Nityananda Swamy : నిత్యానంద ‘కైలాస‌’ క‌ల‌వ‌రం

సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా ఉన్న ఆధ్యాత్మిక వేత్త నిత్యానంద బ‌తికే ఉన్నారు. ఆయ‌న చ‌నిపోయార‌న్న న్యూస్ చూసిన ఆయ‌న బ‌తికే ఉన్నానంటూ ఒక పోస్ట్ సోష‌ల్ మీడియాలో పెట్టారు. 'నేను చనిపోలేదు. ప్రస్తుతం సమాధిలో(సుప్తావస్థ) ఉన్నాను.

  • Written By:
  • Updated On - May 14, 2022 / 04:43 PM IST

సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా ఉన్న ఆధ్యాత్మిక వేత్త నిత్యానంద బ‌తికే ఉన్నారు. ఆయ‌న చ‌నిపోయార‌న్న న్యూస్ చూసిన ఆయ‌న బ‌తికే ఉన్నానంటూ ఒక పోస్ట్ సోష‌ల్ మీడియాలో పెట్టారు. ‘నేను చనిపోలేదు. ప్రస్తుతం సమాధిలో(సుప్తావస్థ) ఉన్నాను. నేను మరణించినట్లు కొందరు పుకార్లను వ్యాప్తిచేస్తున్నారు. నేను సమాధిలోకి వెళ్లాను. ప్రస్తుతం మాట్లాడలేకపోతున్నాను. అందుకు కాస్త సమయం పడుతుంది. మనుషులు పేర్లు ప్రాంతాలను గుర్తుపట్టలేకపోతున్నా. 27 మంది వైద్యులు నాకు చికిత్స చేస్తున్నారు.“ అని ఫేస్ బుక్ పోస్టులో వివ‌ర‌ణ ఇవ్వ‌డం ఆయ‌న భక్త‌లుకు ఊర‌టక‌లిగించింది,

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్వామీజీ 50 సార్లు కోర్టుకు హాజరై, 2019 నవంబర్లో భారత్ వదిలి ప‌రార్ అయ్యారు. ప్ర‌స్తుతం ‘కైలాస’ అనేది నిత్యానంద ప్రపంచం. దానికి తనని తాను ప్రధానిగా ప్రకటిం చుకున్నారు. కైలాసను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితికి అభ్యర్థన చేసుకున్నారు. కొద్దిరోజులకు కైలాస డాల‌ర్ ను తీసుకొచ్చారు. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను కూడా ప్రారంభించినట్లు ప్రకటించారు. అయితే ఆయన ఎక్కడ ఉంటున్నారనే విషయం మాత్రం తెలియదు.ఈక్వెడార్ సమీపంలోని ఓ ద్వీపంలో నివాసం ఉంటున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈక్వెడార్ మాత్రం ఈ వార్తలను ఖండిస్తోంది.

‘కైలాస’ అధికారిక వెబ్ సైట్ ప్ర‌తిరోజూ నిత్యానందకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తోంది. ఫేస్ బుక్ లో ఫొటోలు వీడియోలను అప్డేట్ చేస్తోంది. తాజాగా ఫొటోలు సహా ఆయ‌న పేపర్పై రాస్తున్నట్లు ఉన్న చిత్రాలను షేర్ చేసింది. ప్రస్తుతం `కైలాస` ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోం దని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిత్యానంద బతికి ఉన్నారా? చనిపోయారా? అనే న్యూస్ వైర‌ల్ అయింది.

ప‌లు ప్రకటనలు చేస్తున్న‌ప్ప‌టికీ నిత్యానంద ఎక్కడ ఉన్నారన్న విషయాన్ని భార‌త ప్ర‌భుత్వం నిర్థారించుకోలేక పోతోంది.వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి చనిపోయారని కొద్దిరోజులుగా న్యూస్ వ‌స్తోంది. దీనిపై తాజాగా ఆయన స్పష్టత ఇచ్చారు. సమాధిలోకి వెళ్లానని ప్రస్తుతం మనుషులను గుర్తుపట్టలేక పోతున్నట్లు మాట్లాడలేకపోతున్నట్లు ఆయన ఫేస్బుక్ పేజ్లో ఓ పోస్ట్ దర్శనమిచ్చింది. వదంతులపై స్పందిస్తూ తాను సమాధిలోకి వెళ్లానని శిష్యులు కంగారుపడొద్దని అభ‌యం ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న శిష్యులు నిత్యానంద చ‌నిపోయి ఉంటార‌న్న అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తం మీద భార‌త్ విడిచి వెళ్లిపోయిన నిత్యానంద `కైలాస`ను చేరుకోలేని ప‌రిస్థితుల్లో కేంద్ర నిఘా సంస్థ‌లు ఉన్నాయ‌న‌డాన్ని ఎవ‌రూ కాద‌న‌లేరు!