Ukraine : రష్యా దాడులతో ఉక్రెయిన్ లో ఇంధన సంక్షోభం.. కరెంట్ లేక చలిలోనే పాట్లు

రష్యాతో (Russia) యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ ఇంకా సంక్షోభం నీడలోనే రోజులు వెల్లదీస్తోంది.

రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ (Ukraine) ఇంకా సంక్షోభం నీడలోనే రోజులు వెల్లదీస్తోంది. ఆ దేశ రాజధాని నగరం కీవ్ కొత్త సంవత్సరం మొదటి రోజున చీకట్లో మగ్గాల్సి వచ్చింది. ఒకవైపు భయంకరమైన చలి.. మరోవైపు విద్యుత్ కొరత నడుమ ఉక్రెయిన్ ప్రజలు నలిగిపోతున్నారు. కరెంటు లేకపోవడంతో ఇళ్లలో ఎయిర్ కండీషనర్లు నడిచే పరిస్థితి లేదు.

ఉక్రెయిన్‌లోని (Ukraine) కొన్ని ప్రాంతాలలో సగటు శీతాకాలపు ఉష్ణోగ్రత -2 డిగ్రీల సెల్సీయస్ ఉంటుంది. ఇవి ఒక్కోసారి -20 డిగ్రీల సెల్సీయస్ వరకు తగ్గిపోతుంటాయి. ఉక్రెయిన్ పౌర ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్న రష్యా దాదాపు  20 క్షిపణులతో దాడి చేసింది. దాని పర్యవసానంగానే కీవ్ లో విద్యుత్ సరఫరా వ్యవస్థ స్తంభించింది.పౌర ఇంధన మౌలిక సదుపాయాలపై రష్యా క్షిపణి దాడులు చేయడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు. ఈ దాడులను రష్యా “ఇంధన ఉగ్రవాదం” గా ఆయన అభివర్ణించారు.

ఇంధన సంక్షోభం మానవతా సంక్షోభంగా ఎలా మారింది?

యూరోపియన్ యూనియన్ (EU) రష్యా ఇంధన వనరులపై ఎక్కువగా ఆధారపడి ఉంది.  EU వెబ్‌సైట్‌లోని డేటా ప్రకారం.. 2020 నాటికి EU యొక్క బొగ్గు దిగుమతుల్లో 49.1 శాతం రష్యా నుంచి వస్తున్నాయి. ఈయూ ముడి చమురు దిగుమతుల్లో 25.7 శాతం మరియు గ్యాస్ దిగుమతుల్లో 38 శాతం రష్యా నుంచి వస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఈయూ తన రూటు మార్చుకుంది. రష్యా నుంచి ఇంధన కొనుగోళ్ళను EU ఆపేసింది. “ఉక్రెయిన్ యుద్ధం వల్ల పుట్టుకొచ్చిన ఇంధన సంక్షోభం ఇప్పుడు యావత్ యూరప్‌కు మానవతా సంక్షోభంగా మారింది.

ఉక్రెయిన్ మరియు రష్యా ప్రధాన ఆహార ఉత్పత్తిదారులు. వాటి నుంచి ఆహార ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోవడంతో యూరప్ కూడా ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది . మునుపెన్నడూ లేని స్థాయిలో ఉక్రెయిన్ నుంచి ఎంతోమంది సరిహద్దు దేశాలకు వెళ్లి అక్కడ శరణార్ధులుగా ఉంటున్నారు. వీరి వల్ల ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలపై కొంత భారం పెరిగింది. తమ దేశం ఉక్రెయిన్ లో పరిస్థితి మెరుగుపడిన తర్వాత తాము ఆశ్రయం పొందిన దేశాల నుంచి ఉక్రేనియన్లు తిరిగి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది. ఇంకొన్ని దేశాలు నిర్వహణ భారాన్ని చూపించి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఆ టైంలో భారత్:

ఉదాహరణకు, భారతదేశం అనేక దేశాల శరణార్థులకు నిలయంగా ఉంది. కానీ వారు భిన్నంగా వ్యవహరించారు. టిబెటన్లు బాగా చూసుకున్నారు. ఆ తర్వాత శ్రీలంక తమిళులకు కూడా సహాయక శిబిరాలు నిర్వహించారు. అయితే ఆఫ్ఘన్లు , రోహింగ్యాల విషయంలో భారత్ అలా వ్యవరించలేదు.

Also Read:  Jasprit Bumrah : లంకతో వన్డేల నుంచి బూమ్రా ఔట్