Sanjeevayya: ఒక సీఎం ఇన్ని చేయగలరా? దళితులపై జిమ్మిక్కులు! సంజీవయ్య పై ‘రెడ్డి’ వర్గం స్వారీ

రాజకీయాల్లో సామాజిక వర్గ పోరు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎక్కువ అయింది. 70 ఏళ్ల క్రితమే రెడ్డి సామాజిక వర్గం దళితుల పై రాజకీయ ఆధిపత్యాన్ని డైరెక్ట్ గా

  • Written By:
  • Publish Date - March 6, 2023 / 10:55 AM IST

రాజకీయాల్లో సామాజిక వర్గ పోరు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎక్కువ అయింది. 70 ఏళ్ల క్రితమే రెడ్డి సామాజిక వర్గం దళితుల పై రాజకీయ ఆధిపత్యాన్ని డైరెక్ట్ గా ప్రదర్శించారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ దామోదర సంజీవయ్య (Sanjeevayya) ప్రస్థానాన్ని తీసుకోవచ్చు. ఆనాడు ఆయన సీఎం కాకుండా అడ్డుపడి కాంగ్రెస్ అధిష్టానం మీద ఫైట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దళితుల్ని పల్లకీ మోసే బోయలు మాదిరిగా ఉండిపోయారు. కానీ, సంజీవయ్య చేసిన ప్రజాదరణ ఉన్న పనులు, పథకాలు ఇప్పటి వరకు ఏ సీఎం కూడా చేయలేదు. ఒక సీఎం ఇన్ని పనులు చేయగలరా అనేలా ఆయన చేసి చూపించారు. దశాబ్దాల పాటు సీఎం హోదాను అనుభవించిన ఆయనకు మిగిలిన ఆస్తి ఒక పెట్టె, నాలుగు డ్రెస్ లు, ఒక గ్లాస్, ప్లేటు . కనీసం సొంత ఇళ్లు, సెంటు భూమి లేకుండా అవినీతి మరక అంటకుండా పాలన చేసిన సంజీవయ్య పేరు కర్నూలుకు పెట్టాలని ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ని అడిగితే చెవికి కూడా ఎక్కించు కోలేదట. అంటే ఆనాటి నీలం సంజీవరెడ్డి నుంచి ప్రస్తుతం ఉన్న జగన్ వరకు నిజాయితితో కూడిన తెలివైన దళితుల పట్ల వివక్ష ఎలా ఉందో ఆ సామాజిక వర్గం గుర్తు చేస్తోంది.

సంజీవయ్య (Sanjeevayya) అప్పట్లో ముఖ్యమంత్రి అయితే అయ్యారు గానీ దిన దిన గండంగా సాగేది. తనకు మద్దతు ఇచ్చే సంఖ్యాబలం లేదు. కుల గొడవలు , ముఠా తగాదాలతో కంటికి కునుకు లేకుండా ఉండేది. ముఖ్యంగా బలమైన రెడ్డి సామాజిక వర్గం నుండి వ్యతిరేకత వచ్చేది. అప్పట్లో ఆ వర్గ నాయకత్వం బలంగా ఉండేది . 1962 లో ఎ.పి, తెలంగాణా కల్సి ఎన్నికలు జరిగాయి . అంతక ముందు వేరు వేరుగా జరిగేవి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో అన్నీ తానై సంజీవయ్య పార్టీని గెలిపించారు. ఎన్నికల్లో పోటీ చేయాలని సంజీవయ్య తలంచినా ఢిల్లీ నాయకత్వం అందుకు సమ్మతించ లేదు. కారణం మాల దాసరి కులానికి చెందిన సంజీవయ్య ను తక్కువ కులస్తుడని ఎవరూ లేచి నిలబడే వారు కాదు. కనీసం నమస్కారం చేసే వారు కాదు . సంజీవయ్య దాన్ని పట్టించుకునే వాడు కాదు. నీలం సంజీవ రెడ్డి వర్గానికి చెందిన నెల్లూర్ కు చెందిన ఒక నాయకుడు ముఠాకట్టి సంజీవయ్యని పార్టీ సమావేశాల్లో విమర్శించడమే కాక ఒకసారి ఏకంగా కేబినెట్ మీటింగ్ లో కులం పేరు పెట్టి ఎద్దేవా చేయడం చేసాడట. ఇది ఢిల్లీ అధిష్ఠానానికి తెలిసింది. ఇక 1962 లో కోడుమూరు నియోజక వర్గం నుండీ సంజీవయ్య గారు గెలవడమే కాక , కాంగ్రెస్ పార్టీ 175 సీట్లతో అధికారం లోకి వచ్చింది. అధికారం రాగానే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, సికింద్రాబాద్ లోని అజంతా టాకీస్ కు భార్యను తీసుకుని నడుచుకుంటూ సినిమాకు వెళ్ళారు. కానీ ఆతన్ను ముఖ్య మంత్రిగా చెయ్యకుండా , నీలం సంజీవ రెడ్డిని సి.ఎం ను చేసారు . కారణం ఢిల్లీ వెళ్ళి మేము , మా వర్గం కావాలో , సంజీవయ్య కావాలో తేల్చుకొండి అని నెహ్రూకు సంజీవ రెడ్డి డెడ్ లైన్ పెట్టే పాటికి ఆ వత్తిడికి తలొగ్గిన నెహ్రూ, నీలం సంజీవ రెడ్డిని సి.ఎం గా ప్రకటించాడు.

