Three Foreign Women : భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ముగ్గురు బ్రిటీష్ మహిళలు.. ఎవరు ?

Three Foreign Women : స్వాతంత్ర్య పోరాటం.. ఎన్నో లక్షల మంది అలుపెరుగని పోరాటాల కలయిక.. స్వాతంత్య్రం.. ఎన్నో లక్షల మంది  పోరాటాల ఫలితం.. బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా ఎంతోమంది భారతీయులు రాజీలేని పోరాటం చేశారు..

  • Written By:
  • Updated On - August 14, 2023 / 09:00 AM IST

Three Foreign Women : స్వాతంత్ర్య పోరాటం.. ఎన్నో లక్షల మంది అలుపెరుగని పోరాటాల కలయిక.. 

స్వాతంత్య్రం.. ఎన్నో లక్షల మంది  పోరాటాల ఫలితం..

బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా ఎంతోమంది భారతీయులు రాజీలేని పోరాటం చేశారు..

అయితే ముగ్గురు విదేశీ మహిళలు కూడా మేము సైతం అంటూ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు.. 

వారే.. అనీబీసెంట్, మేడ్‌లీన్ స్లేడ్ (మీరా బెన్), క్యాథరీన్ హీల్మన్ (సరళ బెన్).

ఈ ముగ్గురి  నేపథ్యం, పోరాటం గురించి తెలుసుకునే ప్రయత్నం  చేద్దాం.. 

Also read : Onions : ఉల్లిపాయను బిర్యానీతో పాటు తింటున్నారా.. అయితే సమస్యలు తప్పవు..

అనీ బీసెంట్  

  • అనీ బీసెంట్ లండన్‌లో జన్మించారు. ఆమె ఐరిష్ సంతతి మహిళ.
  • బీసెంట్ బౌద్ధ, హిందూ, ప్రాచీన ఈజిప్ట్ ఆధ్యాత్మిక గ్రంథాలనూ చదివారు. బీసెంట్ మంచి వక్త.
  • కొన్ని రోజుల పాటు ఇండియాలో పర్యటించి వెనక్కి వెళ్లాలనే ఆలోచనతో భారత్‌లో అడుగుపెట్టిన బీసెంట్ 40 ఏళ్ల పాటు భారత్‌లోనే ఉండిపోయారు.
  • మధురై, తిరునల్వేలి, హైదరాబాద్‌లో ప్రసంగాలు చేశారు.
  • హిందూ మతం, ఆకర్షణ శక్తి, శాఖాహారం గురించి ప్రసంగాలిచ్చారు. దీంతో ఆమెకు లండన్ యూనివర్సిటీ డిగ్రీ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ నిర్ణయం ఆమె భారత్‌లో యూనివర్సిటీ స్థాపించాలనే ఆలోచనకు బీజం వేసింది.
  • బీసెంట్ బెనారస్‌లో సెంట్రల్ హిందూ బాయ్స్ స్కూల్ స్థాపించారు. ఇందుకోసం బెనారస్, కశ్మీర్ రాజులు ఆమెకు స్థలం, విరాళాలను ఇచ్చారు.
  • 1904లో ఆమె రెసిడెన్షియల్ హిందూ బాలికల పాఠశాల కూడా స్థాపించారు.
  • భారతీయ సంస్కృతిని ఆకళింపు చేసుకుని, భారత రాజకీయ, విద్యా రంగంలో చెరగని ముద్ర వేశారు.
  • ఆమెను దక్షిణ భారతదేశంలో పెరియమ్మ అని ఉత్తరాదిలో బడీ మేమ్ సాహిబ్ అని పిలిచేవారు.
  • అనీ బీసెంట్ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన కొన్ని వ్యాఖ్యల కారణంగా ఆమెను అరెస్టు చేశారు. ఆమె అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేశారు. 1917లో ఆమెను విడుదల చేశారు.
  • అనీ బిసెంట్ 1917లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.
  • అనీ బీసెంట్ స్వదేశీ ఉద్యమంలో పాల్గొనలేదు.
  • ఆమె భారతీయ సంస్కృతిని, కట్టుబాట్లను, ఆచారాలను ప్రేమిస్తూనే బ్రిటిష్ వారికి విశ్వాసపాత్రురాలుగా కూడా ఉండేవారు.
  • భారతదేశంలో జిల్లాలకు, గ్రామ కౌన్సిల్‌కు ఎక్కువ అధికారాలివ్వాలని బ్రిటిష్ పాలకులను అనీ బీసెంట్ అడిగేవారు.
  • ఇంగ్లిష్ మహిళల కంటే భారతీయ మహిళలకు ఓటు హక్కు ఎక్కువ అవసరమని ఆమె తన ప్రసంగాల్లో చెప్పారు.

