Union Budget : `మోడీ` మేడిపండు బ‌డ్జెట్‌, రూ. 45ల‌క్ష‌ల కోట్ల బ‌డ్జెట్ లో రైతే లాస్ట్‌

కేంద్ర బ‌డ్జెట్ (Union Budget) మేడిపండు సామెతలాగా ఉంది.

  • Written By:
  • Updated On - February 1, 2023 / 03:18 PM IST

కేంద్ర బ‌డ్జెట్ (Union Budget) మేడిపండు సామెతలాగా ఉంది. కోవిడ్ స‌మ‌యంలో ఆదుకున్న వ్య‌వ‌సాయాన్ని నిర్ల‌క్ష్యం చేస్తూ బ‌డ్జెట్ కేటాయింపుల్లో మిగిలిన రంగాల కంటే అత్యంత త‌క్కువ వాట‌ను క‌ల్పించ‌డం శోచ‌నీయం. కొండ‌ను త‌వ్వి ఎలుక‌ను బ‌ట్టిన చందంగా వేత‌న జీవుల‌కు 5 ల‌క్ష‌ల నుంచి 7ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయ ప‌రిమితిని పెంచుతూ టాక్స్ ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌డం మిన‌హా మిగిలిన అంశాల‌న్నీ బ‌డ్జెట్ దేవ‌తావ‌స్త్రం మాదిరిగా ఉంది. ప్ర‌త్య‌క్ష ప‌న్నులు త‌గ్గించిన‌ట్టు చూపుతూ ప‌రోక్ష ప‌న్నుల‌ను పెద్ద ఎత్తున వ‌సూలు చేసేలా రూప‌క‌ల్ప‌న చేశారు. కొన్ని ర‌కాల వ‌స్తువుల రేట్ల‌ను త‌గ్గిస్తూ వాటి నిర్వ‌హ‌ణ‌కు అవ‌స‌ర‌మైన విడిప‌రిక‌రాల ధ‌ర‌ల‌ను అమాంతం పెంచుతూ బ‌డ్జెట్ లో ఉంది. జీడీపీని 7శాతం చూపుతూ ప్ర‌పంచ‌లోనే భార‌త్ దూసుకెళుతోంద‌ని ఎన్డీయే(Modi) స‌ర్కార్ చెబుతోంది.

కేంద్ర బ‌డ్జెట్  మేడిపండు సామెతలాగా..(Union Budget)

మొత్తం 45.03ల‌క్ష‌ల కోట్ల బ‌డ్జెట్(Union Budget) లో ర‌క్ష‌ణ‌శాఖ‌కు పెద్ద పీఠ వేస్తూ 5.94ల‌క్ష‌ల కోట్ల‌ను కేటాయించారు. రెండో ప్రాధాన్యంగా రోడ్లు, హైవేల‌కు 2.70ల‌క్ష‌ల కోట్లు, మూడో ప్రాధాన్యం కింద రైల్వే శాఖ‌కు 2.41ల‌క్ష‌ల కోట్లు, నాలుగో ప్రాధాన్యం కింద పౌర స‌ర‌ఫ‌రా కింద 2.06ల‌క్ష‌ల కోట్లు, ఐదో ప్రాధాన్యంగా గ్రామీణాభివృద్ధి కోసం 1.6ల‌క్ష‌ల కోట్లు కేటాయించ‌గా చివ‌రి ప్రాధాన్యం కింద వ్య‌వ‌సాయ‌శాఖ‌కు 1.25ల‌క్ష‌ల కోట్ల‌ను కేటాయించ‌డం గ‌మ‌నార్హం. ఇక ప్ర‌ణాళికేత‌ర వ్య‌యం 25.59ల‌క్ష‌ల కోట్లుకాగా, ప్ర‌ణాళికా వ్య‌యం19.44ల‌క్ష‌ల కోట్లుగా ఉంది. ప‌న్నులో రాష్ట్రాల‌కు ఇచ్చే వాటా రూ. 5.13లక్ష‌ల కోట్లుగా చూపడం(Modi) విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటోంది.

