Amaravati Report: అమరావతికి సమాధి ఇలా.?

అమరావతి ప్రాంతంలో ఉద్యమం చేసే వారిని మూడు క్యాటగిలలో విభజిస్తారు. ఆ తరువాత జగన్ గేమ్ ప్రారంభిస్తారు.

  • Written By:
  • Updated On - November 23, 2021 / 11:00 PM IST

అమరావతి ప్రాంతంలో ఉద్యమం చేసే వారిని మూడు క్యాటగిలలో విభజిస్తారు. ఆ తరువాత జగన్ గేమ్ ప్రారంభిస్తారు. అది లీగల్ గా ఎక్కడ చిక్కకుండా పక్కా టైమింగ్ తో మూడు రాజధానుల బిల్లు సిద్దం
అవుతుంది. ఎవరు వేలెత్తి చూపకుండా స్కెచ్ గీస్తున్నాడు జగన్. అది ఇలా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మూడు భాగాలుగా అమరావతి రైతులను డివైడ్ చేసి గేమ్ కు శ్రీకారం చూడతారని టాక్. అది ఇలా..
అమరావతి ప్రకటన రాక ముందు భూమి ఉన్న వారిని “మొదటి రైతు” క్యాటగిరీలో ఉంచుతారు.
పెట్టుబడీదారు”* అమరావతి ప్రకటన వచ్చిన పిదప భూమి కొన్న వారిని “పెట్టుబడీదారు” గా పరిగణించి రెండో కేటగిరీలో పెడతారు.
“మదాదతుదారు” పూర్వం కానీ నేడు కానీ అమరావతి 29 గ్రామాల పరిధిలో ఏమాత్రం భూమి లేని వారిని “మద్దతుదారుడు” గా విభజిస్తారు. వాళ్ళను మూడో కేటగిరిగా జాబితాను తయారు చేస్తారు.
ఈ మూడు కేటగిరీల వాళ్లకు వారికి రైతు, పెట్టుబడీదారు, మద్దతుదారు కేటగిరీల గుర్తింపు కార్డులు కూడా జారీ చేస్తారు.
“రైతు” లతో ప్రభుత్వం చర్చలు జరిపి వారి కష్టనష్టాలు తెలుసుకుంటుంది. వారికి ప్రత్యామ్నాయాలు & పరిష్కారాలు చూపుతుంది. వారి భూమి విలువ 2014 కంటే తగ్గలేదు కాకపోతే మూడు రాజధానుల వలన వారు ఆశించిన స్థాయిలో మాత్రం లాభాలు రావు. అనూహ్య లాభాల పొందటం కోసం ఇక్కడే రాజధాని వుండాలని ఏ కోర్టు సమర్పించదని జగన్ సర్కార్ భావిస్తుంది.

Also Read: రియాల్ట‌ర్ల ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన ఏపీ ప్ర‌భుత్వం…?

ఇక అమరావతి ప్రకటన పిదప భూములు కొన్న వారు అనగా పెట్టుబడీదారు లతో కూడా చర్చలు జరుపుతుంది. కానీ వ్యాపారంలో ప్రతీ పెట్టుబడి లాభనష్టాలు మార్కెట్ ఒడిదుడుకులకి అణుగుణంగా మారుతూ వుంటాయన్నది ప్రాధమిక సూత్రం. వారు లాభాపేక్షతో పెట్టుబడి పెట్టారు. వ్యాపారంలో లాభనష్టాలకి ప్రభుత్వం ఎటువంటి బాధ్యత తీసుకోదు. కావున వారి వాదన నిలబడదని జగన్ సర్కార్ ఊహ.

