Alluri Sitarama Raju : నేడు అల్లూరి జయంతి.. తెలుగుజాతి గర్వించే ధీరుడు, శూరుడు

ఇవాళ (జులై 4న) అల్లూరి సీతారామరాజు 127వ జయంతి. యావత్ తెలుగు జాతి గర్వించే స్వాతంత్య్ర సమరయోధుడు సీతారామరాజు.

  • Written By:
  • Updated On - July 4, 2024 / 03:44 PM IST

Alluri Sitarama Raju : ఇవాళ (జులై 4న) అల్లూరి సీతారామరాజు 127వ జయంతి. యావత్ తెలుగు జాతి గర్వించే స్వాతంత్య్ర సమరయోధుడు సీతారామరాజు. ఆయన అసలు పేరు శ్రీరామరాజు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామంలోని అమ్మమ్మ ఇంట్లో అల్లూరి సీతారామరాజు జన్మించారు. శ్రీరామరాజు తండ్రి అల్లూరి వెంకటరామరాజు  పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు వాస్తవ్యుడు. ఆయన ఊరిలో ఫొటో స్టూడియో నడిపేవారు. అల్లూరి వెంకటరామరాజు, సూర్యనారాయణమ్మలకు 1895లో పెళ్లి జరిగింది. 1897 జులై 4న సాయంత్రం 4:10 గంటలకు అల్లూరి సీతారామరాజు(Alluri Sitarama Raju) జన్మించారు.

We’re now on WhatsApp. Click to Join

  • బ్రిటీష్‌ పాలకులను అల్లూరి సీతారామరాజు గడగడలాడించారు. ఆదివాసీల హక్కుల కోసం అలుపెరగకుండా పోరాడారు.
  • ఆదివాసీలను చైతన్యం చేసి రంప తిరుగుబాటుకు ఆయన శ్రీకారం చుట్టారు. రెండేళ్ల పాటు రంప తిరుగుబాటు నిర్వహించి.. బ్రిటీష్‌ పాలకులకు కంటి మీద కునుకులేకుండా చేశారు.
  • 1908లో గోదావరి పుష్కరాల సందర్భంగా ప్రబలిన కలరా వ్యాధికి గురై వెంకటరామరాజు మరణించారు.
  • సీతారామరాజు ఆరో  తరగతి చదువుతున్న టైంలో తండ్రిని కోల్పోయారు.
  • ఈనేపథ్యంలో పేదరికం వల్ల అల్లూరి సీతారామరాజు కుటుంబం వివిధ ప్రదేశాలకు వలస వెళ్లాల్సి వచ్చింది.

Also Read :Swami Vivekananda : నేడు స్వామి వివేకానంద వర్ధంతి.. ఆయన జీవితంలోని ఆసక్తికర అంశాలివీ

  • సీతారామరాజు తొలి స్థావరం కృష్ణాదేవిపేట. అక్కడ చిటికెల భాస్కరనాయుడు ఆయనకు ఆశ్రయం కల్పించారు.
  • 1917లో కాషాయ వస్త్రాలు ధరించి కృష్ణాదేవిపేటలో నీలకంఠేశ్వరుని ఆలయంలో అల్లూరి సీతారామరాజు  ఉన్నారు. అక్కడ ఉంటూనే బ్రిటీష్‌ పాలకులపై పోరాటాన్ని మొదలుపెట్టారు.
  • లంబసింగి ఘాట్‌ రోడ్డు నిర్మాణంలో పనిచేస్తున్న గిరిజనులకు చెల్లించే కూలీలో చింతపల్లి తహసీల్దార్‌ బాస్టియన్‌ అన్యాయం చేయడంపై బ్రిటీష్‌ పాలకులకు సీతారామరాజు లేఖ రాశారు.
  • చింతపల్లి తహసీల్దార్‌ బాస్టియన్‌ అత్యంత క్రూరుడు. నర్సీపట్నం నుంచి లంబసింగి వరకు రోడ్డు మార్గం నిర్మించే కాంట్రాక్టరుతో కుమ్మక్కై గిరిజనులకు ఆరు అణాలకు బదులుగా రెండు అణాలు చెల్లించేవాడు.
  • దీనిపై సీతారామరాజు అధికారులకు ఫిర్యాదు చేసినా బ్రిటీష్‌ పాలకులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
  • బ్రిటీష్‌ ప్రభుత్వ ఉద్యోగి ఫజలుల్లాఖాన్‌ సీతారామరాజును చాలా అభిమానించి సహాయం చేసేవాడు. దీంతో ఫజులుల్లాఖాన్‌కి తిరుగుబాటు చేయనని సీతారామరాజు మాట ఇచ్చాడు. ఈ మాటకు ఆయన కట్టుబడి ఉన్నాడు.
  • 1922 జూలై 27న ఫజులుల్లాఖాన్‌ ఆకస్మికంగా మరణించాడు. దీంతో సీతారామరాజు ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు.
  • 1922 ఆగస్టు 19న మహారుద్రాభిషేకం చేసి సాయుధ పోరాటానికి అల్లూరి సీతారామరాజు సిద్ధపడి చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై దాడికి నిర్ణయం తీసుకున్నారు.
  • అల్లూరి సీతారామరాజు తన అనుచరులతో 1922 ఆగస్టు 22న చింతపల్లిపై దాడి చేసి సాయుధ పోరాటానికి నాంది పలికారు. స్టేషన్‌లోని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
  • 1922 ఆగస్టు 23న కృష్ణాదేవిపేట, 24న రాజవోమ్మంగి పోలీస్‌ స్టేషన్‌లపై దాడిచేసి ఆయుధాలను అల్లూరి సీతారామరాజు స్వాధీనం చేసుకున్నారు.
  • 1922 అక్టోబర్‌ 15న అడ్డతీగల పోలీస్‌ స్టేషన్‌కు ముందుగా సమాచారం ఇచ్చి మరీ అల్లూరి సీతారామరాజు దాడి చేశారు.
  • 1922 అక్టోబర్‌ 19న రంపచోడవరం పోలీస్‌ స్టేషన్‌ను పట్టపగలే అల్లూరి సీతారామరాజు ముట్టడించారు.
  • సీతారామరాజు ఉద్యమాన్ని అణచివేసేందుకు 1924 ఏప్రిల్‌ 17 మన్యానికి కలెక్టర్‌గా రూథర్‌ఫర్డ్‌ను నియమించారు. అతడు కృష్ణాదేవిపేటలో సభను ఏర్పాటుచేసి వారం రోజుల్లో విప్లవకారుల ఆచూకీ తెలియకపోతే ప్రజలను కాల్చివేస్తామని హెచ్చరించాడు.
  • 1924  మే 7న అల్లూరి సీతారామరాజును  బ్రిటీష్ పోలీసులు పట్టుకున్నారు. న్యాయ విచారణ చేయకుండానే అల్లూరి సీతారామరాజును కొయ్యూరులోని చింతచెట్టుకు కట్టి గుడాల్‌ కాల్చిచంపాడు.
  • 1924 మే 8న సీతారామరాజు పార్థివ దేహాన్ని ఫొటో తీయించి కృష్ణాదేవిపేటలో అంత్యక్రియలు నిర్వహించారు.