Quit Smoking : పొగత్రాగడం మానెయ్యాలనుకుంటున్నారా? ఎలా?

ముందుగా పొగతాగడం మానెయ్యాలి అని అనుకున్నప్పుడు మన చుట్టూ అలాంటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి.

  • Written By:
  • Publish Date - May 19, 2023 / 10:00 PM IST

సిగరెట్లు, బీడీలు, చుట్టలు తాగడం వలన గుండెకు(Heart) సంబంధించిన జబ్బులు, నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్ లు వస్తాయి. పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలిసిందే కానీ దానిని పాటించడం పొగత్రాగడం అలవాటు అలవాటు అయిన వారికి కష్టమైన పని. కానీ ఒకసారి పొగతాగడం మానెయ్యాలి అని అనుకుంటే గట్టిగా ప్రయత్నించాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. పొగతాగడం(Smoking) వలన దానిలో ఉండే నికోటిన్ మన మెదడులో(Mind) డోపమిన్ అనే రసాయనం విడుదల అయ్యేలా చేస్తుంది అది మనిషిలో ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువగా పొగతాగడానికి ఇష్టపడతారు. పొగతాగడం మానేసినప్పుడు వెంటనే వారిలో డోపమిన్ స్థాయి తగ్గి వారిలో నిరాశ, నిస్పృహ వంటివి మొదలవుతాయి. అప్పుడు మళ్ళీ పొగతాగడానికి ఇష్టపడతారు.

కాబట్టి ముందుగా పొగతాగడం మానెయ్యాలి అని అనుకున్నప్పుడు మన చుట్టూ అలాంటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. అంటే మన సన్నిహితులకు, మన ఇంటిలో వారికి పొగ తాగడం మానెయ్యాలి అని అనుకుంటున్నాను అని చెప్పాలి. అప్పుడు వారు ఎంతో ఆనందంతో మీకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తారు. మీతో పాటు ఎవరైతే మానెయ్యాలి అనుకుంటున్నారో వారిని అందరిని కలిపి ఒక గ్రూప్ గా చేసుకొని వారితో పాటుగా ఉండాలి. మీరు పొగ తాగడం మానేసినప్పటి నుండి మీకు ఎప్పుడు ఎక్కువగా పొగ తాగాలని అనిపిస్తుందో అప్పుడు కంట్రోల్ చేసుకోవాలి.

కొంతమందికి భాదగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు, ఒత్తిడిగా అనిపించినప్పుడు, ఏదయినా ఒక పని చేసినప్పుడు పొగ తాగాలని అనిపిస్తుంది. అప్పుడు మనం ఆ సమయంలో మన దగ్గర ఆరోగ్యకరమైన చిరుతిండి లేదా చూయింగ్ గమ్స్, ఇన్ హేలర్, నికోటిన్ ప్యాచ్ లు ఇలా ఏవైనా దగ్గర ఉంచుకోవాలి. ఈ విధంగా పొగతాగడం అవాయిడ్ చేయడానికి ప్రయత్నించాలి. పొగతాగడం నుండి బయట పడాలి. ధ్యానం, యోగా వంటివి చేయడం ద్వారా మన మనసును పొగ తాగడం అనే ఆలోచన నుండి తప్పించుకోవాలి.

 

Also Read : Figs Side Effects: అంజీర్ పండ్లు మితిమీరి తీసుకుంటే ఆ సమస్యలు తప్పవు?అంజీర్ పండ్లు మితిమీరి తీసుకుంటే ఆ సమస్యలు తప్పవు?