Vizag: విశాఖ హాట్ గురూ, కేంద్ర పాలిత ప్రాంతంగా బీజేపీ పరిశీలన?

ఒక్కోసారి ప్రజా నాడిని తెలుసు కోవడానికి , పార్టీలను ఇరుకున పెట్టడానికి కొన్ని వార్తలను ప్రచారం చేస్తూ ఉంటారు. అలాంటి ఒక వార్త ఇప్పుడు ఎ.పి లో రాజకీయ

  • Written By:
  • Updated On - March 4, 2023 / 05:28 PM IST

ఒక్కోసారి ప్రజా నాడిని తెలుసు కోవడానికి , పార్టీలను ఇరుకున పెట్టడానికి కొన్ని వార్తలను ప్రచారం చేస్తూ ఉంటారు. అలాంటి ఒక వార్త ఇప్పుడు ఎ.పి లో రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చింది. విశాఖను (Vizag) కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయట. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం లోపాయి కారీగా విచారణ చేయిస్తోందట. అసలేమిటి కేంద్ర పాలిత ప్రాంతం అంటే ? దేశ మంతటిలో విభిన్న చరిత్ర కలిగి , సాస్కృతిక వారసత్వం కలిగుండి , కొన్ని ప్రాంతాలను , భౌగోళికంగా ప్రధాన భూభాగా నికి దూరంగా ఉండే ప్రదేశాలు అంతరాష్ట్ర వివాదాల కార ణంగా కేంద్ర ప్రభుత్వం చేత పాలించవల్సి వచ్చిన ప్రాంతా లను కేంద్ర పాలిత ప్రాంతా లుగా ఏర్పరచుతారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికి లెఫ్ట్ నెంట్ గవర్నర్ ని నియమిస్తుంది . ఆ అధికారే ఈ ప్రాంతీయ ప్రభుత్వానికి అధినేత. ఇక్కడ విధాన సభ ఉండదు. అయితే కొన్ని విధాన సభలు ఉన్న ప్రాంతా లు కూడా ఉన్నాయి. అటువంటి వాటిల్లో ముఖ్య మంత్రి పదవి కూడా ఉంటుంది. ఢిల్లీ , పుదుచ్చేరి లకు శాసనసభ ఉంది. ఎన్ని కలు జరిగి శాసన సభ్యులవు తారు.

అయితే దీనికి ఎగువ సభ ( విధాన సభ ) ఉండదు. దీన్ని పాక్షిక రాష్ట్రం అనవచ్చు. విశాఖను (Vizag) కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే ఎటువంటి పరి స్థితులు నెలకొనే అవకాశం ఉందో కేంద్రం పరిశీలిస్తున్న దట. గతంలో హైద్రాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రక టించే ప్రతిపాదన వచ్చిన ప్పుడు , తెలంగాణాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు , ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించ డంతో , ఆ ప్రతిపాదన అట కెక్కింది. ఇప్పుడు ఎ.పి లోని రాజకీయ పార్టీలు ఏ స్థితిలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఆరా తీస్తోందట. విభజన హామీల కోసం నోరెత్తని ఎ.పి పార్టీలు , కేంద్రం పై పోరాటం చెయ్య లేవని కేంద్రం ఒక అవ గాహనకు వచ్చిందట. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు తల ఒగ్గే పరిస్థితులు ప్రస్తుతం ఎ.పి లో ఉన్న రాజకీయ పార్టీలకు ఉందని కేంద్రం భావిస్తోం దట. పార్టీలు విడి విడిగా బద్ధ వైరంతో కొట్లాడు కుంటున్నా , ఎవరికి తగ్గ బొక్కలు వారికున్న కారణాన కేంద్ర నిర్ణయాలకు డూ డూ బసవన్న లాగా రాజ్య సభలో కేంద్రానికి అనుకూ లంగా అన్ని పార్టీలు ఆమోది స్తూనే ఉన్నాయి.

