Life After Death :చనిపోయిన వారితో ముచ్చట్లు పెట్టొచ్చట!!

Live After Death : మనిషి తల్చుకుంటే.. అన్నీ అన్ లిమిటెడ్ చేసుకోవచ్చు!! జీవితం.. జిందగీ.. లైఫ్.. ఇది మాత్రం లిమిటెడ్ .మనం ఎన్ని మంచి మందులు వాడినా.. ఎంత మంచి ఫుడ్ తిన్నా అన్ లిమిటెడ్ లైఫ్ అసాధ్యం.ఔనన్నా.. కాదన్నా.. రాజుకైనా.. పేదకైనా.. ఇదే అప్లై అవుతుంది. దీన్ని అన్ లిమిటెడ్ చేసుకునే దిశగా సరికొత్త  టెక్నాలజీ రెడీ అవుతోంది.

  • Written By:
  • Updated On - May 31, 2023 / 05:00 PM IST

Life After Death : మనిషి తల్చుకుంటే.. అన్నీ అన్ లిమిటెడ్ చేసుకోవచ్చు!! జీవితం.. జిందగీ.. లైఫ్.. ఇది మాత్రం లిమిటెడ్ .మనం ఎన్ని మంచి మందులు వాడినా.. ఎంత మంచి ఫుడ్ తిన్నా అన్ లిమిటెడ్ లైఫ్ అసాధ్యం.ఔనన్నా.. కాదన్నా.. రాజుకైనా.. పేదకైనా.. ఇదే అప్లై అవుతుంది. దీన్ని అన్ లిమిటెడ్ చేసుకునే దిశగా సరికొత్త  టెక్నాలజీ రెడీ అవుతోంది.

అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త ప్రతీక్ దేశాయ్ ఇటీవల సంచలన ట్వీట్ చేశారు.ఆయన చేసిన ట్వీట్ ను ఇప్పటిదాకా 1.60 కోట్ల మంది చూశారు. ఈ భారీ రెస్పాన్స్ ను బట్టి.. ఆ ట్వీట్ లో ఎంత కీలకమైన విషయం ఉందో  మీరు  అర్థం చేసుకోవచ్చు.  ప్రతీక్ దేశాయ్ సెన్సేషనల్  ట్వీట్ లో.. “మీ తల్లిదండ్రులు, పెద్దలు, ప్రియమైన వారి వాయిస్ ను ఇక  క్రమం తప్పకుండా రికార్డ్ చేయడం ప్రారంభించండి. తగినంత ట్రాన్స్ క్రిప్ట్  డేటా, అధునాతన వాయిస్ సింథసిస్ టెక్నాలజీ, వీడియో మోడల్స్‌ అసాధ్యాన్ని సుసాధ్యం చేయబోతున్నాయి.  మీకు దగ్గరి వారు భౌతిక శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా(Live After Death).. మీతో ఎప్పటికీ జీవించే అవకాశం నూటికి నూరు శాతం ఉంది. ఈ ఏడాది చివరికల్లా అలాంటి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా ఆశ్చర్యం లేదు” అని  ఉంది.  ఇప్పటివరకు ఈ ట్వీట్ పై 6900కు పైగా కామెంట్స్ వచ్చాయి. దీన్నిబట్టి మనిషికి చావు అనే టాపిక్ పై, చనిపోయిన వారిని మిస్సయ్యే విషయంపై ఎంత ఇంట్రెస్ట్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

చనిపోయిన వారు ఇలా వచ్చి మాట్లాడుతారట..

డైలీ మెయిల్‌ న్యూస్ వెబ్ సైట్ లో పబ్లిష్ అయిన ఒక నివేదిక ప్రకారం.. 2D, 3D, హోలోగ్రామ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లను ఉపయోగించి చనిపోయిన వారి ఆడియో, వీడియోలకు కొత్త జీవకళ వచ్చేలా చేయొచ్చు. చనిపోయిన వారి హోలోగ్రామ్ లేదా ఆర్టిఫిషియల్ అవతార్ ను క్రియేట్ చేసి దానితో చాట్ చేయొచ్చు. గతంలో చాట్ హిస్టరీలో ఇచ్చిన ఆన్సర్ ఆధారంగా చనిపోయిన వ్యక్తి  హోలోగ్రామ్ లేదా ఆర్టిఫిషియల్ అవతార్ మనతో ముచ్చట్లు పెట్టేలా అధునాతన అల్గారితం అందుబాటులోకి రావచ్చు అని డైలీ మెయిల్‌  వార్తా కథనం తెలిపింది. డాక్టర్ ప్రతీక్ దేశాయ్ చేసిన సంచలన ట్వీట్ అంతరార్ధం ఇదే అయి ఉండొచ్చని విశ్లేషించింది.

Also Read : 150 Years Sarathkumar : 150 ఏళ్లు బతుకుతా.. లైఫ్ సీక్రెట్ తెలిసిపోయింది

ఇండియా రైతుల కోసం  ప్రతీక్ దేశాయ్ KissanGPT

కంప్యూటర్ శాస్త్రవేత్త ప్రతీక్ దేశాయ్ అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో అనేక AI స్టార్టప్‌లను స్థాపించారు. ఆయన భారత రైతులకు సహాయం చేయడానికి ChatGPT మాదిరిగానే KissanGPT అనే చాట్‌బాట్ ను డెవలప్ చేశారు. అయితే ఇది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది.

‘LIVE FOREVER’.. ‘Re;memory’  గురించి తెలుసా ?

ఇంతకుముందు, మెటావర్స్ టెక్నాలజీ సంస్థ “సోమ్నియమ్ స్పేస్”..  ‘LIVE FOREVER’ అనే ఫీచర్ ను పరిచయం చేసింది. ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫీచర్. దీనితో వ్యక్తులు తమ ప్రియమైనవారితో మాట్లాడే వీలు ఉంటుంది. ఆ చాట్ కు సంబంధించిన ఆడియో, వీడియోలను ఎప్పటికీ నిల్వ చేసుకోవచ్చు. వారు ఒకవేళ చనిపోయాక గుర్తుకు వస్తే.. ఆ ఆడియో, వీడియోలను కలిపి  ఆన్‌లైన్ అవతార్‌గా క్రియేట్ చేయొచ్చు. ఇక  డీప్‌ బ్రేన్ అనే మరో అమెరికా టెక్ కంపెనీ ‘Re;memory’ పేరుతో ఇలాంటిదే ఒక వివాదాస్పద ఫీచర్ ను ప్రవేశపెట్టింది.