మొదట్లో సంజీవయ్య బల మైన ఆ వర్గంతో బాగానే మసలు కొనేవాడు. ఎప్పుడైతే సంజీవయ్య (Sanjeevayya) బలపడి ఎదుగుతున్నాడో ఆయన మీద శతృత్వం కూడా పెరుగుతూ వచ్చింది. అవినీతి నిర్మూలన కోసం ముఖ్యమంత్రిగా ఉండగా 2-6-1961 న ACB శాఖను ఏర్పాటు చేసారు సంజీవయ్య గారు. గవర్నమెంట్ ఉద్యోగుల తరహాలో ఉపాధ్యాయులకు పెన్షన్ సౌకర్యం కల్పించారు. అప్పటి వరకు వారికి పెన్షన్ సౌకర్యం లేదు. రాయలసీమ లోని బోయ కులాన్ని ST ల్లో చేర్చాడు. కోస్తా ప్రాంతకు కాపు ( తెలగ ) , రాయలసీమ బలిజ లను BC ల్లో చేర్చుతూ 14-10-1961 న జి. ఓ నెం: 3250 తీసుకు వచ్చాడు. మండల్ కమిషన్ కన్నా ముందే BC రిజర్వేషన్లను అమలు చేసారు. SC,ST లకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లతో పాటు ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు కల్పిస్తూ 4-5- 1961 న జి.ఓ నెం: 559 ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది . 6 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచాడు. పరిశ్రమలు , ఘనుల శాఖను ప్రత్యేకంగా ఏర్పరచాడు. గుంటూర్ లో పులిచింతల ప్రోజెక్ట్ , ఉత్తర కోస్తాకు వంశధార ప్రోజెక్ట్ లకు శంఖుస్థాపన చేసి , పనులకు అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. నాగార్జున సాగర్ నిర్మాణం సాగుతుండడంతో , త్వరిత గతిన పూర్తి అవడానికి స్పెషల్ డ్రైవ్ ను ఏర్పాటు చేసాడు. హంద్రీ నదిపై గాజుల దిన్నె ప్రోజెక్ట్ ( ఇప్పటి సంజీవయ్య సాగర్ ) , ఆత్మకూర్ అటవీ ప్రాంతంలో వరద రాజుల ప్రోజెక్ట్ ల నిర్మాణం చేపట్టారు. పారిశ్రామికీకరణ చేస్తేనే ఉద్యో గావకాశాలు ఉంటాయని , హైద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల స్థాపనకు కృషి చేసారు. 2 వేల ఎకరాల భూములు కొని హైద్రాబాద్ చుట్టూరా కొని పారిశ్రామిక పార్కులు ప్రారంభించారు.

రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ , చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ , మౌలిక సదుపాయాల సంస్థ , మైనింగ్ కార్పొరేషన్ అనే సంస్థలను ఏర్పాటు చేసాడు . బి.హెచ్.ఇ.ఎల్. కూడా అప్పుడే రూపుదిద్దు కుంది . కార్మికులు , ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్స్ ఏర్పాటు చేయడంతో యాజమాన్యానికి – ప్రభుత్వ సమస్యలు పరిష్కరించు కోవడం తేలిక అయ్యింది . ఇదే విధానాన్ని తరువాత కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేసింది . దేశంలో వృద్ధాప్య పించన్ మొదలు పెట్టింది ఆయనే. సి.ఎం హోదాలో ఒకసారి తల్లి వద్దకు వెళ్ళివచ్చే సమయంలో తల్లికి వంద రూ.లు ఇవ్వగా, ఇప్పుడు నువ్వు ఇచ్చావు , వచ్చే నెల ఎవరు ఇస్తారు , మన ఊళ్ళో ఇతర పేద తల్లులకు ఎవరు ఇస్తారని అన్నడట . ఆ ఆలోచనల నుండి పుట్టిందే 25 రూ.లతో మొదలు పెట్టిన వృద్ధప్య పెన్షన్ పధకం . గ్రేటర్ మున్సిపల్ ఆఫ్ హైద్రాబాద్ ను , దేశంలోనే మొదటగా ‘ లా ‘ కమిషన్ ను, మద్య నిషేధ విభాగం ను ఏర్పాటు చేసారు. నిర్భంధ ఉచిత ప్రాధమిక విద్య , మద్యాహ్న భోజన పధకం , ఉపకార వేతనాలు ప్రవేశ పెట్టారు సంజీవయ్య. సి.ఎం గా ఉన్నంత కాలం ఏ విధమైన భోగ భాగ్యాలు అనుభవించ లేదు. బేగంపేట లోని గ్రీన్ ల్యాండ్స్ అతిధి గృహమే తన అధికార నివాసం. ఎవరైనా ధరఖాస్తు వ్రాయలేని వారు వస్తే తన PA చేత ధరఖాస్తు పూర్తి చేయించి వెంఠనే అధికారులకు పంపించి ఆ పని పూర్తి చేయించే వాడు. SC ల రిజర్వేషన్ 14 % నుండి 17 % కు, BC లకు 24 నుండి 38% కు పెంచినది సంజీవయ్య (Sanjeevayya) గారే. కాళీగా ఉన్న సంజీవయ్య ను ప్రధాని నెహ్రూ ఢిల్లీకి పిలిపించి 1962 జూన్ లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవి అప్పగించాడు. తొలిసారి దళితుణ్ణి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం , భాద్యత తీసుకునే రోజు నెహ్రూ స్వయంగా కుర్చీ వద్దకు తోడ్కొని వచ్చి సర్ , మీ కుర్చీని అలంకరించండి అన్నాడట . దానితో సంజీవయ్యకు కళ్ళ వెంట నీళ్ళు తిరిగాయట. ఆ పదవిలో 1964 జూన్ 9 వరకు కొనసాగారు. 1964 జనవరిలో నెహ్రూ కాబినెట్ లో కేంద్ర కార్మిక , ఉపాది శాఖా మాత్యులుగా చేరడం జరిగింది .

మే 27 న నెహ్రూ మరణంతో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని అయ్యారు. ఆయన కాబినెట్ లో కూడా అవే మంత్రిత్వ శాఖలను నడిపారు . అదే సం.రం రాజ్యసభకు ఎన్నిక కాబడి నాడు సంజీవయ్య గారు. 1966 జనవరి 23 వరకు మంత్రిగా కొనసాగారు . జనవరి 11 న లాల్ బహదూర్ శాస్త్రి తాష్కండ్ లో మరణించడంతో తరువాత నాటకీయ పరిణామాల మద్య ఇందిర ప్రధాని అయ్యారు . జనవరి 24 న ఇందిర కాబినెట్ లో పరిశ్రమల శాఖా మంత్రి అయ్యారు . 1967 మార్చ్ 12 వరకు ఆ పదవిలో కొనసాగారు. యంత్ర సామాగ్రి అంతగా అవసరం లేని 29 పరిశ్రమలను గుర్తించి , వాటికి లైసెన్స్ అవసరం లేకుండా చేసాడు. డీ – లైసెన్సింగ్ విధానాన్ని , చిన్న పరిశ్రమల మనుగడకు సంజీవయ్య (Sanjeevayya) చేసిన అద్యయనాన్ని వాజ్ పాయ్ కూడా మెచ్చుకున్నారట. 1967 లో ఎ.పి ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయడంతో సి.ఎం పదవికి పోటీ వస్తాడని తలంచి అగ్ర కులాలకు చెందిన వారు పార్టీల కతీతంగా ఏకమై ఎన్నికల్లో సంజీవయ్యను ఓడించారు. అదే ఎన్నికల ప్రచారంలో విజయవాడ నుండి హైద్రాబాద్ వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురై చాలా కాలం కోలుకోలేక పోయారు. జనీవాలో ఐక్యరాజ్య సమితి కార్మిక సదస్సులో భారత ప్రతినిధి వర్గానికి నాయకత్వం వహించి , ఇ ఎస్ ఐ చట్టంలో ‘ కుటుంబం ‘ అనే పదాన్ని చేర్చి , మహిళా కార్మికుల తల్లిదంద్రులను కూడా ఆ పరిధిలోకి చేర్చిన మహానుభావుడు. కేంద్ర మంత్రి హోదాలో 1965 మే 29 న పార్లమెంట్ లో బోనస్ చట్టాన్ని ప్రవేశ పెట్టారు సంజీవయ్య గారు . కంపెనీలు తమ సిబ్బందికి తప్పని సరిగా ఒక నెల జీతం బోనస్ గా ఇవ్వాలనే రూల్ తీసుకు వచ్చింది సంజీయయ్య గారే . అందుకే ఆయన్ను ” బోనస్ సంజీవయ్య ” అనే పిల్చుకునే వారు . బోనస్ అమలవ్వ డంతో సంజీవయ్య పేరు దేశ మంతా మారుమోగింది. ఢిల్లీ కేంద్రంగా BC, SC , ST , మైనా రిటీలు కల్సి ఉండే రాజకీయ వేదిక ” సేవాస్థంబ్ ” ను స్థాపించాడు. తరువాతి కాలంలో కాన్షీరాం నాటి సంజీ వయ్య చూపిన మార్గమే నాకు ఆదర్శం , స్పూర్తి అని చెప్పాడు. 1970 లో కూడా రెండవసారి రాజ్యసభకు ఎన్నికైనారు.