Also Read : Budget 2023: ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్!

అమృత్ కాల బ‌డ్జెట్ అంటూ కేవ‌లం 86 నిమిషాల్లోనే నిర్మ‌లా సీతారామ‌న్ బ‌డ్జెట్ ప్ర‌సంగాన్ని ముగించ‌డం ప్ర‌త్యేక‌త‌గా క‌నిపిస్తోంది. గ‌తేడాది నిర్మలా సీతారామ‌న్ 92 నిమిషాల స‌మ‌యం తీసుకున్నారు. అంత‌కుముందు 2021లో గంటా 50 నిమిషాల స‌మ‌యం తీసుకున్నారు. 2020లో భార‌త దేశ చ‌రిత్ర‌లోనే ఆర్థిక మంత్రుల బ‌డ్జెట్ ప్ర‌సంగాల రికార్డుల‌ను తిర‌గ‌రాశారు.

ఫ‌స్ట్ బ‌డ్జెట్ ఇన్ అమృత్ కాల్‌

2020-21 ఆర్థిక సంవ‌త్స‌ర బ‌డ్జెట్‌ను 2020 ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీన నిర్మ‌లా సీతారామ‌న్ లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టి బ‌డ్జెట్ ప్ర‌సంగం కోసం ఆమె 2.40 గంట‌ల స‌మ‌యం తీసుకున్నారు. బుధ‌వారం బ‌డ్జెట్ ప్ర‌సంగం ప్రారంభిస్తూ..`దిస్ ఈజ్ ది ఫ‌స్ట్ బ‌డ్జెట్ ఇన్ అమృత్ కాల్‌` అని నిర్మ‌లా సీతారామ‌న్ పేర్కొన‌ప్ప‌టికీ ఆ దిశ‌గా బ‌డ్జెట్ క‌నిపించ‌డంలేదు. ఆమె వినిపించిన బ‌డ్జెట్ ప్ర‌సంగంలోని హైలెట్ పాయింట్ తీసుకుంటే…

* కొత్త ట్యాక్స్ స్లాబ్‍ రేట్లు

0 నుంచి రూ.3లక్షల వార్షికాదాయం – పన్ను లేదు

రూ.3లక్షల నుంచి రూ.6లక్షల వార్షికాదాయం – 5 శాతం పన్ను

రూ.6లక్షల నుంచి రూ.9లక్షల వార్షికాదాయం – 10 శాతం పన్ను

రూ.9లక్షల నుంచి రూ.12లక్షల వార్షికాదాయం – 15 శాతం పన్ను

రూ.12లక్షల నుంచి రూ.15లక్షల వార్షికాదాయం – 20 శాతం పన్ను

రూ.15లక్షలకు పైగా వార్షికాదాయం – 30 శాతం పన్ను

*ఐటీ రిటర్నులు దాఖలు చేసే సమయంలో పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు. కావాలంటే పాత పన్ను విధానాన్ని కూడా కొనసాగించుకోవచ్చు. పాత పన్ను విధానం ఎంపిక చేసుకున్న వారు మినహాయింపుల కోసం క్లయిమ్ చేసుకోవచ్చు.

*సమ్మిళిత అభివృద్ధి, చివరి మైలువరకు చేరుకోవడం, ఇన్‌ఫ్రా – పెట్టుబడులు, సామర్థ్యాలను ఆవిష్కరించడం, హరిత వృద్ధి, యువశక్తి, ఆర్థిక రంగం తమ ఏడు ప్రాధాన్యతలను వివరించారు.

*దేశంలోని అగ్రి స్టార్టప్‌లకు సహాయం చేయడానికి అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 20 లక్షల కోట్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు.

*సాంప్రదాయ కళాకారులు, హస్తకళాకారులకు సహాయం అందించే ప్యాకేజీగా ప్రధానమంత్రి విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్‌ను కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు. తమ ఉత్పత్తుల నాణ్యత మెరుగుపరుస్తామని, ఈ వ్యాపారవేత్తలను ఎంఎస్ఎంఈ వాల్యూ చైన్‌తో అనుసంధానం చేస్తామని ప్రకటించారు.

