Manasanamaha: గిన్నిస్ రికార్డుకెక్కిన తెలుగు షార్ట్ ఫిల్మ్.. సుకుమార్, అడివి శేష్ అభినందనలు!

గతంలో 'మనసానమహ' అని షార్ట్ ఫిలిం విడుదలైన సంగతి తెలిసిందే. ఇక దీనికి మంచి గుర్తింపు కూడా రాగా అందులో నటించిన నటీనటులకు కూడా మంచి పేరు అందింది. ఇక దీపక్ రెడ్డి అనే కుర్రాడు ఈ షార్ట్ ఫిలిం ను తీయగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.

  • Written By:
  • Updated On - June 30, 2022 / 05:20 PM IST

గతంలో ‘మనసానమహ’ అని షార్ట్ ఫిలిం విడుదలైన సంగతి తెలిసిందే. ఇక దీనికి మంచి గుర్తింపు కూడా రాగా అందులో నటించిన నటీనటులకు కూడా మంచి పేరు అందింది. ఇక దీపక్ రెడ్డి అనే కుర్రాడు ఈ షార్ట్ ఫిలిం ను తీయగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.

ఇప్పటివరకు ఈ షార్ట్ ఫిలిం కు 513 అవార్డులు వచ్చాయి. ఇక ఈ షార్ట్ ఫిలిం కు అత్యధిక అవార్డులు రావడంతో ఏకంగా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. తాజాగా దీపక్ రెడ్డి తన ట్విట్టర్ లో గిన్నిస్ సర్టిఫికెట్ ఫోటోను కూడా షేర్ చేసుకున్నాడు.

అంతేకాకుండా ఈ షార్ట్ ఫిలిం కు పలువురు ప్రముఖుల నుంచి కూడా అభినందనలు వచ్చాయి. నటుడు అడవి శేషు, సుకుమార్ ఈ షార్ట్ ఫిలిం అందించిన దీపక్ రెడ్డి ని అభినందించారు. ఇక అడివి శేషు అతడిని నీవు ఫీచర్ ఫిల్మ్ తో ప్రపంచాన్ని షేక్ చేసే వరకు నేను వేచి చూడలేకపోతున్నాను అని అన్నాడు.