Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్‌లోకి శ్రీసత్య తల్లి.. కూతురుకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన తండ్రి?

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతోంది. తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి ఆదిరెడ్డి భార్యని,

  • Written By:
  • Updated On - November 23, 2022 / 03:52 PM IST

తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 రసవత్తరంగా సాగుతోంది. తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి ఆదిరెడ్డి భార్యని, కూతుర్ని లోపలికి పంపించి ఆది రెడ్డికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి ఫైమా వాళ్ళ అమ్మను పంపించాడు బిగ్ బాస్. ఫైమా లాగే తల్లి కూడా ఫుల్ ఫన్ జనరేట్ చేస్తూ ఆకట్టుకుంది. కంటెస్టెంట్ లు అందరినీ నవ్విస్తూ కూతురు మాదిరే పంచ్‌లు వేసింది. పైమా మదర్ ఎంట్రీ ఇచ్చినప్పుడు అందరూ సంతోషంగా ఉండగా ఆ తర్వాత శ్రీ సత్య తల్లి ఎంట్రీ ఇవ్వడంతో హౌస్ లో వాళ్లు కూడా ఎమోషనల్ అయ్యారు.

అందుకు గల కారణం శ్రీ సత్య తల్లి చైర్ కే పరిమితం కావడం. శ్రీ సత్య శ్రీ హాన్ తో మా మమ్మీ కూడా నడిస్తూ బాగుండు అని కన్నీళ్లు పెట్టుకుంటుండగా.. శ్రీసత్య తల్లిని వీల్ చైర్‌ సాయంతో హౌస్‌లోకి తీసుకుని వచ్చారు. సోనూ.. సోనూ అని పిలుపు వినేసరికి శ్రీ సత్య కన్నీటి పర్యంతం అయ్యింది. కదల్లేని స్థితిలో ఉన్న శ్రీసత్య తల్లి కాళ్లని చూపిస్తూ అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేశాడు బిగ్ బాస్. తన తల్లిని ప్రేమతో హత్తుకుంది. ఆ తరువాత తన తల్లికి ప్రేమతో గోరుముద్దలు తినిపించింది శ్రీ సత్య. శ్రీ సత్య తల్లిని లోపలికి పిలుచుకుని వెళ్లడానికి కంటెంస్టెంట్లు పైకి తీసుకురావడంతో అప్పుడు మూడున్నర ఏళ్లుగా అంకుల్ ఈ విధంగానే చేస్తున్నారు అని శ్రీ సత్య తల్లి చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

అప్పటివరకు బాగానే ఉన్నప్పటికీ చివర్లో శ్రీ సత్య కి తన తండ్రి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉండగా అప్పుడు శ్రీ సత్య తన తండ్రికి చెబుతూ నన్ను నామినేట్ చేశాడు నాన్న అంటూ రాజ్ నన్ను ఫస్ట్ వీక్.. కనెక్షన్ కుదర్లేదని నామినేట్ చేశాడని చెప్పగా వెంటనే శ్రీసత్య తండ్రి.. నువ్వు కూడా పిచ్చి పిచ్చి నామినేషన్స్ చేస్తున్నావ్‌లే అని ఉన్నది ఉన్నట్టు చెప్పి కూతురి కళ్లు తెరిపించారు. ఆ మాటతో శ్రీసత్య నోరెళ్లబెట్టేసింది. అప్పుడు రేవంత్ శ్రీ సత్య వాళ్ళ నాన్నకు హైఫై ఇచ్చారు.