*ప్రస్తుతం రూ.5లక్షలుగా ఉన్న ఆదాయ పన్ను పరిమితిని రూ.7లక్షలకు ప్రభుత్వం పెంచింది. కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకున్న వారికి ఇది వర్తిస్తుంది. కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకున్న వారికి వివిధ సెక్షన్ల కింద ఎలాంటి పన్ను మినహాయింపులు ఉండవు. ఇక పాత పన్నుల విధానం ఎంపిక చేసుకున్న వారికి రూ.3లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది. ఇంత కాలం రూ.2.5లక్షలుగా ఉన్న దీన్ని రూ.3లక్షలకు పెంచింది కేంద్రం. అంటే వార్షికంగా రూ.3లక్షల ఆదాయం ఉన్న వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఆపై ఆదాయం ఉంటే కొత్త స్లాబ్ రేట్ల ప్రకారం పన్నులు ఉంటాయి.

*యువ పారిశ్రామికవేత్తల ద్వారా అగ్రి-స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.

*పశుపోషణ, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమలపై దృష్టి సారించి వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 20 లక్షల కోట్లకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని సీతారామన్ పార్లమెంట్‌కు తెలిపారు. గత ఆరేళ్లలో దేశంలో వ్యవసాయ రంగం సగటు వార్షిక వృద్ధి రేటు 4.6 శాతంగా ఉంది.

*‘వాల్యూ చైన్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం యొక్క ఉప-పథకాన్ని ప్రారంభిస్తాం’ అని ఆమె చెప్పారు.

*సీతారామన్ ఉదయం 11 గంటలకు తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు, ఇది మోడీ ప్రభుత్వం రెండో టర్మ్‌లో చివరి పూర్తి బడ్జెట్. మునుపటి రెండు యూనియన్ బడ్జెట్‌ల మాదిరిగానే, యూనియన్ బడ్జెట్ 2023-24 కూడా కాగిత రహిత రూపంలో సమర్పించారు.

*  మహిళా సమ్మాన్​ సేవింగ్స్​ సర్టిఫికేట్​ను ప్రకటించింది కేంద్రం. ఇందులో భాగంగా 7.5శాతం వడ్డీని ఇస్తుంది. మహిళా సమ్మాన్​ సేవింగ్స్​ సర్టిఫికేట్ అనేది వన్​ టైమ్​ ఇన్​వెస్ట్​మెంట్​ స్కీమ్​. రెండేళ్ల కాల వ్యవధి ఉంటుంది. ఫలితంగా మార్చ్​ 2025తో ఈ పథకం ముగుస్తుంది. ఈ పొదుపు పథకంలో భాగంగా ఖాతాదారులకు 7.5శాతం వడ్డీని ఇస్తుంది ప్రభుత్వం. అవసరమైతే.. నగదును పాక్షికంగా ఉపసంహరించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.

*సీనియర్​ సిటిజెన్​ సేవింగ్స్​ స్కీమ్ (ఎస్​సీఎస్​ఎస్​) ​లో డిపాజిట్​ లిమిట్​ని పెంచుతున్నట్టు నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. ఈ మేరకు బడ్జెట్​ 2023 ప్రసంగంలో వివరించారు. “సీనియర్​ సిటిజెన్​ సేవింగ్స్​ స్కీమ్​లో రూ. 15లక్షలుగా ఉన్న డిపాజిట్​ లిమిట్​ను రూ. 30లక్షలకు పెంచుతున్నాము,” అని నిర్మల అన్నారు. అంతేకాకుండా.. నెలవారీ ఆదాయపు ఖాత పథకం లిమిట్​ని కూడా రూ. 4.5లక్షల నుంచి రూ. 9లక్షలకు పెంచుతున్నట్టు వివరించారు. జాయింట్​ అకౌంట్​ల మ్యాగ్జిమం లిమిట్​ను రూ. 9లక్షల నుంచి రూ. 15లక్షలకు పెంచినట్టు స్పష్టం చేశారు. ఎస్​సీఎస్​ఎస్​ వడ్డీ రేటును 7.4శాతం నుంచి 7.6శాతానికి ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే.

