Raksha Bandhan: రాఖీ పండుగ అక్కడ అస్సలు చేసుకోరట.. కారణం ఏమిటంటే?

భారతదేశ ప్రజలలో అక్క తమ్ముళ్లు,అన్న చెల్లెలు సంతోషంగా జరుపుకునే పండుగ రాఖీ పండుగ. ఈ రాఖీ పండుగ

  • Written By:
  • Publish Date - August 4, 2022 / 09:00 PM IST

భారతదేశ ప్రజలలో అక్క తమ్ముళ్లు, అన్న చెల్లెలు సంతోషంగా జరుపుకునే పండుగ రాఖీ పండుగ. ఈ రాఖీ పండుగ రోజున అన్న, తమ్ముళ్లకు, అక్క చెల్లెలు రాఖీ కట్టి హ్యాపీ రక్షా బంధన్ అని ఎంతో సంతోషంగా చెప్పుకుంటూ ఉంటారు. అలా ఈ ఏడాది కూడా రాఖీ పండుగ ఆగస్టు 12న రాబోతోంది. ఈ క్రమంలోనే రాఖీ పండుగ జరుపుకోవడానికి అందరూ రెడీగా అవుతున్నారు. కాగా రాఖీ పండుగ దగ్గర పడుతుండడంతో మార్కెట్లో కూడా కొత్త కొత్త డిజైన్లతో రాఖీలు కలర్ ఫుల్ గా ఆకట్టుకుంటున్నాయి. అయితే సోదరీ, సోదర బంధానికి ప్రతీక అయిన ఈ రాఖీ పండుగను దేశవ్యాప్తంగా అన్ని మతాలవారు జరుపుకుంటారు. కేవలం భారత దేశంలో మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నారు.

అయితే ఈ రాఖీ పండుగను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో మాత్రం జరుపుకోరట. అక్కడ ఆ రాఖీ పూర్ణిమ రోజు ఎవరి చేతులకు రాఖీలు ఉండవట. మరి అందుకు గల కారణం ఏమిటి అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఉత్తరప్రదేశ్ లోని హార్పూర్ జిల్లా ను ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ జిల్లాలోని 60 గ్రామాల్లో ప్రజలు రక్షాబంధన్ జరుపుకోరు. అయితే అందరిలా వీరు రాఖీ పండుగ జరుపుకోరు. వీరు రాఖీ పండుగను జరుపుకునే విధానం పూర్తి వేరుగా ఉంటుంది. వీరు గత నాలుగు ఐదు శతాబ్దాలుగా రాఖీ పండుగను వేరే విధంగా జరుపుకుంటున్నారు. రాఖీ పూర్ణిమ రోజున అక్కడి మహిళలు తమ సోదరులు చేతులకు రాఖీలు కట్టకుండా అందుకు బదులుగా కలప కర్రలకు రాఖీ కడతారు. అందువల్ల రాఖీ పూర్ణిమ రోజు అక్కడి ప్రదేశాలలో ఎక్కడ చూసినా కూడా కర్రలకు రాఖీలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఎందుకు గల కారణాలు ఏంటి అన్న విషయానికి వస్తే..

రాఖీపూర్ణిమ రోజు కర్రలకు రాఖీలు ఎందుకు కడతారు అన్న విషయంపై అనేక రకాల కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పుడు మనం ఒక కథ గురించి తెలుసుకుందాం. ఈ గ్రామాల ప్రజలు 17వ తరానికి చెందిన హిందూ రాజపుత్రుల రాజు మహారాణా ప్రతాప్ కాలనాటి సాంప్రదాయాలను ఇప్పటికి కొనసాగిస్తూనే ఉన్నారు. క్రీస్తు శకం 1976లో హల్దీ ఘాటీ యుద్ధం జరగగా ఆ యుద్ధంలో పాల్గొన్న వీర సైనికులకు ఎవరు రక్షాబంధన్ కట్టలేదు. వారికి బదులుగా కర్రలకు కట్టారు. అప్పట్లో రాఖీలు కట్టే సంప్రదాయం అక్కడ లేకపోవడంతో ఇప్పటికీ అక్కడ ప్రజలు అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రతి ఏడాది రాఖీ పౌర్ణమి రోజున కర్రలకి రాఖీలు కడుతున్నారు. దీనిని అక్కడ ప్రజలు చాడీ పూజా అని కూడా పిలుస్తారు. అలాగే రాఖీ పూర్ణిమ రోజున ఆ గ్రామంలో జాతరలు కూడా జరుపుతారు.