Mars : అంగారకుడిపై రాకాశి సుడిగాలుల గుట్టు రట్టు!!

అంగారకుడు (మార్స్) .. ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు చేస్తున్న గ్రహాల్లో ఒకటి. మార్స్‌పైకి అమెరికా ఇప్పటిదాకా ఐదు రోవర్లను పంపింది. గత ఏడాది దిగింది ఐదో రోవర్ .. దానిపేరు " పెర్స్‌ర్వెన్స్".

  • Written By:
  • Publish Date - June 12, 2022 / 08:00 PM IST

అంగారకుడు (మార్స్) .. ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు చేస్తున్న గ్రహాల్లో ఒకటి. మార్స్‌పైకి అమెరికా ఇప్పటిదాకా ఐదు రోవర్లను పంపింది. గత ఏడాది దిగింది ఐదో రోవర్ .. దానిపేరు ” పెర్స్‌ర్వెన్స్”. తాజాగా ఇది అంగారకుడిపై వీచే బలమైన సుడి గాలుల ఫోటోలను పంపింది. ఇసుక రేణువులు, ధూళి కణాలతో ఆ సుడి గాలులు వీస్తాయని తాజా అధ్యయనంలో గుర్తించారు. మార్స్ పై తీవ్రమైన సుడి గాలి సగటున 4 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి వీస్తుందని వెల్లడైంది. ఆ గ్రహంపై పూర్తిగా పొడి వాతావరణం ఉండటంతో ఇసుక రేణువులు అతి సులువుగా సుడిగాలిలో ప్రయాణిస్తున్నాయని పరిశోధకులు వివరించారు. సుడి గాలులలోని ఈ ఇసుక రేణువులు బలంగా తాకుతుండటం వల్ల పెర్స్‌ర్వెన్స్ రోవర్ లోని గాలిని గుర్తించే 2 సెన్సర్లు దెబ్బతిన్నాయి. వాటి వైరింగ్ దెబ్బతింది. పెర్స్‌ర్వెన్స్ ఐదో రోవర్ మార్స్ పై దిగి 216 రోజులు గడిచాయి. ఈ వ్యవధిలో మూడుసార్లు ఇసుక తుఫానులు చోటుచేసుకున్నట్లు రోవర్ లోని కెమెరాల్లో రికార్డు అయింది. గతంలో మార్స్ పైకి అడుగు మోపిన క్యూరియాసిటీ రోవర్, ఇన్ సైట్ ల్యాండర్ కూడా ఇసుక తుఫానుల వల్ల సెన్సర్లలో సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నాయి. ఇన్ సైట్ ల్యాండర్ మరో నెల రోజుల్లో పూర్తిగా స్విచ్ ఆఫ్ అయ్యే సూచనలు ఉన్నాయి.

ఎలా ఉంటుంది ?

పెర్స్‌ర్వెన్స్ రోవర్ ఒక ఎస్‌యూవీ పరిమాణంలో ఉంటుంది. బరువు దాదాపు ఒక టన్ను. ఏడు అడుగుల పొడవైన రోబోటిక్ చేయి, 19 కెమెరాలు, రెండు మైక్రోఫోన్లు ఉంటాయి. అంగారకుడిపై ఒంటరిగా తిరుగుతూ పరిశోధనలు చేస్తున్న నాసా పర్సెవరెన్స్ రోవర్ ఓ కొత్తరకం రాళ్లను గుర్తించింది.

మనుషులు ల్యాండ్ అయితే..

ఒక వేళ మానవుడు అంగారక గ్రహంపై స్పేస్‌ సూట్‌ లేకుండా వెళితే.. శరీరంలోని నరాలు నలిగిపోతాయి. వ్యక్తి కేవలం రెండు నిమిసాల్లోనే చనిపోతాడు. అంగారక గ్రహంపై 95 శాతం కార్బన్‌ డయాక్సైడ్‌ ఉంటుంది. ఆక్సిజన్‌ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఈ గ్రహంపై ఉష్ణోగ్రత -88 డిగ్రీలుగా ఉంటుంది. దీంతో శరీరంలోని రక్తం కూడా గడ్డ కట్టుకుపోతుంది.