*మరోవైపు మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులకు భారీగా ఊరటనిచ్చింది కేంద్రం. రూ. 7లక్షల వేతనం వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు

*చిరు వ్యాపారుల‌కు పాన్ కార్డు త‌ప్ప‌నిసరి
చిరు వ్యాపారుల‌కు కూడా పాన్ కార్డు త‌ప్ప‌నిస‌రి. ప్ర‌భుత్వ ప‌థ‌కాల ల‌బ్దిదారుల‌కు కూడా పాన్ కార్డు త‌ప్ప‌నిసరి.

*ధ‌ర‌లు త‌గ్గేవి..
మొబైల్ ఫోన్లు, కెమెరాలు, టీవీలు, ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ధ‌ర‌లు, కిచెన్ చిమ్నీలు..

*ధ‌ర‌లు పెరిగేవి..
సిగ‌రెట్ల ధ‌ర‌లు, ఇంపోర్టెడ్ ర‌బ్బ‌ర్, బ‌ట్ట‌లు, బంగారం, వెండి, సిమెంట్.. వాహ‌నాల టైర్ల ధ‌ర‌లు.

*అత్యాధునిక సాంకేతిక‌త నేర్చుకోవ‌డానికి యువ‌త‌కు ప్రోత్సాహం
అత్యాధునిక సాంకేతిక‌త నేర్చుకోవ‌డానికి యువ‌త‌కు ప్రోత్సాహం. నాలుగో పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు.

* కోస్తాలో మ‌డ అడ‌వుల అభివృద్ధికి మిస్టీ పేరుతో ప్ర‌త్యేక ప‌థ‌కం
కోస్తాలో మ‌డ అడ‌వుల అభివృద్ధికి మిస్టీ పేరుతో ప్ర‌త్యేక ప‌థ‌కం. రాంసార్ చిత్త‌డి నేల‌లు, స‌ర‌స్సుల అభివృద్ధికి ప్ర‌త్యేక నిధులు. రాంసార్ ప్రాంతాల్లోని స్థానికుల‌కు టూరిజం, ఉపాధి క‌ల్ప‌న‌లో ప్రాధాన్యం ఇస్తాం.
*క‌స్ట‌మ్స్ డ్యూటీ త‌గ్గింపు
మొబైల్స్, టీవీలు, కెమెరాల విడి భాగాల దిగుమ‌తుల‌పై క‌స్ట‌మ్స్ డ్యూటీ త‌గ్గింపు. జౌళి మిన‌హా క‌స్ట‌మ్స్ డ్యూటీలు 21 నుంచి 13 శాతానికి త‌గ్గింపు. కిచెన్ చిమ్నీల‌పై క‌స్ట‌మ్స్ డ్యూటీ త‌గ్గింపు.
*మ‌హిళా స‌మ్మాన్ బ‌చ‌త్ ప‌త్ర ప‌థ‌కం ప్రారంభం..
మ‌హిళ‌లు, బాలిక‌ల కోసం మ‌హిళా స‌మ్మాన్ బ‌చ‌త్ ప‌త్ర ప‌థ‌కం ప్రారంభం. 2025 వ‌ర‌కు అమ‌ల్లో ఉండ‌నున్న మ‌హిళా స‌మ్మాన్ బ‌చ‌త్ ప‌త్ర ప‌థ‌కం. సీనియ‌ర్ సిటిజ‌న్స్ డిపాజిట్ ప‌రిమితి రూ. 15 ల‌క్ష‌ల నుంచి రూ. 30 ల‌క్ష‌లకు పెంపు.
*జీడీపీలో ద్ర‌వ్యలోటు 5.9 శాతం
జీడీపీలో ద్ర‌వ్యలోటు 5.9 శాతం ఉండే అవ‌కాశం. 2025-26 నాటికి ద్ర‌వ్య‌లోటు 4.5 శాతానికి ప‌రిమితం చేయాల‌ని ల‌క్ష్యం. బ‌హిరంగ విప‌ణి నుంచి రూ. 15.43 ల‌క్ష‌ల కోట్ల అప్పులు.
*కృత్రిమ వ‌జ్రాల‌కు క‌స్ట‌మ్స్ డ్యూటీ త‌గ్గింపు
కృత్రిమ వ‌జ్రాల‌పై ప‌రిశోధ‌న చేసే ఐఐటీల‌కు ప్ర‌త్యేక గ్రాంట్లు. కృత్రిమ వ‌జ్రాల‌కు క‌స్ట‌మ్స్ డ్యూటీ త‌గ్గింపు.