Also read : Abdul Kalam-Grinder : అబ్దుల్ కలాం.. ఒక చెక్కు.. ఒక గ్రైండర్.. స్ఫూర్తి రగిల్చే స్టోరీ

మీరా బెన్‌గా మారిన మేడ్‌లీన్ స్లేడ్(Three Foreign Women)

  • మేడ్‌లీన్ స్లేడ్ బ్రిటన్‌కు చెందిన ఉన్నత వర్గ కుటుంబంలో పుట్టారు.
  • ఫ్రెంచ్ రచయిత రొమైన్ రోలండ్‌తో సంభాషణల్లో వచ్చిన గాంధీ ప్రస్తావన ఆమెను గాంధీ విధానాలకు ఆకర్షితురాలిని చేసింది.
  • మేడ్‌లీన్ స్లేడ్ గాంధీని కలవాలనే కోరికను వ్యక్తం చేస్తూ లేఖ రాసి, ఆ ఉత్తరంతో పాటు 20 పౌండ్ల చెక్ కూడా పంపారు.
  • ఆ ఉత్తరం చదివిన గాంధీ ఆమెకు వెంటనే ఆహ్వానం పంపలేదు.”ఒక సంవత్సరం తర్వాత కూడా నీకు రావాలని అనిపిస్తే అప్పుడు భారత్‌కు రావడానికి సరైన సమయం” అని గాంధీ ఆమెకు సమాధానమిచ్చారు.
  • సంవత్సరం తర్వాత కూడా మేడ్‌లీన్ స్లేడ్ నిర్ణయాన్ని మార్చుకోలేదని చెబుతూ, “భారతీయ తత్త్వం గురించి చదువుతున్నకొద్దీ, నేనెప్పుడో కోల్పోయిన ఇంటిని చేరుతున్నట్లుగా అనిపిస్తోంది” అని గాంధీకి సమాధానమిచ్చారు. ఆమెకు ఆశ్రమానికి వచ్చేందుకు అనుమతి లభించింది. అప్పటికి ఆమె వయసు  33 ఏళ్ళు.
  • ఆమెను గాంధీ కూతురుగా భావించి మీరా బెన్ అని పేరు పెట్టారు.
  • మఠం వేసి కూర్చోవడం నేర్చుకున్నారు. శాఖాహారం అలవాటు చేసుకున్నారు. మద్యం మానేశారు. హిందీ నేర్చుకున్నారు. చీర కట్టుకోవడం నేర్చుకున్నారు.
  • బ్రహ్మచారిణిగా ఉండాలని నిర్ణయించుకుని గుండు కూడా చేయించుకున్నారు.
  • గాంధీ రాసే రచనలను మేడ్‌లీన్ స్లేడ్ సరిదిద్దేవారు.
  • గాంధీజీకి పండ్లు ఒలిచి ఇవ్వడం, ఆయన బీపీ చూడటం లాంటి పనులను చేసేవారు.
  • అయితే మీరా బెన్ తన 40లలో ఆశ్రమంలోని పృథ్వీ సింగ్ అనే విప్లవకారునితో ప్రేమలో పడ్డారు. కానీ, పృథ్విసింగ్ ఆమె ప్రేమను అంగీకరించకపోవడంతో ఆ ప్రేమ పెళ్లికి దారి తీయలేదు.
  • ప్రేమలో వైఫల్యం మీరా బెన్‌ను బాగా కుంగదీసింది. హిమాలయాలకు వెళ్లారు.
  • సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత ఆమె కూడా మూడు నెలల పాటు జైలులో ఉన్నారు.
  • జైలు నుంచి విడుదలైన తర్వాత హరిద్వార్ వెళ్లి అక్కడ ఆశ్రమాన్ని స్థాపించారు.
  • భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆమె దిల్లీ వచ్చారు.
  • గాంధీ మరణం తర్వాత దేశంలో నెలకొన్న రాజకీయ స్థితిని చూసి ఆమె కలవరపడ్డారు. దేశంలో అవినీతి పెరిగిపోతోంది అంటూ ఆమె ప్రధాని నెహ్రూకి లేఖ రాశారు.
  • దేశంలో స్వాతంత్ర్యం తర్వాత నెలకొన్న రాజకీయ పరిస్థితులలో ఇమడలేక 1959లో వియన్నా వెళ్లారు.
  • 1982లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించింది.
  • రిచర్డ్ అటెన్‌బరో నిర్మించిన గాంధీ చిత్రానికి కావల్సిన సమాచారాన్ని చాలా వరకు మీరా బెన్ అందచేసినట్లు ‘ది న్యూ యార్క్ టైమ్స్’ కథనం పేర్కొంది.

