Birth Certificate Become Powerful : బర్త్ సర్టిఫికెట్ ఇక పవర్ ఫుల్.. కేంద్రం కొత్త బిల్లుతో విప్లవాత్మక మార్పు

Birth Certificate Become Powerful : బర్త్ సర్టిఫికెట్ .. ఇప్పటివరకు ఈ డాక్యుమెంట్ నామమాత్రం. కానీ ఇకపై దీని రికగ్నిషన్ పెరగనుంది.

  • Written By:
  • Updated On - August 2, 2023 / 03:38 PM IST

Birth Certificate Become Powerful : బర్త్ సర్టిఫికెట్ .. ఇప్పటివరకు ఈ డాక్యుమెంట్ నామమాత్రం. కానీ ఇకపై దీని రికగ్నిషన్ పెరగనుంది. ఎందుకంటే.. తాజాగా ఆగస్టు 1న లోక్ సభ ఆమోదం పొందిన జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లులో బర్త్ సర్టిఫికెట్ ప్రాధాన్యతను పెంచే కీలక అంశాలను చేర్చారు. అదేమిటంటే.. పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశాన్ని నిరూపించడానికి ఇక అనేక సర్టిఫికెట్ల అవసరం లేదు. కేవలం డిజిటల్  బర్త్ సర్టిఫికెట్ సరిపోతుంది.  ఫ్యూచర్ లో విద్యా సంస్థల అడ్మిషన్లు, డ్రైవింగ్ లైసెన్స్ జారీ, పాస్ పోర్ట్ జారీ, ఓటరు కార్డు జారీ, ఆధార్ కార్డు జారీ, వివాహ నమోదు, ప్రభుత్వ ఉద్యోగంలో నియామకం వంటి వాటిలో వెరిఫికేషన్ కోసం డిజిటల్  బర్త్ సర్టిఫికెట్ ను(Birth Certificate Become Powerful) సబ్మిట్ చేయొచ్చు. ఈమేరకు వెసులుబాటును కల్పించేలా జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లు-2023లో నిబంధనలను చేర్చారు. ఈమేరకు జనన, మరణాల నమోదు చట్టం (ఆర్బీడీ)-1969లో దాదాపు 54 ఏళ్ల తర్వాత విప్లవాత్మక సవరణలను కేంద్ర ప్రభుత్వం చేసింది. వీటిలో ముఖ్యమైనది ఏమిటంటే.. జనన మరణాల నమోదుకు కూడా పేరెంట్స్ తో పాటు ఆస్పత్రికి వచ్చిన కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆధార్ నంబర్ లను తప్పనిసరిగా సమర్పించాలనే నిబంధన. దీనివల్ల పేరెంట్స్ లో ఎవరైనా ఒకరి ఆధార్ నంబర్ కు బర్త్ సర్టిఫికెట్ అటాచ్ అవుతుంది. ఫలితంగా ఆధార్ ధ్రువీకరణ ప్రాధాన్యత కూడా పెరిగింది. ఆధార్ తో అటాచ్ అయి ఉండటం వల్ల బర్త్ సర్టిఫికెట్ గుర్తింపు అనేది మరింత పెరుగనుంది.   

Also read : Beer From Shower Water : షవర్, సింక్, వాషింగ్ మెషీన్ నీళ్లతో ఆ బీర్ రెడీ

రాష్ట్రాలు.. కేంద్రం.. డేటాబేస్‌ లు 

రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నియంత్రణలో ఉండే సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) పోర్టల్ వేదికగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వేటికవి విడివిడిగా జనన మరణాల డేటాబేస్‌లను నిర్వహించాలని కూడా ఈ సవరణ బిల్లులో ప్రతిపాదించారు. ఇక ఇవన్నీ కలిసికట్టుగా దేశంలోని మొత్తం జనన, మరణాలను నిక్షిప్తం చేసేందుకు ఏకీకృత డేటాబేస్‌ను రూపొందించాలని జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లులో పేర్కొన్నారు.  జనన, మరణాల జాతీయ డేటాబేస్‌ను రిజిస్ట్రార్ జనరల్ నిర్వహిస్తారు.  రాష్ట్రాల్లో నమోదయ్యే జనన, మరణాలకు సంబంధించిన డేటాను జాతీయ డేటాబేస్‌ తో పంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో చీఫ్ రిజిస్ట్రార్లు, స్థానిక సంస్థల స్థాయిలో రిజిస్ట్రార్లు బాధ్యత వహించాలని కొత్త బిల్లు తెలిపింది.

