MLC Kavitha No Arrest..: మూడోసారీ నో అరెస్ట్, కవిత హ్యాపీగా బయటకు..

ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. సుమారు 10 గంటలపాటు విచారణ ఎదురుకొన్న కవిత రాత్రి 9.45 గంటలకు ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు.

  • Written By:
  • Updated On - March 22, 2023 / 09:31 AM IST

ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఈడీ విచారణ ముగిసింది. సుమారు 10 గంటలపాటు విచారణ ఎదురుకొన్న కవిత రాత్రి 9.45 గంటలకు ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవితను సుదీర్ఘంగా అధికారులు ప్రశ్నించారు. మంగళవారానికి కవిత విచారణ ముగిసిందని ఈడీ అధికారులు ప్రకటించారు. కవితను (MLC Kavitha) విచారిస్తున్న సమయంలో భారాస లీగల్‌ సెల్‌ జనరల్‌ సెక్రటరీ సోమ భరత్‌ ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి మేరకు ఈడీ అధికారులు భరత్‌ను కార్యాలయానికి పిలిచారు. కవితకు సంబంధించిన ఆథరైజేషన్‌ సంతకాల కోసం పిలిచినట్టు సమాచారం. తదుపరి విచారణలో అవసరమైతే కవితకు బదులుగా సోమ భరత్‌ని పంపించేందుకు, కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు అందజేసేందుకు భరత్‌కు అవకాశం కల్పించేందుకే పిలిపించినట్టు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ వరుసగా రెండో రోజు కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 11:30 గంటల సమయంలో భర్త అనిల్, న్యాయవాదులతో కలిసి కవిత ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ధ్వంసం చేశారనే ఆరోపణల నేపథ్యంలో పాత ఫోన్లను తీసుకెళ్లి ఈడీ అధికారులకు ఆమె అప్పగించారు. ఈడీ ఆఫీస్‌కు వెళ్లడానికి ముందు ఇవే ఫోన్లను మీడియాకు కూడా చూపించారు. ఫోన్ల ధ్వంసంపై దురుద్దేశంతోనే లీకులిచ్చి దుష్ప్రచారం చేశారంటూ తప్పుబడుతూ ఈడీకి ఒక లేఖ కూడా రాశారు. ఇక్కడి వరకు అన్నీ తెలిసిన విషయాలే. మరి అసలు ఉత్కంఠ రేపుతున్న అంశాలు ఏంటంటే.. మంగళవారం విచారణలో అధికారులు కవితను ఏం ప్రశ్నిస్తున్నారు? సోమవారం 14 ప్రశ్నలు సంధించిన అధికారులు.. ఈ రోజు ఎన్ని ప్రశ్నలు అడుగుతారు? ఫోన్లలోని డేటా గుర్తించి ఏమైనా విశ్లేషణ చేస్తారా?. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఏమైనా ఆధారాలను రాబడతారా?. అసలు విచారణ ఎన్ని గంటలకు ముగుస్తుంది?విచారణ అనంతరం ఇంటికి పంపించి మరోసారి ఎంక్వైరీకి పిలుస్తారా? లేక అనూహ్యంగా అరెస్ట్ (Arrest) చేస్తారా? అనే తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్గాలు ఉపిరిబిగపట్టి ఆసక్తిగా చూశాయి.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ ఇదివరకే రెండు రోజులు ప్రశ్నించింది. మార్చి 11న తొలిసారి, మార్చి 20న రెండోసారి ప్రశ్నించారు. మంగళవారం మూడోరోజు విచారణ కొనసాగుతోంది. మరి మంగళవారం విచారణ తర్వాత ఇంటికా? లేక అరెస్టా? అనే ఉత్కంఠ పరిస్థితులకు తెరపడింది. అరెస్ట్ ఊహాగానాలకు పలుకారణలను మీడియా విశ్లేచించింది. ఇదే కేసులో అరెస్టయిన వ్యక్తులను పలుమార్లు ప్రశ్నించిన అనంతరమే ఈడీ అధికారులు అరెస్ట్ (Arrest) చేశారు. కాబట్టి కవితను మూడోసారి కూడా ప్రశ్నిస్తుండడంతో అరెస్ట్ ఊహాగానాలు రేగాయి. అయితే కవిత గత రెండు సార్లు విచారణ సందర్భంలోనూ ఇదే ఉత్కంఠ వాతావరణం నెలకొన్నా అరెస్ట్ జరగలేదన్న విషయం తెలిసిందే.

కవిత ఈడీ విచారణ మూడోసారి కొనసాగుతున్న నేపథ్యంలో తాజా పరిస్థితిని బీఆర్ఎస్ ముఖ్యనాయకత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. మరోవైపు మంత్రి కేటీఆర్ సహా పలువురు మంత్రులు ఢిల్లీలోనే మకాం వేశారు. ఇక ఈడీ ఆఫీస్ వెలుపల జాగృతి, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈడీ ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఇంటి వద్ద మోహరించిన కేంద్ర బలగాలు రాత్రి 9 గంటలకు వెళ్లిపోవడంతో కవిత అరెస్ట్ లేదని తేలింది. అంతే కాదు ఈడీ అధికారి ఒకరు కవిత కాసేపట్లో బయటకు వస్టారని చెప్పారు. కవిత న్యాయవాదులను ఈడీ పిలిపించి కొన్ని ఆధారాలను , ఇతర పత్రాలను తీసుకుంది. ఎట్టకేలకు మూడోసారి కూడా అరెస్ట్ లేకుండా కవిత ఈడీ విచారణ నుంచి బయట పడ్డారు. నేరుగా ఈడీ ఆఫీస్ నుంచి కేసీఆర్ ఢిల్లీ లోని ఇంటికి చేరుకున్నారు.

Also Read:  Mumbai Indians: చివరి మ్యాచ్ లోనూ ఓడిన బెంగళూరు