Minister KTR : చంద్రబాబుతో వివాదాలు లేవు…జగన్ నాకు పెద్దన్న-కేటీఆర్.!!

టీడీపీ అధినేత...మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తామెప్పుడూ వివాదాలు పెట్టుకోలేదన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.

  • Written By:
  • Updated On - June 2, 2022 / 02:46 PM IST

టీడీపీ అధినేత…మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తామెప్పుడూ వివాదాలు పెట్టుకోలేదన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. లండన్, దావోస్ లలో 12 రోజుల పర్యటన అనంతరం. హైదరాబాద్ చేరుకున్నారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఓ వార్త పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన పర్యటనకు అద్భుతమైన స్పందన వచ్చిందని…రూ. 42,00కోట్లపైగా పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగినట్లు చెప్పారు. మొత్తంగా 25 సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు కేటీఆర్.

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కేంద్రంలోని ఇతర మంత్రులు, రాష్ట్రానికి పర్యాటకుల్లా వచ్చి వెళ్లిపోతున్నారు…తప్పా రాష్ట్రం ఏర్పడిన ఎనిమిది ఏండ్లలో నయాపైసా కూడా ఇవ్వలేదని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ మొదట్నుంచీ రాష్ట్రమేనని..వచ్చిన సంపదను వచ్చిన సంపదను అభివృద్ధికే ఖర్చు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. అయితే, పెద్ద నోట్ల రద్దు, కరోనా కారణంగా కొన్ని లక్ష్యాలను సాధించలేకపోయినట్టు మంత్రి కేటీఆర్ అంగీకరించారు.

రాజకీయాల్లో ఎవరూ శత్రువులు ఉండరన్నారు కేటీఆర్.. ప్రత్యర్థులు మాత్రమే ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ తో తమకు సత్సంబంధాలు ఉన్నాయనారు. ఆ రాష్ట్ర సీఎం జగన్ తనకు పెద్దన్నలాంటి వారని అన్నారు కేటీఆర్. గతంలో చంద్రబాబునాయుడుతోనూ తామెప్పుడూ వివాదాలు పెట్టుకోలేదని స్పస్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం తమ ప్రత్యర్థి పార్టీతో చేతులు కలపడం వల్లే ఆయనతో దూరం పెరిగినట్లు చెప్పారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా వచ్చే ఎన్నికల్లో మళ్లీ టీఆరెస్ గెలుస్తుందని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఇక కేటీఆర్ భవిష్యత్ ప్రధాని అన్న వెంచర్ కేపిటలిస్ట్ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు.. సీఎం దయతో తాను మంత్రిగా ఉన్నానని, తనకు ఇంతకుమించి ఆశలు లేవని కేటీఆర్ స్పష్టం చేశారు.