Harish Rao: తప్పుడు ప్రచారం చేసినందుకు రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలి: హరీశ్ రావు

  • Written By:
  • Updated On - April 29, 2024 / 11:54 PM IST

Harish Rao: సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి కి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. సీఏం రేవంత్ రెడ్డికి డిల్లి పోలీసులు నోటిసులు ఇచ్చారని, తప్పుడు ప్రచారం చేసినందుకు, గోబెల్స్ ప్రచారం చేసినందుకు నోటీసుకు ఇచ్చారని, అస్సాంలో ఒకర్ని అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డిని అరెస్టు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ‘‘గులాబి జెండా ఉండగా ఈ ప్రాంతం అభివ్రుది చెందింది. కాంగ్రెస్ వచ్చాక అనేక సమస్యలు. అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. మహిళలకు 2500 అని మాట తప్పారు.
30 దాటినాపింఛన్లు ఇవ్వడం లేదు. తులం బంగారం ఇస్తా అని మోసం చేశారు.
కాంగ్రెస్ వాళ్లు వచ్చాక బంగారం ధర కూడా పెరిగింది. నిరుద్యోగ భృతి అని మోసం చేశారు’’ అని హరీశ్ రావు మండిపడ్డారు.

కాంగ్రెస్ కు మళ్ళీ ఓటు వేస్తే హామీలు అమలు చేయరు. కొట్లాడ్లంటే మీరు బి ఆర్ ఎస్ గెలిపించాలని కోరుతున్నా. కాంగ్రెస్ పాలన బయట పడ్డది. బిజెపికి ఓటు వేస్తే పెనం మీద నుండి పొయ్యిల పడ్డట్టే. తెలంగాణకు ఎంతో నష్టం చేసింది బిజెపి. అందువల్ల బిజెపి నమ్మద్దు అని మనవి చేస్తున్నా. అలవి గాని హామీలు ఇస్తే మొన్న దుబ్బకాలో ఆయన్ని చిత్తుగా 54 వేల ఓట్లతో ఓడించారు. ట్రస్ట్ ద్వారా వంద కోట్లు ఖర్చు చేస్తా అంటున్న వెంకటరామా రెడ్డిని గెలిపించాలని కోరుతున్నా’’ అని హరీశ్ రావు అన్నారు.

అనంతరం ఎంపి అభ్యర్థి వెంకటరామరెడ్డి మాట్లాడారు. ‘‘ఉమ్మడి మెదక్ ప్రజల రుణం తీర్చుకోవాలనే సదుద్దేశ్యంతో, నా ఉమ్మడి కుటుంబ ఆస్తి నుంచి రూ. 100 కోట్లతో వెంకటరామ రెడ్డి ట్రస్టు ద్వారా సేవలందిస్తాను. పేద పిల్లలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల శిక్షణ, యువతకు స్కిల్ డెవలప్మెంట్, మహిళా సాధికారత కోసం కార్యక్రమాలు నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.  నిబద్ధత కలిగిన అధికారిగా, పేదలకు సేవ చేసిన వ్యక్తిగా ఉమ్మడి మెదక్ ప్రజలకు నా జీవితం తెరిచిన పుస్తకం. మరోసారి మీకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని, మీ ఎంపీగా నన్ను దీవించాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నా’’ అని ఎంపీ అభ్యర్థి అన్నారు.