ఇక మిగిలినది “మద్దతుదారుడు” రాజధాని అమరావతిలో కడితే అతనికి వచ్చే లాభం ఏమిటని మూడు రాజధానులైతే వచ్చే నష్టం ఏమిటని అడుగుతారు.
ఈ విధంగా ఉద్యమం చేసే వారిని మూడు భాగాలుగా విభజించి రాజధాని విషయంలో వారివారి అభ్యంతరాలని తెలుసుకుని పరిష్కారాలు పరిహారాల విషయాలు చర్చించి లిఖితపూర్వక అంగీకారాం లేదా వ్యతిరేకత తీసుకుంటారు.
ఇక మూడు రాజధానులకి అనుకూలంగా రాష్ట్రవ్యాప్త ప్రజా మద్దతు కూడగట్టడం
రాబోయే మూడు రాజధానుల బిల్లుని అసెంబ్లీ, కౌన్సిల్లోనే కాకుండా దాని ముసాయిదాని ప్రతీ కార్పోరేషన్, మునిసిపాలిటీ, పంచాయితీ & జిల్లా పరిషత్ లకి పంపి ఆమోదముద్ర వేయించుకుంటారు. ఆమోదం పొందే సమయంలో ఆయా కార్పోరేషన్, మునిసిపాలిటీ & పంచాయితీలలో ప్రజల చేత పాదయాత్ర చేపట్టించి ప్రదర్శనలు చేపట్టించి మరీ ఆమోదింపచేస్తారు.

Also Read: జూనియ‌ర్ పై టీడీపీ క్యాడ‌ర్ గుస్సా

ఇప్పటికే నేడు (23-11-2021) విశాఖలో మూడు రాజధానులకి అనుకూలంగా పాదయాత్ర చేపడుతున్నారు.
అలా అన్ని పంచాయతీలు, మునిసిపాలిటీలు & కార్పోరేషన్లలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులచే మూడు రాజధానులకి ఆమోదం పొందినపుడు అపుడు యావత్ రాష్ట్రం మూడు రాజధానులు కోరినట్టు అవుతుంది.
రాష్ట్ర వ్యాప్త ప్రజా ప్రతినిధుల మద్దతు సమగ్ర నివేదిక కూడా కొత్త చట్టంలో అనుబంధ డాక్యుమెంట్ అవుతుంది.
ఇక బిల్లు ఉపసంహరణకి కారణాలు ఏమిటి ?*
హైకోర్టు బెంచ్ లో ఇద్దరు జడ్జీలపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పింది. వారికి రాజధాని పరిధిలో చెరి 600 గజాల స్థలం గత ప్రభుత్వం కేటాయించినది. ఆ విధంగా అమరావతిలో రాజధాని కొనసాగితే వారు లబ్ధిదారు అవుతారన్నది ప్రభుత్వ వాదన. కావున వారంతట వారం నాట్ బిఫోర్ మీ అంటూ బెంచ్ నుండి తప్పుకుంటారని ప్రభుత్వం ఆశించినది. కానీ అటువంటిది జరగలేదు. అపుడు ప్రభుత్వం లిఖితపూర్వక అభ్యంతరాలని తెలుపుతూ ఆ ఇద్దరు జడ్జీలని మార్చవలసినదిగా అభ్యర్ధించినది. ఆ అభ్యర్థనని సీజే తోసిపుచ్చారు. అంతే కాకుండా రోజూవారీ వాదనలు మొదలైన నేపథ్యంలో ఆ ఇద్దరు జడ్జీలతో కూడిన హైకోర్టు ధర్మాసనం చురకలు వేయటం మొదలుపెడుతుందనీ వాటిని తెలుగుదేశం అనుకూల మీడియా చిలువలు పలువలు చేసి పుంఖానుపుంఖాలుగా ప్రచారం చేస్తుఅందని ప్రభుత్వం గ్రహించినది. అంతే కాకుండా ప్రస్తుఐ సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ కాలం మరో తొమ్మిది నెలలు ఉన్నది. ఈ లోపు హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వష్తే ఎన్వీ రమణ సీజేఐ గా వుండగా మూడు రాజధానుల కేసు సుప్రీం కోర్టుకి వెళ్ళటం రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు. అంటే ప్రస్తుతం హైకోర్టు, సుప్రీం కోర్టు రెంటిలో వైకాపాకి అనుకూల తీర్పు రాదన్నది వారి అభిమతం. కావున ఈ లోపు గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలు, కార్పోరేషన్లు, జిల్లాపరిషత్ లకి ముసాయిదా బిల్లుని పంపి ఆమోదముద్ర వేయించుకుని ఆ తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందుతారు.

