Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కు.. నిద్రలేమికి చెక్ పెట్టే 7 టిప్స్

Stress Management : “ఒత్తిడి” అనేది మనం చేసేరోజువారీ  కార్యకలాపాలకు శరీరం యొక్క సహజ ప్రతిస్పందన. రోజూ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా ఒత్తిడి చుట్టుముడుతుంది. నిద్రలేమి వల్ల కలిగే అలసట మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. నిద్రలేమి సమస్యకు గల ప్రధాన కారణాల్లో  ముఖ్యమైనది ఫోన్ కు అడిక్ట్ కావడం. నిద్రపోవడానికి ముందు వరకు ఫోన్ లో మునిగిపోవడం అనేది మీ నిద్ర క్వాలిటీని దెబ్బతీస్తుంది. తగినంత రాత్రి నిద్ర  లేకపోవడం అనేది శారీరకంగా, మానసికంగా మీ శరీరానికి అలసట కలిగిస్తుంది. శరీరం సక్రమంగా పని చేయాలంటే .. మెదడు యాక్టివ్ గా ఉండాలంటే  ప్రతిరోజు కనీసం 7 నుంచి 8  గంటలు నిద్రపోవాలి. ఇంతకంటే తక్కువగా నిద్రపోతే  మీ గుండె, కిడ్నీలు, మానసిక ఆరోగ్యంపై నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుంది. ఒత్తిడి తగ్గిపోయి మీకు హాయిగా నిద్రపట్టేలా చేసే7 లైఫ్‌స్టైల్  టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. వీటిని పాటిస్తేమీ నిద్రకు భంగం కలగదు. ఒత్తిడి కూడా  పటాపంచలు అయిపోతుంది.

ఆహారపు అలవాట్లు:

నిద్రపోవడానికి ముందు అరటిపండు, గుమ్మడి గింజలు, బాదం, అక్రోట్, పిస్తా, జీడిపప్పు, చామంతి హెర్బల్ టీని తాగితే మంచిది. ఇవి మీకు మంచి నిద్రను ఇస్తాయి. మెలటోనిన్ , ఇతర మినరల్స్‌ కలిగిన ఫుడ్ ఐటమ్స్ తింటే  నిద్రలేమి సమస్య తొలగిపోతుందని ఒక ప్రయోగంలో నిరూపితం అయింది. ప్రత్యేకించి వృద్ధులలో నిద్ర నాణ్యతను పెంచేందుకు ఇవి హెల్ప్ చేస్తాయి.

డిన్నర్ టైం:

నిద్రవేళకు, రాత్రి భోజనానికి మధ్య కనీసం 3 గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.

వ్యాయామం చేయడం:

వారానికి కనీసం 4 రోజులు వ్యాయామం చేయండి.

హైడ్రేటెడ్ గా ఉండండి:

నీరు, ఫ్రూట్ జ్యూస్ లు   బాగా తాగండి. దీనివల్ల హైడ్రేటెడ్ గా  ఉంటారు. ఇది మీ మానసిక స్థితిని కూడా యాక్టివ్ చేస్తుంది. అలసట దరిచేరకుండా చేస్తుంది.

సన్నిహితులతో  చిట్ చాట్:

మీరు ఒత్తిడిగా ఫీల్ అయితే మీ సన్నిహిత మిత్రులు లేదా కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడండి. మీతో ఎమోషనల్ అటాచ్ మెంట్ కలిగిన వారితో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. వారు ఇచ్చే సలహాలు పాజిటివ్ ఆటిట్యుడ్ తో ఉంటే రిసీవ్ చేసుకోండి.

విటమిన్ లెవల్స్ తనిఖీ చేయండి:

మీ బాడీలోని విటమిన్ D, విటమిన్ B12 స్థాయిలను చెక్ చేసుకోండి. ఇవి కూడా శరీరానికి చాలా అవసరం. ఇవి లేకపోవడం వల్ల కూడా మీ నిద్రకు ఆటంకం కలుగుతుంది.

ఉదయం సూర్యకాంతి:

ఉదయం వేళ సూర్యకాంతిలో  15 నుంచి 20 నిమిషాల పాటు నిలబడండి. సూర్యకాంతి అనేది విటమిన్ డి యొక్క సహజ మూలం.

స్క్రీన్  టైమ్:

రాత్రి నిద్రపోయే చివరి నిమిషం దాకా చాలామంది ఫోన్ లోనే గడుపుతారు. ఇది మంచిది కాదు. నిద్రపోవడానికి కనీసం గంట ముందు మీరు ఫోన్ చూడటం ఆపేయండి.

కెఫిన్ పానీయాలు:

నిద్రపోయే టైం కు ముందు కాఫీ , టీ తాగొద్దు. దీనివల్ల బెడ్ పై నడుము వాల్చిన వెంటనే నిద్రపట్టదు.

Also Read:  Business Ideas: ఈ వేసవిలో సిరులు కురిపించే బిజినెస్ ప్రారంభించాలని చూస్తున్నారా.. అయితే ఐస్ క్యూబ్స్‌ వ్యాపారమే బెస్ట్ ఛాయిస్..!