1970 ఫిబ్రవరి 18 న ఇందిర కాబినెట్ లో కార్మిక , పునరావాస శాఖామాత్యులుగా పనిచేసారు. 1971 మార్చ్ 18 వరకు ఆ పదవిలో పనిచేసారు. మార్చ్ 18 నుండి మరలా అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడై 1972 మే 7 వరకు కొనసాగారు. సంజీవయ్య గారు వ్రాసిన లేబర్ ప్రోబ్లంస్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ పుస్తకాన్ని ఆక్స్ ఫర్డ్ వారు ప్రచురించారు. సాహిత్యం , సంగీతం , వచ్చిన సంజీవయ్య భీష్మ జననం అనే హరికథ వ్రాసారు . తన ప్రసంగాలతో ప్రజలను కట్టిపడేసే వారు. పద్యాలు , చలోక్తులు , పౌరాణిక , ఇతిహాస వృత్తాంతాలు చెబుతూ జనాన్ని ఆకట్టుకునే వారు. పిల్లలు లేని సంజీవయ్య (Sanjeevayya) దంపతులు ఒక ఆడ పిల్లను దత్తత తీసుకున్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు KSR మూర్తి సంజీవయ్యకు తోడల్లుడు . 1972 మే 7 న సంజీవయ్య గారు గుండెపోటుతో ఢిల్లీ లో రాత్రి 10.30 కు చనిపోయారు. మే 9 న అంత్యక్రియలు సికింద్రాబాద్ లో పాటిగడ్డలో అధికార లాంచనాలతో నిర్వ హించారు. పాటిగడ్డలో ఉన్న సంజీవయ్య పార్కుకు ఆయన పేరుతో పెట్టినదే. అదే పార్క్ లో ఆయన సమాధి కూడా ఉంది . 2008 లో విశాఖలో స్థాపింపబడిన ఎ.పి నేషనల్ లా యూనివర్శిటీని 2012 లో దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్శిటీ గా పేరు మార్చారు. సంజీవయ్య గారి పేరున 5 రూ.ల పోస్టల్ స్టాంప్ ను 14 ఫిబ్రవరి 2008 న విడుదల జేసారు. ఇన్ని పనులు చేసిన ఆ దళిత సీఎం ను చూసి కూడా కేసీఆర్, జగన్ పూర్తి విరుద్ధంగా దాచుకో, దోచుకో పద్ధతిని కొనసాగిస్తున్నారు. అంటే చిన్నా చితకా పదవులను ఎర వేసి కొందరికి దళితులను తొలి నుంచి రెడ్డి సామాజిక వర్గం తొక్కేస్తుందని ఆ వర్గం మేధావుల అభిప్రాయం.

Also Read:  LIC Jeevan Azad Policy: ఎల్‌ఐసీ జీవన్‌ ఆజాద్‌ పాలసీ పూర్తి వివరాలు