TRS VS BJP: వినాయకుడికి ‘రాజకీయ‘ రంగులు

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా మారింది.

  • Written By:
  • Updated On - August 27, 2022 / 08:59 PM IST

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా మారింది. ఈ నేపథ్యంలో పండుగలకు రాజకీయ రంగులను పులుముతున్నాయి. ఈ నేపథ్యంలో వినాయకుడికి రాజకీయ సెగ తగిలింది. గణేష్ ఉత్సవాలతో ప్రజలకు చేరువయ్యేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అందుకే ప్రతిఏడాది వినూత్న కార్యక్రమాలు చేస్తూ హిందువులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ ఇయర్ మాత్రం బీజేపీకి చెక్ పెట్టడానికి టీఆర్‌ఎస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ నాయకులు నిధులు ఇవ్వాలని, వేడుకలలో చురుకుగా పాల్గొనాలని, 11 రోజుల పాటు ప్రతి రోజు గణేష్ మండపాలను సందర్శించి నిమజ్జన రోజులో పాల్గొనాలని వ్యూహ రచన చేస్తున్నారు. గణేష్ ఉత్సవాల్లో బిజెపి నాయకులు చురుకైన పాత్ర పోషిస్తారనే భావన ప్రజల్లో ఉందని, దీని కారణంగా ప్రతి సంవత్సరం పార్టీ దృష్టిని ఆకర్షిస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది హైదరాబాద్ లోనే కాకుండా అన్ని జిల్లాల్లోనూ తన సత్తా చాటాలని టీఆర్ఎస్ భావిస్తోంది.

యువజన సంఘాలు, కాలనీ సంఘాలు తదితర సంఘాల ద్వారా మండపాల ఏర్పాటుకు నగదు, ఇతర విరాళాలు ఇవ్వాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. 11 రోజుల పాటు అన్నదానాలు, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ మాట్లాడుతూ.. “రాజకీయ మైలేజ్ కోసం గణేష్ ఉత్సవాల సందర్భంగా దృష్టిని ఆకర్షించడానికి బిజెపి నాయకులు మండపాల వద్ద పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారు. మండపాల ఏర్పాటుకు లేదా సామాజిక సేవా కార్యక్రమాలకు ఎటువంటి ఆర్థిక సహాయం చేయరు. కానీ టీఆర్‌ఎస్ వివిధ సంఘాలకు మండపాలు ఏర్పాటు చేయించడం, ఆర్థిక సహాయం చేయడంతోపాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు సహకరిస్తోంది. ఈ కార్యక్రమాల కోసం నా నియోజకవర్గంలో రూ.15 లక్షలు విరాళంగా ఇస్తాను.

ఖైరతాబాద్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. ‘‘నా నియోజకవర్గంలోని ఖైరతాబాద్ గణేష్ దేశ దృష్టిని ఆకర్షిస్తున్నారని.. ప్రతి రోజూ ఒక వీఐపీ లేదా వీవీఐపీ ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకునేందుకు వస్తుంటారు. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా పెద్దగా కార్యకలాపాలు జరగలేదు. ఈ ఏడాది సాధారణ స్థితికి చేరుకుంది. ఈ ఏడాది నియోజకవర్గంలోని అన్ని గణేష్‌ మండపాల వద్ద టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ చురుగ్గా పాల్గొంటారు. నేను స్వయంగా ప్రతిరోజు డజను పందిళ్లను సందర్శించి పూజల్లో పాల్గొంటాను.