Also read : UK Visa: యూకే వెళ్లడానికి వీసా కావాలా..? అయితే ఈ హోటళ్లలో వీసా కోసం దరఖాస్తు చేసుకోండి..!

సరళ బెన్‌గా మారిన క్యాథరీన్ మేరీ హీల్మన్

  • క్యాథరీన్ మేరీ హీల్మన్ 1901లో లండన్‌లో జన్మించారు.
  • మోహన్ సింగ్ మెహతా అనే భారతీయ అధికారి దగ్గర గాంధీ గురించి విన్న ఆమె భారతదేశానికి వచ్చారు.
  • భారత్ వచ్చిన కొత్తలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఒక పాఠశాలలో పని చేసేవారు.
  • భారతదేశం అంతా పర్యటించి చివరకు వార్ధా ఆశ్రమం చేరుకున్నారు. అక్కడే ఆమె వినోబా భావేను కూడా కలిశారు. తన పేరును సరళ బెన్‌గా మార్చుకున్నారు.
  • 1941లో హిమాలయాల్లో ఉన్న చనౌదా ఆశ్రమంకు వెళ్లారు. హిందీలో ప్రావీణ్యం సంపాదించారు. నెమ్మదిగా నూలు వడకడం, నేయడం మొదలుపెట్టారు.
  • 1942లో గాంధీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఆ సమయంలో కాంగ్రెస్‌తో సంబంధం ఉన్న అందరినీ అరెస్ట్ చేయడం ప్రారంభించారు.
  • సరళ ఈ నిరసనలకు దూరంగా ఉంటూ స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు సహకారం అందిస్తూ ఉండేవారు. వారికి ఆహారం, ఔషధాలు, న్యాయ సలహాలు ఇవ్వడం, సందేశాలు చేరవేయడం లాంటి పనులు చేస్తూ ఉండేవారు.
  • సరళ ఇంగ్లీష్ మహిళ కావడంతో ఆమెను అరెస్టు చేయలేదు. కానీ, ఆమె కదలికల పై నిఘా పెట్టమని మాత్రం ఆదేశించారు.
  • బ్రిటిష్ అధికారుల ఆదేశాలకు లొంగకపోవడంతో ఆమెను అరెస్టు చేసి అల్మోరా జైలుకు పంపారు.  ఆమె వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి ఆమెకు మూడు నెలల జైలు శిక్ష విధించారు.
  • కస్తూర్బా మరణం తర్వాత మెమోరియల్ ఫండ్ కోసం సెప్టెంబరు 1944 నాటికి ఆమె రూ. 45,000 విరాళాలు సేకరించారు.
  • ఆమెను తిరిగి అరెస్టు చేసి ఒక ఏడాది పాటు జైలు శిక్ష విధించారు. ఆమె పర్యటనలను ఆపేస్తే విడుదల చేస్తామని చెప్పారు. అయితే, ఆమె మాత్రం అందుకు అంగీకరించకపోవడంతో ఆమెను లక్నోలో జైలుకు పంపారు.
  • సరళాబెన్ 1950, 60 దశాబ్దాలలో చండి ప్రసాద్ భట్, సుందర్ లాల్ బహుగుణ, విమలా బహుగుణ, రాధాభట్ వంటి ఎంతోమంది సామాజిక కార్యకర్తలను తీర్చిదిద్దారు.
  • ఆమె తండ్రి తిరిగి తమ దేశానికి రమ్మని అడిగినా కూడా తన దేశానికి వెళ్లకుండా భారతీయుల కోసమే పని చేశారు.
  • ఆమె 1982 జులై 6న సరళ బెన్ మరణించారు. గాంధేయవాదులను నిజాయితీగా ఉండమని సందేశాన్నిచ్చారు.