Sleep@Office : ఆఫీస్ లో కునుకు తీసేందుకు.. ఒక బాక్స్!!

ఓవర్ టైం వర్క్.. అనగానే మనకు జపాన్ ప్రజలే గుర్తుకొస్తారు. ఓవర్ టైం వర్క్ చేసే క్రమంలో చాలామంది బాత్ రూమ్ కు వెళ్లి కునుకు తీసి వస్తుంటారట. ఇలా కొన్ని నిమిషాలు బాత్ రూమ్ లలోనే కూర్చోవడం వల్ల ఆరోగ్యం పై నెగెటివ్ ఎఫెక్ట్ పడుతోంది.

  • Written By:
  • Publish Date - July 19, 2022 / 08:00 PM IST

ఓవర్ టైం వర్క్.. అనగానే మనకు జపాన్ ప్రజలే గుర్తుకొస్తారు. ఓవర్ టైం వర్క్ చేసే క్రమంలో చాలామంది బాత్ రూమ్ కు వెళ్లి కునుకు తీసి వస్తుంటారట. ఇలా కొన్ని నిమిషాలు బాత్ రూమ్ లలోనే కూర్చోవడం వల్ల ఆరోగ్యం పై నెగెటివ్ ఎఫెక్ట్ పడుతోంది. ఇలాంటి వారికి సౌకర్యవంతమైన, ఆరోగ్యవంతమైన కునుకు తీసే వెసులుబాటును కల్పిస్తే.. ఆఫీస్ లో మరింత బాగా పని చేయగలుగుతారు. కునుకు తీసే ఆ సౌకర్యం ఏంటి తెలుసా ? ఎలా కునుకు తీయాలో తెలుసా ? సౌకర్యవంతంగా నిలబడి కునుకు తీసేందుకు ఉపయోగపడే “న్యాప్ బాక్స్” లు ఆవిష్కృతమయ్యాయి. వాటిని Itoki Corporation అనే ఫర్నిచర్ కంపెనీ, ప్లై వుడ్ కంపెనీ Koyoju Gohan KK సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశాయి. “న్యాప్ బాక్స్” లు కావాలంటూ ఇప్పటికే పలు కార్పొరేట్ కంపెనీల నుంచి వాటికి ఆర్డర్లు కూడా లభించాయి. ఇంతకీ “న్యాప్ బాక్స్” లో ఎలా నిద్రపోవాలి అనే డౌట్ వస్తోందా ? ఫ్లెమింగో పక్షిలా ఒక కాలుపై నిలబడి.. ముందుకు తలవాల్చి నిద్రపోవచ్చు.

ఫ్లెమింగో పక్షి ఒంటి కాలుపై 3 నుండి 4 గంటలు నిలబడగలదు. అదే సూత్రాన్ని పాటిస్తూ “న్యాప్ బాక్స్” తయారు చేశారు. ఇకపై జపాన్ లోని కొన్ని కంపెనీల్లో వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. బాగా నిద్ర వచ్చిన వాళ్ళు వెళ్లి న్యాప్ బాక్స్ లో ఒక కునుకు తీసి వచ్చే వెసులుబాటు కల్పిస్తారు. ఫలితంగా ఉద్యోగుల పనితీరు ఎన్నో రెట్లు మెరుగు అవుతుందని అంటున్నారు. ఈ తరహా కొత్త ఆవిష్కరణలు ఉద్యోగుల పాలిట ఆశాకిరణాల వంటివనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.