*కాలం చెల్లిన వాహ‌నాల తొల‌గింపు మా త‌క్ష‌ణ ప్రాధాన్యం
కాలం చెల్లిన వాహ‌నాల తొల‌గింపు మా త‌క్ష‌ణ ప్రాధాన్యం. కేంద్ర ప్ర‌భుత్వ వాహ‌నాలు మార్చేందుకు ప్ర‌త్యేక నిధులు. కొత్త వాహ‌నాల కొనుగోలుకు రాష్ట్రాల‌కు సాయం అందిస్తాం. వాహ‌నాల తుక్కు కోసం మ‌రిన్ని నిధులు కేటాయింపు.
*విద్యుత్ రంగానికి రూ. 35 వేల కోట్లు..
నేష‌న‌ల్ హైడ్రోజ‌న్ గ్రీన్ మిష‌న్‌కు రూ. 19,700 కోట్లు కేటాయింపు. విద్యుత్ రంగానికి రూ. 35 వేల కోట్లు. ఏడాదికి అర్బ‌న్ ఇన్‌ఫ్రా ఫండ్ రూ. 10 వేల కోట్లు. గోబ‌ర్ద‌న్ స్కీం కింద 200 బ‌యో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు. ల‌డాఖ్‌లో 13 గిగావాట్ల గ్రీన్ ఎన‌ర్జీ ప్రాజెక్టు ఏర్పాటు. ఎన‌ర్జీ ట్రాన్సిష‌న్ కోసం రూ. 38 వేల కోట్లు. యువ‌త‌లో నైపుణ్యాభివృద్ధి కోసం ప్ర‌ధాన‌మంత్రి కౌశ‌ల్ వికాస్ యోజ‌న ప‌థ‌కం.
*క‌ర్ణాట‌క‌కు రూ. 5,300 కోట్లు..
ఎన్నిక‌లు జ‌రుగుతున్న క‌ర్ణాట‌క‌కు ప్ర‌త్యేక నిధులు కేటాయింపు. క‌ర్ణాట‌క‌లోని వెనుక‌బ‌డ్డ ప్రాంతాల‌కు, సాగునీటి రంగానికి రూ. 5,300 కోట్లు.
*ఈ-కోర్టుల ఏర్పాటుకు రూ. 7 వేల కోట్ల నిధులు
ఈ-కోర్టుల ఏర్పాటుకు రూ. 7 వేల కోట్ల నిధులు. ఎంఎస్ఈలు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు, వ్యాపార సంస్థ‌ల‌కు డిజిలాక‌ర్ సేవ‌ల విస్త‌ర‌ణ‌. 5జీ సేవ‌ల యాప్‌ల అభివృద్ధికి వంద ప‌రిశోధ‌నా సంస్థ‌లు. 50 ఎయిర్‌పోర్టుల పున‌రుద్ధ‌ర‌ణ‌. ట్రాన్స్‌పోర్టు రంగానికి ప్రాధాన్య‌త‌న‌. క్లీన్ ప్లాంట్ కార్య‌క్ర‌మానికి రూ. 2 వేల కోట్లు. మూడు కొత్త ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ సెంట‌ర్లు. వ్యాపార సంస్థ‌ల‌కు ఇక‌పై పాన్ కార్డు ద్వారానే గుర్తింపు.
*బ‌డ్జెట్‌లో ఏడు అంశాల‌కు ప్రాధాన్య‌త‌..
1. స‌మ్మిళిత అభివృద్ధి
2. చివ‌రి వ్య‌క్తికి కూడా అభివృద్ధి ఫ‌లాలు అంద‌డం
3. మౌలిక స‌దుపాయాలు, పెట్టుబ‌డులు
4. యువ‌శ‌క్తి
5. గ్రీన్ గ్రోత్
6. ఆర్థిక రంగం బ‌లోపేతం
7. వ‌న‌రుల‌ను వాడుకోవ‌డం

