Dil Raju’s Son : విజయ్ తో “దిల్ రాజు” వారసుడు! వైరల్ ఫొటో

  • Written By:
  • Updated On - November 2, 2022 / 11:19 AM IST

ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండోసారి తండ్రి అయిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే ఆయన రెండవ భార్యకు కొడుకు జన్మించాడు. కానీ ఇప్పటివరకు దిల్ రాజు తన వారసుడి ఫొటోలను బయట పెట్టలేదు.తాజాగా, తమిళ హీరో విజయ్ చిన్న పిల్లవాడిని చేతిలో పట్టుకున్న ఫోటో వైరల్ అవుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు చిత్రంలో విజయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. విజయ్ దిల్ రాజు ఇంట్లో కొంత సమయం గడిపాడు, అక్కడ అతను అబ్బాయిని పట్టుకుని కనిపించాడు. ఈ ఫోటో వైరల్ అవుతోంది. నెటిజన్లు అతన్ని ‘క్యూటీ’ అని పిలుస్తున్నారు.