Malware In Phone : గవర్నమెంట్ ఫ్రీ టూల్.. ఇక మీ ఫోన్ లోని వైరస్ లు ఖతం

మీకు ఫోన్ ఉందా .. జర భద్రం.. ఏది పడితే ఆ యాప్ ను ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవద్దు.. అలా చేస్తే మీకు తెలియకుండానే .. మీ ఫోన్ లోని ముఖ్య సమాచారం పోయే ముప్పు ఉంటుంది..ఈ తరుణంలో మన ఫోన్లలో మనకు తెలియకుండానే దాగి ఉన్న  ప్రమాదకర మాల్ వేర్లను(Malware In Phone) వేళ్ళతో సహా పెకిలించే రిమూవల్ టూల్స్ ను కేంద్ర సర్కారు అందిస్తోంది..

  • Written By:
  • Updated On - June 10, 2023 / 07:20 AM IST

మీకు ఫోన్ ఉందా .. జర భద్రం..

ఏది పడితే ఆ యాప్ ను ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవద్దు.. 

అలా చేస్తే మీకు తెలియకుండానే .. మీ ఫోన్ లోని ముఖ్య సమాచారం పోయే ముప్పు ఉంటుంది..

ఒకప్పుడు సైబర్ ఎటాక్ అంటే కంప్యూటర్ల పైనే జరిగే.. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు కూడా ఇందుకు టార్గెట్ గా మారాయి.

ఎందుకంటే ఫోన్లలోనే అత్యంత కీలకమైన బ్యాంక్ అకౌంట్స్ వివరాలు సహా ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటోంది..

ఈ తరుణంలో మన ఫోన్లలో మనకు తెలియకుండానే దాగి ఉన్న  ప్రమాదకర మాల్ వేర్లను(Malware In Phone) వేళ్ళతో సహా పెకిలించే రిమూవల్ టూల్స్ ను కేంద్ర సర్కారు అందిస్తోంది..

అది కూడా పూర్తి ఉచితంగా..

“సైబర్ దాడులు నుంచి రక్షణ పొందండి ! మీ పరికరాన్ని బాట్‌నెట్ ఇన్‌ఫెక్షన్లు, మాల్వేర్ నుంచి రక్షించడానికి భారత ప్రభుత్వం, CERT-In ద్వారా ‘ఉచిత బాట్ రిమూవల్ టూల్’ని డౌన్‌లోడ్ చేయమని సిఫార్సు చేస్తోంది, csk.gov.in

ఈ మెసేజ్ మీ ఫోన్ కు వచ్చిందా ?

ఆ మెసేజ్ కేంద్ర  టెలికాం విభాగం (DoT) పంపినది.. 

సైబర్ దాడులు, స్కామ్‌లతో ప్రజల ఫోన్లలోని సమాచార భద్రత ప్రశార్ధకంగా మారుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, వారి స్మార్ట్‌ఫోన్‌లను సురక్షితంగా మార్చడానికి కేంద్ర  టెలికాం విభాగం (DoT) అనేక ఉచిత బాట్ రిమూవల్ టూల్స్‌ను తీసుకొచ్చింది. వీటి గురించి అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఇప్పుడు ప్రతి ఫోన్ నంబర్ కు ఒక టెక్స్ట్  మెసేజ్ పంపుతోంది.

సైబర్ స్వచ్ఛతా కేంద్ర పోర్టల్ అంటే ఏమిటి ?

దేశ ప్రజలు ఇప్పుడు “సైబర్ స్వచ్ఛతా కేంద్ర” పోర్టల్ ద్వారా ఉచిత మాల్వేర్ డిటెక్షన్ టూల్స్‌ను(Malware In Phone) యాక్సెస్ చేయవచ్చు. “బాట్‌నెట్ క్లీనింగ్ అండ్ మాల్వేర్ అనాలిసిస్ సెంటర్”  అని కూడా పిలువబడే ఈ పోర్టల్..  ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) నిర్వహణలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ISPలు), యాంటీ వైరస్ కంపెనీల సహకారంతో పనిచేస్తుంది. వెబ్‌సైట్ వినియోగదారులకు వారి సిస్టమ్‌లు/పరికరాలను సురక్షితంగా ఉంచడానికి అవసరమైన  సమాచారం, టూల్స్ ను అందిస్తుంది. దేశంలో బాట్‌నెట్ ఇన్ఫెక్షన్‌లను చురుకుగా గుర్తించడం ద్వారా సురక్షితమైన సైబర్‌ స్పేస్‌ను ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమం ప్రాథమిక లక్ష్యం.

Also read : Alert :ఫేక్ ఆఫర్లతో చైనా హ్యాకర్లు…భారతీయులే టార్గెట్..!! హెచ్చరిస్తోన్నసైబర్ సెక్యూరిటీ ..!!

బాట్ నెట్ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి ?