* రాష్ట్రాల‌కు వ‌డ్డీ లేని రుణాల ప‌థ‌కం మ‌రో ఏడాది పొడిగింపు
రాష్ట్రాల‌కు వ‌డ్డీ లేని రుణాల ప‌థ‌కం మ‌రో ఏడాది పొడిగింపు. వ‌డ్డీ లేని రుణాల ప‌థ‌కం కోసం రూ. 13.7 ల‌క్ష‌ల కోట్లు. కీల‌క‌మైన వంద మౌలిక వ‌స‌తుల ప్రాజెక్టుల‌కు రూ. 75 వేల కోట్లు. బ‌డ్జెట్‌లో మూల‌ధ‌న వ్య‌యం మొత్తం రూ. 10 ల‌క్ష‌ల కోట్లు.
*రైల్వేల‌కు రూ. 2.4 ల‌క్ష‌ల కోట్లు
రైల్వేల‌కు రూ. 2. 4 ల‌క్ష‌ల కోట్లు. 2013-14తో పోల్చితే రైల్వేల‌కు 9 రెట్ల నిధులు అధికం.

*81 ల‌క్ష‌ల సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల‌కు చేయూత‌
81 ల‌క్ష‌ల సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల‌కు చేయూత‌. సామాన్యుల సాధికార‌తే బ‌డ్జెట్ ల‌క్ష్యం. నేష‌న‌ల్ డిజిట‌ల్ లైబ్ర‌రీని ప్రోత్సాహిస్తాం. ద‌ళితుల అభివృద్ధికి ప్ర‌త్యేక ప‌థ‌కాలు. దేశంలోని 63 వేల వ్య‌వ‌సాయ ప‌ర‌ప‌తి సంఘాల డిజిట‌లైజేష‌న్. దీని కోసం రూ. 2 వేల కోట్లు కేటాయింపు. హ‌రిత అభివృద్ధి దిశ‌గా అనేక కార్య‌క్ర‌మాలు రూపొందిస్తున్నాం.
*ఏక‌ల‌వ్య పాఠ‌శాల‌ల్లో 38,800 ఉపాధ్యాయుల నియామ‌కం
పీవీటీజీ గిరిజ‌నుల కోసం ప్ర‌త్యేక చ‌ర్య‌లు. మారుమూల గిరిజ‌న గ్రామాల అభివృద్ది కోసం రూ. 15,000 కోట్లు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ల‌క్ష్యంగా బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న‌. ఏక‌ల‌వ్య మోడ‌ల్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ ఏర్పాటు. ఏక‌ల‌వ్య పాఠ‌శాల‌ల్లో 38,800 ఉపాధ్యాయులు నియామ‌కం. పీఎం ఆవాస్ యోజ‌న‌కు రూ. 79 వేల కోట్లు కేటాయింపు.
*సికెల్ సెల్ వ్యాధిగ్ర‌స్తుల‌కు ప్ర‌త్యేక చేయూత‌..
సికెల్ సెల్ వ్యాధిగ్ర‌స్తుల‌కు ప్ర‌త్యేక చేయూత‌. ప్రయివేటు, ప్ర‌భుత్వ ప‌రిశోధ‌న‌ల కోసం ఐసీఎంఆర్ ల్యాబ్స్. ఫార్మా రంగ అభివృద్ధికి ప్ర‌త్యేక ప‌థ‌కం. 11.7 కోట్ల మందికి ఉచితంగా టాయిలెట్స్ నిర్మించి ఇచ్చాం. చిరు ధాన్యాల పంట‌ల‌కు ప్ర‌త్యేక ప్రోత్సాహ‌కాలు. విద్యార్థుల‌కు చ‌దువు ఆస‌క్తి పెంచేందుకు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు. ప్రాంతీయ భాష‌ల్లో ఎన్బీటీ ద్వారా మ‌రిన్ని పుస్త‌కాలు.
