Viral Video:సైనికుడిని కాపాడిన స్మార్ట్ ఫోన్…ఎలాగంటే..?

మొబైల్ ఫోన్...ఓ ఆర్మీ జవాను ప్రాణాలు కాపాడింది. అదీ బుల్లెట్ తగలకుండా..అదేలా అనే కదా మీ అనుమానం.

  • Written By:
  • Updated On - April 25, 2022 / 12:41 AM IST

మొబైల్ ఫోన్…ఓ ఆర్మీ జవాను ప్రాణాలు కాపాడింది. అదీ బుల్లెట్ తగలకుండా..అదేలా అనే కదా మీ అనుమానం. బుల్లెటును అడ్డుకునేంత సీన్ మొబైల్ కు ఉందా..అంటే అవుననే అంటున్నాడు ఉక్రెయిన్ కు చెందిన ఓ జవాన్. మొబైల్ ఫోన్ ఆ సైనికుడి ప్రాణాలు ఎలా కాపాడిందనే కదా మీ డౌట్..తెలుస్తే షాక్ అవడం ఖాయం.

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్దంలో ఓ సైనికుడు తన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ తో ప్రాణాలు కాపాడుకున్నాడు. దూసుకువస్తున్న బుల్లెట్ల నుంచి తప్పించుకునేందుకు పాకుతూ వెళ్తున్న ఓ ఉక్రెయిన్ జవాన్ వైపు ఓ బుల్లెట్ రాకేట్ లా దూసుకువచ్చింది. తన పయింట్ బ్యాక్ సైడ్ తన సెల్ ఫోన్ ను ఉంచాడు. అదే సమయంలో వెనకాల నుంచి వచ్చిన బుల్లెట్ మొబైల్ ఫోన్ పై పడింది. అందులోనే ఇరుక్కుపోయింది తన పాకెట్ నుంచి ఫోన్ తీయగా…ఫోన్ వెనక భాగంలో బుల్లెట్ ను చూసి ఆ జవాన్ ఖంగుతిన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.