AP Politics: చంద్రబాబు వద్ద జగన్ బలహీనతలు

ఐప్యాక్ సంస్థను స్థాపించి రాజకీయ నాయకులకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తుంటారు ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే. 2014లో ప్రధాని మోదీ విజయంలో కీలక పాత్ర పోషించిన పీకే ఆ తరువాత ఢిల్లీలో ఆప్, పంజాబ్ లో కాంగ్రెస్, ఏపీలో జగన్ విజయంలో ఆయన పాత్ర ఉంది

AP Politics:  ఐప్యాక్ సంస్థను స్థాపించి రాజకీయ నాయకులకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తుంటారు ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే. 2014లో ప్రధాని మోదీ విజయంలో కీలక పాత్ర పోషించిన పీకే ఆ తరువాత ఢిల్లీలో ఆప్, పంజాబ్ లో కాంగ్రెస్, ఏపీలో జగన్ విజయంలో ఆయన పాత్ర ఉంది. ఇదిలా ఉండగా వైస్ జగన్ ను గద్దె దించేందుకు టీడీపీ జనసేన ఒకటై పోరాడుతుంది. ఇక ప్రశాంత్ కిషోర్ గతంలో జగన్ కోసం పని చేసిన అనుభవం టీడీపీకి కలిసి రానుంది. ఎందుకంటే జగన్ బలాలు, బలహీనతలు, అతని రాజకీయ వ్యూహాల పైన పూర్తి అవగాహన ఉంది.

ప్రశాంత్ కిషోర్ టీడీపీ కోసం పని చేస్తే జగన్ ను ఓడించడం కష్టమేమి కాదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ప్రశాంత్ కిశోర్ ఎంట్రీతో టీడీపీ నేతలు, కార్యకర్తల్లో జోష్ మొదలైంది. 2024 ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ సేవలను పూర్తిగా వినియోగించుకోవడానికి టీడీపీ సిద్ధమవుతోంది. టీడీపీ బలాలు, బలహీనతలపై నివేదిక సిద్ధం చేసి చంద్రబాబుకి ఇచ్చారట పీకే. వైసీపీ మైనస్ పాయింట్ల గురించి కూడా నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తుంది.

గత ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయసాధించగా టీడీపీ 23 సీట్లకే పరిమితం అయ్యింది. జనసేన పార్టీకి ఒక్క సీటు మాత్రమే దక్కింది. ఇక జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ఒక్క సీటు కూడా దక్కలేదు. మొత్తానికి మరో మూడు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరిగేందుకు అవకాశముండడంతో చంద్రబాబు, పీకే మధ్య భేటి ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read: Room Freshener : రూమ్ ఫ్రెష్నర్లు ఇంట్లో ఎలా తయారుచేసుకోవాలో తెలుసా?