‘బాట్’ అనే మాల్‌వేర్‌ ఏదైనా స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌ లోకి చొరబడితే దాన్ని బాట్‌నెట్ ఇన్ఫెక్షన్ అంటారు. బాట్‌నెట్ ఇన్ఫెక్షన్ బారిన పడిన ఫోన్ లేదా కంప్యూటర్ ఆ మాల్  వేర్ ను రన్ చేసే హ్యాకర్ల చేతిలోకి వెళ్తుంది. తద్వారా వాళ్ళు  స్పామ్ మెసేజ్ లు పంపడం.. అవుట్‌ గోయింగ్, ఇన్‌కమింగ్ టెక్స్ట్‌లు, కాల్స్ ను కంట్రోల్ చేయడం.. నెట్ బ్యాంకింగ్ వివరాలు, యూజర్‌ నేమ్‌లు, పాస్‌వర్డ్‌ల సమాచారాన్ని యాక్సెస్ చేయడం వంటివి చేస్తారు.

మీరు ఇవి చేసి ఉంటే.. మీ ఫోన్ లోకి  బాట్  వస్తుంది 

  1. మాల్ వేర్ సోకిన అటాచ్‌మెంట్‌ను ఈమెయిల్‌ నుంచి డౌన్ లోడ్ చేయడం.
  2. ఈ మెయిల్ లేదా వెబ్‌సైట్‌లో హానికరమైన లింక్‌పై క్లిక్ చేయడం.
  3. అవిశ్వసనీయ సోర్స్ నుంచి ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయడం.
  4. సురక్షితం కాని పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌ని ఉపయోగించడం.

Also read : WebSites Hacking: రోజుకు ఎన్ని కోట్ల వెబ్ సైట్స్ హ్యాక్ అవుతున్నాయో తెలుసా!

మాల్వేర్, బాట్‌నెట్‌లను ఎలా తొలగించాలి ?

  • CSK వెబ్‌సైట్‌కి వెళ్లండి: www.csk.gov.in
  • “సెక్యూరిటీ టూల్స్” అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • మీరు ఉపయోగించాలనుకుంటున్న బాట్ రిమూవల్ టూల్ యాంటీ వైరస్ కంపెనీని ఎంచుకోండి.
  • సాధనాన్ని డౌన్‌లోడ్ చేయడానికి “డౌన్‌లోడ్” బటన్‌పై క్లిక్ చేయండి.
  • Windows వినియోగదారుల కోసం: eScan యాంటీవైరస్, K7 సెక్యూరిటీ లేదా క్విక్ హీల్ వంటి ఉచిత బాట్ రిమూవల్ టూల్స్‌లో ఒకదానిని డౌన్‌లోడ్ చేయండి.
  • ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారుల కోసం: Google Play Storeకి వెళ్లి, ‘eScan CERT-IN Bot Removal’ టూల్ లేదా C-DAC హైదరాబాద్ అభివృద్ధి చేసిన ‘M-Kavach 2’ కోసం సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.
  • యాప్ డౌన్‌లోడ్ అయిన తర్వాత, దాన్ని మీ పరికరంలో రన్ చేయండి.
  • యాప్ మీ పరికరాన్ని మాల్వేర్ కోసం స్కాన్ చేస్తుంది. ఏవైనా ఇన్ఫెక్షన్‌లు ఉంటే వాటిని తొలగిస్తుంది.

Also read  :  Message Guard: శామ్‌సంగ్‌ ‘మెసేజ్‌ గార్డ్‌’ ఫీచర్‌. ఈ ఫీచర్‌ ఉంటే ఫోన్‌ హ్యాక్‌ కాదు

‘AppSamvid’.. ‘USB ప్రతిరోధ్’.. 

బాట్ రిమూవల్ టూల్స్ తో పాటు “సైబర్ స్వచ్ఛతా కేంద్ర” పోర్టల్  ‘USB ప్రతిరోధ్’, ‘యాప్‌సంవిద్’ (‘AppSamvid’) వంటి ఇతర భద్రతా అప్లికేషన్‌లను కూడా అందిస్తోంది. వినియోగదారులు తమ ఫోన్ల  భద్రతను పెంచుకోవడానికి ఈ యాప్‌లను కూడా  డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ‘USB ప్రతిరోధ్’ అనేది ఫోన్‌లు, పెన్ డ్రైవ్‌ల వంటి స్టోరేజ్ మీడియా వినియోగాన్ని నియంత్రించడానికి రూపొందించిన డెస్క్‌టాప్ సాధనం. ఈ టూల్ USB పరికరాలను మాల్వేర్ కోసం స్కాన్ చేస్తుంది. Windows వినియోగదారుల కోసం ‘AppSamvid’ అందుబాటులో ఉంది. ఇది ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఆమోదించబడిన ఫైల్‌లను మాత్రమే అమలు చేసే అప్లికేషన్. ఇది విశ్వసనీయ ఎక్జిక్యూటబుల్స్, జావా ఫైల్‌ల జాబితాలను సృష్టించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. యూజర్‌లు యాప్‌ను పాస్‌వర్డ్‌తో కూడా సురక్షితం చేయవచ్చు. ‘AppSamvid’ వైరస్‌లు, ట్రోజన్‌లు, మాల్‌వేర్‌ల నుంచి సిస్టమ్‌ను రక్షిస్తుంది.