ఇప్పుడూ అదే జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారట. వామ పక్ష పార్టీలతో సహా అన్నీ కల్సి కట్టుగా వ్యతిరేకిస్తేనే కేంద్రం వెనకడుగు వేస్తుంది. కానీ కేంద్రం ఇదే విషయాన్ని చాలా సీరియస్ గా పరిశీలిస్తోందట. కేంద్రం ఇలా ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. భారత్ లో ఇలాంటివి 7 ప్రాంతాలున్నాయి. ఢిల్లీ, పుదు చ్చేరి , లక్ష దీవులు , అండమాన్ నికోబార్ దీవులు , దాద్రా నగర్ హవేలీ, చండీగడ్ , డయ్యూ – డామన్ లు. చట్ట సభలు ఉన్నవి ఢిల్లీ , పుదుచ్చేరి లు కాగా మిగతావి చట్ట సభలు లేని ప్రాంతాలు. వీటికి రాష్ట్రాలకు ఉండే హక్కులు , అధికారా లుండవు. జమ్మూ – కాశ్మీర్ , లాద్ధాఖ్ లను కూడా కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించాలనే ప్రయత్నాలు జరుగు తున్నవట. ఎ.పి లోని వై.సి.పి ప్రభుత్వం మాటి మాటికి మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెస్తోందని , ఈ రచ్చను ఆసరాగా తీసుకుని విశాఖను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే ఎలా ఉంటుందనేది పరిశీలిస్తోందట.

కేంద్రం చొరబాటుకు కొన్ని దేశరక్షణకు సంబంధించిన అంశా లున్నాయి. సుధీర్ఘ సముద్ర తీరం , నౌకాయాన పోర్టులు , ఉన్న కారణాన దేశ రక్షణకు బందోభస్తు ఏర్పాటు చెయ్య వలసిన పరిస్థితి ఉందని , ఒక సారి పాకిస్థాన్ జలాంతర్గామి ద్వారా దాడి చెయ్యాలని చూసి విఫలం అయ్యిందని అందుకే ఇది రక్షణ ప్రాంతం కిందకు వస్తుందని , దాన్ని సాకుగా చూపించే ఆలోచన కేంద్రం చేస్తోందని చెబుతున్నారు. ఇప్పటికే ఈ విషయం పై మంత్రివర్గంలో చర్చించారని , ఉన్నతాధి కారులతో చర్చలు కూడా జరిగా యని చెబుతున్నారు. త్వరలో ఈ ప్రతిపాదనను వెలువరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే ఋషీ కేశ్ లో కొండను తొలచి సి. ఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసే అవకాశం ఉందని అను మానం వ్యక్త పరుస్తున్నారట. ప్రకటనకు తగిన కారణాలు చూపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కూడా తెలుస్తోంది. విశాఖలో పెద్ద ఎత్తున కేంద్ర సంస్థ లున్నాయి. చైనా, పాకిస్థాన్ దేశాలతో ఉన్న వైరం కారణాన , అందున సుధీర్ఘ సముద్ర తీరం ఉన్నందున, కేంద్ర పరిశ్రమలు , నౌకా పోర్టులు , రైల్వే సదుపాయం , విమాన సౌలభ్యం ఉన్న కారణాన , ఆర్ధిక రాజధానిగా విరాజిల్లే అవకాశం ఉన్న ప్రాంతంగ గుర్తింపు వస్తుంది కాబట్టి శతృవుల కళ్ళు విశాఖ (Vizag) పై పడాతాయి.

పోర్టులు ఉన్నవి కనుక రవాణా సులభ తరం అవుతుంది. విశాఖకు ముప్పు పేరిట కేంద్ర పాలిత ప్రాంతం చెయ్యడానికి తన వాదనలను కేంద్రం సిద్ధం చేసుకుందట. విభజన ద్వారా నష్ఠ పోయిన ఎ.పి , విభజన హామీలు నెరవేరుస్తానని చెప్పిన కేంద్ర పార్టీల వైపు చూస్తున్నారు ఎ.పి ప్రజలు. కానీ కేంద్రం ప్రత్యేక హోదా అనే పదమే తీసివేసామని , ఖరా ఖండితంగా బి.జె.పి ప్రభుత్వం సభాముఖంగా తెలియ జేసింది. దీనిపై పోరాడ డానికి వై.సి.పి , టి.డి.పి సిద్ధంగా లేవు. స్వప్రయోజనాలు ఎవరివి వారికి ఉన్నాయని , అందుకే మౌనం వహిస్తున్నారని , ప్రజలకు అనుమానం వస్తోంది. వై.సి.పి విశాఖను (Vizag) కార్య నిర్వాహక రాజధాని అని ప్రకటించి వడి వడిగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తోంది. గతంలో హైద్రాబాద్ పై ఇదే విషయం పై చర్చ వచ్చి నప్పుడు మూకుమ్మడిగా అన్ని పార్టీలు వ్యతిరేకించాయి. భారత రాజ్యాంగ రచన చేసిన అంబేద్కర్ కూడా హైద్రాబాద్ ను రెండవ రాజధానిగా చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు కూడా మేలు జరుగుతుందని సూచించారు. కనీసం అంబేద్కర్ ప్రతిపాదన చూపి అయినా ఆ ప్రయత్నం కాంగ్రెస్ చెయ్యలేదు , బి.జె.పి కూడా చెయ్యలేదు.

