Raksha Bandhan : ఆ 60 గ్రామాలు ‘రక్షా బంధన్’ కు దూరం..ఎందుకో తెలుసా..?

ఆ గ్రామంలో ఓ జమిందార్‌ ఉండేవాడట ఆయనకు కొడుకులు తప్ప కుమార్తెలు లేరు. ఓ ఏడాది రాఖీ పండుగ రోజు ఆ గ్రామంలో ఉన్న పేదింటి ఆడపిల్లల్ని తీసుకొచ్చి రాఖీ కట్టించుకుని

  • Written By:
  • Publish Date - August 31, 2023 / 01:55 PM IST

Raksha Bandhan..ఈ పండగకు కులమతాల పట్టింపు లేదు. బీదాగొప్పా అన్న బేధం లేదు. వయసుతో సంబంధం లేదు… దేశమంతా సోదరమయంగా నువ్వు చల్లగా ఉండాలి సోదరా అంటూ ఆడవాళ్లు రాఖీ కడితే, నీ కోసం నేనున్నాను అన్న అండని మగవారు చెయ్యి అందిస్తారు. అలాంటిది ఈ అన్నా-చెల్లెల పండుగ. అన్నా-చెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్లు ఒకరికి ఒకరు ప్రేమాభిమానాలు పంచుకుంటూ.. కష్టసుఖాల్లో తోడుగా ఉంటామని భరోసానిచ్చే పండేగే ఈ రాఖీ (Raksha Bandhan). ఇలాంటి ఈ గొప్ప పండగను నేడు దేశం మొత్తం జరుపుకుంటుంది. కానీ ఆ 60 గ్రామాలు మాత్రం రాఖీ కి దూరంగా ఉంటున్నాయి. ఇది ఈ ఏడాది కాదు..గత 300 ఏళ్లుగా రాఖీ పండగకు దూరంగా ఉంటున్నారు. దీని వెనుక ఓ పెద్ద రహస్యమే ఉంది. మరి ఆ రహస్యం ఏంటి..? ఆ 60 గ్రామాలు ఎక్కడివి..? రాఖీ కి ఎందుకు దూరం..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

దేశం మొత్తం రాఖీ సంబరాల్లో ఉంటె..ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని హార్పూర్‌ (Hapur District) జిల్లా పరిధిలోని 60 గ్రామాల్లో (60 villages) ప్రజలు రాఖీ పండగకు దూరంగా ఉంటారు. మాములుగా అయితే రాఖీ అంటే అక్క చెల్లెల్లు..అన్నదమ్ముల చేతులకు రాఖీ కడితే..ఈ 60 గ్రామాల మహిళలు మాత్రం కర్రలకు (Sticks ) రాఖీలు కడతారు. దాదాపు నాలుగైదు శతాబ్దాలుగా వారు ఈ విధంగానే చేస్తూ వస్తున్నారు. అందువల్ల పండుగ నాడు ఎక్కడ చూసినా కర్రలకు రాఖీలు కనిపిస్తాయి.

Read Also : Yuvagalam : నారా లోకేష్ ‘యువగళం కాదు ఇది ప్రజాగళం’

మీరట్‌లోని సురానా (Suran Village) అనే గ్రామంలో పూర్వకాలం శాపం కారణంగా అక్కడ రక్షా బంధన్‌ జరుపుకోరు. 12వ శతాబ్దంలో రాఖీ పండుగ రోజున మహ్మద్‌ ఘోరీ ఆ గ్రామంపై దండెత్తాడు. ఊళ్లో ప్రజలందరినీ చంపేశాడు. ఓ మహిళ, ఆమె ఇద్దరు కొడుకులు మాత్రం బతికారు. ఎందుకంటే వారు ఆ రోజున ఊళ్లో లేరు. ఆ తర్వాత చుట్టుపక్కల ఊళ్ల వారు అక్కడ నివసించారు. ఏడాది తర్వాత వారు రాఖీ పండుగ జరుపుకుందామని ప్రయత్నించారు. ఆ రోజున ఓ పిల్లాడు ప్రమాదవశాత్తు చూపు కోల్పోయాడట. దాంతో గ్రామంలో రాఖీపండను నిషేధించారు. 300 ఏళ్లుగా రాఖీ పండుగకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

అలాగే బైనిపూర్‌ బాక్‌ (benipur block) అనే గ్రామం సైతం రాఖీకి దూరంగా ఉంటున్నారు. దీని వెనుక కూడా ఓ ఘటన జరిగింది. ఆ గ్రామంలో ఓ జమిందార్‌ ఉండేవాడట ఆయనకు కొడుకులు తప్ప కుమార్తెలు లేరు. ఓ ఏడాది రాఖీ పండుగ రోజు ఆ గ్రామంలో ఉన్న పేదింటి ఆడపిల్లల్ని తీసుకొచ్చి రాఖీ కట్టించుకుని ఏం కావాలో కోరుకోమన్నారట. ఆ పేద అమ్మాయిలు ఏకంగా జమిందార్‌ ఆస్తి కావాలని అడిగడంతో ముందుగా మాటిచ్చిన జమిందార్‌ కుమారులు మాట తప్పకుండా మొత్తం వారిపేరుమీద రాసిచ్చేశారు. ఆ తర్వాత వాళ్లు ఊరు వదిలి వెళ్లిపోయారు. అప్పటి నుంచీ స్థానికులు రాఖీ పండుగ జరుపుకోవడం మానేశారట.

Read Also : Rs 2000 Note: మీరు రూ. 2,000 నోట్లను ఇంకా మార్చలేదా.. అయితే వెంటనే చేంజ్ చేయండిలా..!

అలాగే మరికొన్ని గ్రామాల్లో కూడా రాఖీ పండగ జరుపుకోరు. 20 ఏళ్ల క్రితం ఓ యువతి తన సోదరుడికి రాఖీ కట్టింది. రాఖీ కట్టిన కొన్ని గంటలకే ఆమె సోదరుడు చనిపోయాడు. రాఖీ పండుగ కారణంగా ఈ ఘోరం జరిగిందని నమ్మి నేటికీ వారు రాఖీ చేసుకోవటం లేదు. ఇలా మొత్తంగా 60 గ్రామాలు రాఖీ పండగకు దూరంగా ఉంటూ వస్తున్నారు.