AP Poll -Betting : ఐపీఎల్ ను మించి బెట్టింగులు..వైసీపీ అంటే వామ్మో అంటున్న రాయుళ్లు

హాట్ ఫేవరెట్లుగా పవన్ కల్యాణ్‌, వైఎస్‌ జగన్, నారా లోకేశ్‌, బాలకృష్ణ, కొడాలి నాని పోటీ చేస్తున్న స్థానాలు ఉన్నట్లు చెపుతున్నారు

  • Written By:
  • Updated On - May 6, 2024 / 03:23 PM IST

మాములుగా బెట్టింగులు (Betting ) అంటే ఐపీఎల్ (IPL) ..లేదా సంక్రాంతి (Sankranthi) గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు ఏపీ (AP) లో ఈ రెండిటిని మించి బెట్టింగులు నడుస్తున్నాయి. దానికి కారణం ఎలక్షన్స్ (Ap Elections). వందలు , వేలు కాదు లక్షల నుండి కోట్ల వరకు బెట్టింగ్ రాయుళ్లు బెట్టింగ్ చేస్తున్నారట. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ వేదికలుగా బెట్టింగ్‌ ముఠాలు పెద్ద సంఖ్యలో ఫలితాలపై కోట్ల రూపాయలు బెట్టింగ్‌ వేస్తున్నట్లు తెలుస్తుంది. వైసీపీ విజయంపై ఎప్పుడూ ధీమాగా ఉండే కడప బెట్టింగ్‌ టీమ్స్‌ సైతం ఈసారి వైసీపీ ఫై వెనకడుగు వేయడం గమనార్హం. ఏపీలో మరో వారం రోజుల్లో ఎన్నికలు పూర్తి అవుతాయి. మే 13 న 175 అసెంబ్లీ , 25 పార్లమెంట్ కు సంబదించిన పోలింగ్ జరగనుంది. జూన్ 04 న ఈ ఫలితాలు రాబోతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు ఈసారి విజయం సాధిస్తారు..? ఎంత మెజార్టీ తో సాధిస్తారు..? ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుంది..? కూటమి పార్టీలు ఎన్ని సీట్లు సాధిస్తారు..? ఇలా అనేక విధాలుగా బెట్టింగులు కాస్తున్నారట.

We’re now on WhatsApp. Click to Join.

కడప, భీమవరం, సిద్ధిపేట, పొద్దటూరులు సత్తామార్కెట్‌కు ప్రధాన అడ్డాలు. నేషనల్‌ ఎక్సేంజ్‌, సెవన్‌హిల్స్‌, కవర్స్‌, పొలిటికల్ బెట్టింగ్‌. కామ్‌, బుకీష్‌.కామ్‌ వంటి వెబ్‌సైట్లలో ఫంటర్లు ఆప్షన్లు ఇస్తారు. భీమవరం ,కడప బెట్టింగ్ బ్యాచ్‌లు సొంతంగా సర్వేలు చేసుకుని వాటి ఆధారంగా సత్తా మార్కెట్‌లో ట్రెండ్స్ నడుపుతున్నాయి. బెట్టింగ్‌ యాప్స్‌ అన్నీ కూటమి మ్యాజిక్‌ మార్క్‌దాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న అంచనాకు వస్తున్నాయి. NDA కూటమి 95 -105 మధ్య సీట్లు సాధిస్తుందనే అంచనాతో బెట్టింగ్‌ చేస్తోంది. అందుకే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఆప్షన్‌లో బెట్టింగ్‌ చాలా తక్కువగా ఉంది. ఎక్కువగా సీట్ల సంఖ్యపైనే బెట్టింగ్‌ చేస్తున్నారట.

ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, విశాఖ, ఉభయగోదావరి జిల్లాలు కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని, ఉమ్మడి కడప, కర్నూలు జిల్లాలు, అరకు పార్లమెంట్‌ పరిధిలో వైసీపీ ఎక్కువ సీట్లు సాధిస్తుందని పందెంరాయుళ్ల బెట్టింగ్ కాస్తున్నారట. హాట్ ఫేవరెట్లుగా పవన్ కల్యాణ్‌, వైఎస్‌ జగన్, నారా లోకేశ్‌, బాలకృష్ణ, కొడాలి నాని పోటీ చేస్తున్న స్థానాలు ఉన్నట్లు చెపుతున్నారు. పవన్‌, జగన్‌, లోకేష్ లపై మెజార్టీలపై ఎక్కువగా బెట్టింగ్‌ జరుగుతుంటే గుడివాడ లో మాత్రం కొడాలి నాని గెలుపు అసాధ్యమన్న అంచనాతో ఎక్కవ మంది బెట్టింగ్‌ కాస్తున్నారట. ఓవరాల్ గా మాత్రం వైసీపీ ఫై పెద్దగా నమ్మకం వ్యక్తం చేయడం లేదట. చాలామంది కూటమి విజయం సాదిస్తుందని బెట్టింగ్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది.

Read Also : Viral : చిరంజీవికి సారీ చెప్పిన ఎన్టీఆర్..