ప్రభుత్వాన్ని కలవరపెడుతున్న టెక్నికల్ ఇష్యూ ఏమిటి ?
గతంలో కౌన్సిల్లో తెలుగుదేశం మెజారిటీ వున్నందున వారు మూడు రాజధానుల బిల్లుని తీవ్ర గందరగోళం మధ్య తిరస్కరించి సెలెక్ట్ కమిటీకి పంపాలని కోరటం జరిగింది. ఐతే రెండు నెలల వ్యవధి పీదప కౌన్సిల్లో తిరస్కరించబడిన బిల్లుని గవర్నర్ కి పంపి ఆమోద ముద్ర వేయించుకున్నది.

కౌన్సిల్ మొదటి సారి తిరస్కరించినా మరోసారి పంపి రిజెక్ట్ ఐనా అది నామమాత్రమే. కావున తమది సరైన చర్యగా ప్రభుత్వం అభివర్ణించుకోగా సెలెక్ట్ కమిటీకి పంపాలని కౌన్సిల్ తీర్మానం చేస్తే దానిని ఎలా కాలరాస్తారు అనేది విపక్షాల వాదన.

ఇదే కోర్టులో ప్రభుత్వానికి అడ్డంకిగా మారనున్న టెక్నికల్ ఇష్యూ. ఐతే ఇపుడు కౌన్సిల్లో పరిస్థితులు మారాయి. వైకాపాకి తిరుగులేని మెజారిటీ వున్నందున మరోసారె బిల్లు పెడితే తిరుగులేని ఆధిక్యంతో ఆమోదం పొందుతుంది. ఆ ఏకైక అడ్డంకి కూడా తొలగి పోతుంది.

సవరించిన బిల్లు ఎపుడు పెడతారు ?
బడ్జెట్ సమావేశాల పిదప కొత్త ముసాయిదా బిల్లుని రూపొందించి అసెంబ్లీలో ప్రవేశపెడతారు. అసెంబ్లీ ఆమోదం కంటే ముందు ప్రజాభిప్రాయం కోసం స్థానిక సంస్థలకి పంపుతాము అని మరో రెండు నెలలు కాలయాపన చేస్తారు. వర్షాకాల సమావేశాలలోపు అన్ని స్థానిక సంస్థల చేత ఆమోదింప చేసుకుని జూలై ఆగస్టు నెలలలో అసెంబ్లీ ఆమోదం తీసుకుని కోన్సిల్ కి పంపి పూర్తి మెజారిటీతో ఆమోదిస్తారు.

మూడు రాజధానుల బిల్లు ఆమోదంలో మళ్ళీ కీలకం కానున్న 23 సంఖ్య
23 సంఖ్య వైకాపాకి బాగా కలసి వచ్చిన అంశం గా తెలుగుదేశంకి కలసి రాని అంశంగా ప్రచారం పొందినది. 26 ఆగస్టు 2022 తేదీన సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ రిటైర్ కానున్నారు. కావున 23 ఆగస్టున అసెంబ్లీ, కౌన్సిల్లలో ఆమోదం పొందితే గవర్నర్ ఆమోదం పొందే నాటికి ఎన్వీ రమణ పదవీ కాలం ముగిసిపోతుంది కావున ప్రభుత్వం ఆ తేదీలని ఎంచుకునే అవకాశం వున్నది.
ఏదేమైనా జగన్మోహన రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులకి పక్కా చట్టబధ్ధతతో ఆమోదముద్ర వేయించి అమలు దిశగా అడుగులు వేస్తుంది. సో..జగన్ మాస్టర్ ప్లాన్ అమరావతి విషయంలో ఎలా ఉందో ఊహించిన తర్వాత ఇంకా ఒకే రాజధాని అనే నినాదం బలపడుతుందా అనేది ప్రశ్నర్ధకమే.