తూతూ మంత్రంగా అంబేద్కర్ ప్రతిపాదనను సభలో చదివి , అంబేద్కర్ కన్నా మేమే గొప్పవారము , మీ తెలంగాణాకు న్యాయం చేస్తున్నామని గొప్పలు చెప్పుకున్నాయి కాంగ్రెస్ , బి.జె.పి పార్టీలు. పైగా విభజనకు నిర్ణయం తీసుకుని , అంతా సిద్ధం చేసుకున్నాక , అంతా టెంక్షన్ వాతావరణంలో రెండో రాజధాని , కేంద్ర పాలిత ప్రాంతమనే ప్రతిపాదన తేవడంతో అది సోది లోకి కూడా రాకుండా కొట్టుకు పోయింది. అయినా ఇప్పటికి కూడా బి.జె.పి ఆ ప్రతిపాదనను తీసుకు రావొచ్చు. అది వదిలేసి ఎ.పి పై పడుతోంది బి.జె.పి ప్రభుత్వం. ఎ.పిలోని అగ్ర పార్టీలకు ఉన్న బొక్కలను ఆసరాగా చేసుకుని విశాఖను గుప్పెట పెట్టు కోవాలనే పన్నాగంతో బి.జె.పి ముందుకు సాగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్రులు ఆరంభ సూరులని ఏ విషయాన్నీ సీరియస్ గా తీసుకోరని , అసలు ముందు వారికి తమ రాష్ట్రం పైన ప్రేమ లేదని , నోరు గల వాళ్ళు , కాస్త స్థితి మంతులు ఇతర రాష్ట్రా లకు వలస పోయారని , యువకులు విదేశాలకు , హైద్రాబాద్ , బెంగుళూర్ , చెన్నై లాంటి ప్రాంతాల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డారని , వారికి రాజకీయ సృహ , రాష్ట్రం పై ప్రేమా లేవని , ఒక వేళ ఉన్నా అది ఉద్యమ బాట పట్టేంతగా లేదని , ఇక హైద్రాబాద్ లో స్థిర నివాసాలు ఏర్పరచుకున్న వారు గోడ మీద పిల్లి వాటంగా వ్యవహ రిస్తారని , వారికి కె.సి.ఆర్ ఒక భూతంలా కనిపిస్తాడని , రాష్ట్రం వదిలి వచ్చాం , దశా బ్ధాలుగా ఉంటూ ఆస్తులు పోగేసుకున్నాం , ఎ.పి ఏమైతే మన కెందుకులే , అక్కడి మన ఆస్తులైతే ఎవడూ పీకేది లేదని అనుకుంటారని బి.జె.పి భావిస్తోందట.

గతంలో మాన్సాస్ భూముల విషయంలో పెద్దగా గొడవలు చేయలేదని , విశాఖ (Vizag) ఉక్కు ఆక్రమణ విషయంలో అనేక తూట్లు పొడుస్తున్నా పెద్దగా స్పంధన రావడం లేదని , ఇప్పుడూ అదే జరుగుతుందని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక చిన్న పార్టీ అయిన జనసేన , తాను బి.జె.పి రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నామని అంటున్నారంటే ఆ పార్టీ ప్రశ్నించే అవకాశమే లేదు. నోరు మెదపేది అంతకన్నా లేదు. ఒక్క కమ్యూనిస్ట్ లు మాత్రం వ్యతిరేకించే అవకాశం ఉంది. బి.జె.పి కి తనకు లాభం ఉంది , దీన్ని అడ్డుపెట్టుకుని ఎ.పి లో జండా పాతవచ్చు అనుకుంటే మాత్రం ముందుకు సాగుతుంది. బి.జె.పి కి పార్టీగా ఎ.పి లో ఎదిగే అవకాశమే లేదు. టి.డి.పితో పెళ్ళి పొత్తుకు ఇష్ఠం లేదు. గతంలో మాదిరి వై.సి.పి తో అక్రమ పొత్తుకే మొగ్గు చూపే అవకాశం ఉంది. సాధారణంగా దేశమంతా పాలనా పరంగా జరిగే రాజకీయ చర్చల్లో భాగంగా ఈ ప్రతిపాదన వచ్చిందా , లేక నిజంగానే బి.జె.పి పావులు కదుపుతోందా అనేది తేలాలంటే ఇంకొంత కాలం వేచి ఉండాలి .

Also Read:  Lokesh Yuvagalam: యువగళం హీట్, పెద్దిరెడ్డి ఇలాఖలో లోకేష్ దూకుడు