనెను కూడా దోమలను తగ్గించుకోవడం కోసం వినియోగించవచ్చు. ఇవి దోమలకు వ్యతిరేకంగా బాగా పనిచేస్తాయి.
  •  దోమలు కుట్టకుండా పిల్లలకు కాటన్ దుస్తులను ఫుల్​ హ్యాండ్స్ ఉన్నవి వేయాలి. పెద్దవారు కూడా ఫుల్​గా ఉండే కాటన్ దుస్తులు వేసుకోవాలి. లేదంటే సాక్స్​లు వేసుకోవాలి.
  • సువాసన ఉన్న సబ్బులు, పెర్ఫ్యూమ్స్​, లోషన్స్ ఉన్నచోటుకు  దోమలు ఎక్కువగా వస్తాయి.  అలాంటి వస్తువులు ఇంట్లో బయట పెట్టకుండా జాగ్రత్తపడాలి. సువాసన లేని సబ్బులు వాడితే బెటర్.
  • బయట నుంచి మన ఇంట్లోకి వచ్చే దోమలను సిట్రోనెల్లా కొవ్వొత్తులు అడ్డగిస్తాయి.

Also Read : Patanjali Apology Ads : సుప్రీంకోర్టు వార్నింగ్.. క్షమాపణలతో న్యూస్‌పేపర్లలో పతంజలి ‘బిగ్’ యాడ్స్

  • మొక్కలకు పెట్టిన నీరు.. పక్షుల కోసం పాత్రలలో పోసిన నీరు ఎక్కువ కాలం నిల్వ ఉన్నా.. వాటిలో దోమలు సంతానాన్ని పెంచుకుంటాయి.
  • పూల కుండీలు, మొక్కల దగ్గర నీరు నిలిచిపోకుండా చూడాలి.
  • ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
  • ఇంట్లో డస్ట్ బిన్ ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. దాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచినా దోమల హల్‌చల్ పెరుగుతుంది.

Also Read :AC on Rent : సమ్మర్ నీడ్.. ఏసీ కొనలేరా.. రెంటుకు తీసుకోండి !