*బ‌డ్జెట్‌లో ఏడు అంశాల‌కు ప్రాధాన్య‌త‌..
బ‌డ్జెట్‌లో ఏడు అంశాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చాం. మ‌హిళ‌లు, రైతుల‌, యువ‌త‌, వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త ఇచ్చాం.
ప‌ర్యాట‌క రంగాన్ని మ‌రింత ప్రోత్సహించేలా సంస్క‌ర‌ణ‌లు. వ్య‌వ‌సాయ రంగంలో స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌ణాళిక‌. మ‌త్స్య‌కారుల అభివృద్ధి కోసం మ‌రిన్ని కేటాయింపులు. వ్య‌వ‌సాయ అభివృద్ధికి ప్ర‌త్యేక నిధి ఏర్పాటు. 63 వేల వ్య‌వ‌సాయ ప‌ర‌ప‌తి సంఘాల డిజిట‌లైజేష‌న్, రూ. 2 వేల కోట్లు కేటాయింపు.
*2047 ల‌క్ష్యంగా ప‌థ‌కాలు రూపొందిస్తున్నాం..
2047 ల‌క్ష్యంగా ప‌థ‌కాలు రూపొందిస్తున్నాం. భార‌త్‌లో డిజిట‌ల్ యూపీఐ చెల్లింపులు భారీగా పెరిగాయి. ఈపీఎఫ్‌వోలో స‌భ్యుల సంఖ్య రెట్టింపు అయింది. మ‌హిళా సాధికార‌త దిశ‌గా కృషి చేస్తున్నాం. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌తో చేనేత వ‌ర్గాల‌కు ల‌బ్ధి చేకూరింది. గ్రీన్ ఎన‌ర్జీకి ప్ర‌భుత్వం తొలి ప్రాధాన్య‌త ఇస్తుంది. వంద కోట్ల మంది 220 కోట్ల డోసుల‌ను అందించాం.
*భార‌త్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఎదిగింది..
తొమ్మిదేండ్ల‌లో ప్ర‌పంచంలో అతిపెద్ద ఆర్థిక వ్య‌వస్థ‌గా ఆవిర్భ‌వించాం. తొమ్మిదేండ్ల‌లో త‌ల‌స‌రి ఆదాయం రెట్టింపు అయింది. ప్ర‌పంచ స‌వాళ్ల‌ను భార‌త్ ఆర్థిక వ్య‌వ‌స్థ దీటుగా ఎదుర్కొని నిల‌బ‌డింది. జీ20 అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌తో భార‌త్ కీల‌క ప్ర‌స్థానాన్ని ప్రారంభించింది. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కొన‌సాగుతోంది. కొవిడ్ స‌మ‌యంలోనూ ఎవ‌రూ ఆక‌లితో బాధ‌ప‌డ‌కుండా చూశాం.
*దేశం వృద్ధి రేటు శ‌ర‌వేగంగా పెరుగుతోంది..
ప్ర‌స్తుత ఏడాదికి 7 శాతం వృద్ధి న‌మోద‌ని ఆర్థిక స‌ర్వే అంచ‌నా వేసింది. దేశం వృద్ధి రేటు శ‌ర‌వేగంగా పెరుగుతోంది. భార‌త్ ఆర్థిక వ్య‌వ‌స్థ అభివృద్ధిని ప్ర‌పంచ దేశాలు గుర్తించాయి.