Asteroid that killed dinosaurs: చంద్రుడిని ఢీకొట్టింది.. డైనోసార్స్ ను అంతం చేసింది.. ఒకే ఆస్టరాయిడ్!!

10 లక్షల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మానవ మనుగడకు ముప్పు వాటిల్లేంత పెద్ద ఉల్క భూమిని ఢీ కొడుతుందని అంటారు.

  • Written By:
  • Publish Date - September 30, 2022 / 08:30 AM IST

10 లక్షల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మానవ మనుగడకు ముప్పు వాటిల్లేంత పెద్ద ఉల్క భూమిని ఢీ కొడుతుందని అంటారు.

ప్రతి 2వేల ఏళ్లకు ఒక్కసారి అంతరిక్షంలోని ఫుట్‌బాల్‌ మైదానం అంత వెడల్పు గల ఓ ఉల్క భూమిని ఢీ కొడుతుందని చెబుతారు.

ఈవిధమైన భారీ ఉల్కల వల్లే భూమిపై ఒక్కప్పుడు రాజ్యం ఏలిన ఆస్టరాయిడ్స్ అంతరించాయని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారం ఒకటి లభించింది. చైనాకు చెందిన చాంగి-5 వ్యోమనౌక చంద్రుని ఉపరితలం పై నుంచి సేకరించిన మైక్రో స్కోపిక్ గ్లాస్ బీడ్ శాంపిల్స్ ను 2020 సంవత్సరంలో భూమికి తీసుకొచ్చింది. వాటిని అధ్యయనం నిమిత్తం వివిధ దేశాల శాస్త్రవేత్తలకు ఇచ్చారు. వీటిపై అధ్యయనం చేసిన ఆస్ట్రేలియా లోని క్యూర్టిన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక కొత్త విషయాన్ని గుర్తించారు. చంద్రుడిని గతంలో ఢీకొట్టిన ఆస్టరాయిడ్ .. భూమిపై డైనోసార్ల అంతానికి కారణం అయిన ఉల్కకు సంబంధం ఉందని వెల్లడైంది. అలనాడు చంద్రుడిపై చోటుచేసుకున్న ఉత్పాతానికి ఒక ఆస్టరాయిడ్ కారణమని తేల్చారు. ఆ ఆస్టరాయిడే ఒక ఉల్కను ఢీకొని, అది దారి మార్చుకొని భూమి వైపు దూసుకొచ్చేలా చేసిందని అంచనా వేశారు.

ఉల్కలు అంటే ? ఉల్కాపాతం అంటే ?

ఉల్కలను రాలే నక్షత్రాలు అని కూడా అంటారు. రాత్రి వేలల్లో ఆకాశం నుంచి జారిపడే ఈ కాంతివంతమైన పదార్థాలు నక్షత్రాలుగా కనిపిస్తాయే గానీ అవి నక్షత్రాలు కావు.

ఈ ఉల్కలు ఖగోళంలో గ్రహాలతో పాటే ఇవి ఏర్పడ్డాయి. గ్రహాల ఆకర్షణకు లొంగని కొన్ని శిలలు, ధూళి కణాలు సూర్య కుటుంబంలో గ్రహాలతో పాటు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. తోక చుక్కల తోక భాగంలోని మంచు ముక్కలు, శిలా శకలాలు కూడా వాటి నుంచి విడిపోయి అంతరిక్షంలో పరిభ్రమిస్తుంటాయి. ఈ విధంగా చంద్ర గ్రహం నుంచి.. అంగారక గ్రహం నుంచి వీడి పడిన ధూళి కణాలు కూడా రోదసిలోనే ఉంటాయి. వీటిని ఉల్కలకు సంబంధించినవిగానే పరిగణిస్తారు. భూమి తన మార్గంలో తాను తిరుగుతూ ఇవి ఉన్న ప్రదేశంలోకి వచ్చినప్పుడు.. వీటిలో కొన్ని భూమి ఆకర్షణ శక్తి వల్ల భూవాతవరణంలోకి చొచ్చుకొని వస్తాయి. ఇవి సుమారు సెకనుకు 70 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తూ భూమి మీదకు రావడంతో భూ వాతావరణం ఘర్షణకు లోనవుతుంది. ఈ ఘటనతో వాటి ఉష్ణోగ్రత అపరిమితంగా పెరిగిపోతుంది. ఈ పెరిగిన ఉష్ణోగ్రత కారణంగానే కాంతిని వెదజల్లుతూ కింద పడిపోతాయి. దీన్నే ఉల్కాపాతం అంటారు.