Also read : Warning Labels On Each Cigarette : ఇక ప్రతి సిగరెట్ పై వార్నింగ్ లేబుల్

జాతీయ డేటాబేస్‌ నుంచి రేషన్ కార్డుల వ్యవస్థలకు సమాచారం  

రాష్ట్రాల నుంచి జాతీయ డేటాబేస్‌ కు అందే జనన, మరణాల సమాచారాన్ని జాతీయ జనాభా రిజిస్టర్, రాష్ట్రాల రేషన్ కార్డుల వ్యవస్థలు,  ఆస్తి రిజిస్ట్రేషన్‌ వ్యవస్థలకు పంపిస్తారు. దీని ఆధారంగా అక్కడ ఉన్న సమాచారం కూడా అప్ డేట్ అవుతుంది. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) కోసం మొదటిసారిగా 2010 సంవత్సరంలో డేటాను సేకరించారు. 2015లో ఇంటింటికీ జనాభా  గణన చేసి ఈ సమాచారాన్ని అప్ డేట్ చేశారు. NPRలో ఇప్పటికే 119 కోట్ల మంది దేశ ప్రజల సమాచారం ఉంది. దీన్ని జాతీయ డేటాబేస్‌  కోసం వాడుకోనున్నట్టు తెలుస్తోంది.

Also read : Anaemia: పురుషులతో పోలిస్తే స్త్రీలలోనే రక్తహీనత ఎక్కువ.. కారణమిదే..?

ఆ పిల్లలు  పుట్టిన వివరాల నమోదు ఈజీ 

దత్తత తీసుకున్న పిల్లలు, అనాథలైన పిల్లలు, అవివాహిత తల్లికి పుట్టే పిల్లల పుట్టిన వివరాల నమోదు ప్రక్రియను కూడా ఈ బిల్లు సులభతరం చేస్తుంది. ఒకవేళ జైలులో లేదా హోటల్‌లో పిల్లలు పుడితే.. తప్పనిసరిగా జైలర్ లేదా హోటల్ మేనేజర్ ఆధార్ నంబర్‌ను కూడా బర్త్ సర్టిఫికెట్ అప్లికేషన్ లో ఇకపై జోడించాల్సి ఉంటుంది.

Also read : Emoji : ఆ ఎమోజీ(emoji)వాడితే జైలుకే, భారీ జరిమానా కూడా… ఎక్కడో తెలుసా?

డెత్ సర్టిఫికెట్స్ జారీ ఇక ఈజీ..  

మరణాల నమోదు అనేది మన దేశంలో చాలా తక్కువగా జరుగుతోంది. ఇకపై  మరణాల నమోదును పెంచేందుకు ఒక మంచి నిబంధనను ఈ బిల్లులో పొందుపరిచారు. అదేమిటంటే..  అన్ని వైద్య సంస్థలు తమ ఆస్పత్రిలో ఎవరైనా మరణిస్తే తప్పకుండా ఆ వివరాలను  రిజిస్ట్రార్‌కు ఆన్ లైన్ లో సమర్పించాలి. అలా సమర్పించిన వివరాల కాపీని ప్రింట్ తీసి డెత్ సర్టిఫికెట్ గా చనిపోయిన వ్యక్తి కుటుంబీకులకు అందించాలి.  మరణానికి కారణం ఏమిటనేది కూడా డెత్ సర్టిఫికెట్ లో తప్పకుండా ప్రస్తావించాలి.  ఫలితంగా ఆస్పత్రుల్లో జరిగే మరణాలకు మళ్ళీ ప్రత్యేకంగా డెత్ సర్టిఫికెట్ కోసం అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. ఇంటర్నెట్ లభ్యత పెద్దగా లేకపోవడం, ఎలా అప్లై చేయాలో తెలియకపోవడంతో దేశంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు డెత్ సర్టిఫికెట్స్ కు చాలా తక్కువగా అప్లై చేస్తుంటారు. వారి సౌకర్యార్ధమే ఈమేరకు సవరణను జనన, మరణాల నమోదు (సవరణ) బిల్లులో చేశారు. 

ఆస్తి రికార్డుల విభాగానికి జనన, మరణాల సమాచారం బదిలీ.. అందుకేనా ?

జనన, మరణ ధృవీకరణ పత్రాల కోసం నమోదయ్యే సమాచారాన్ని జాతీయ డేటా బేస్ నుంచి ఆస్తి రికార్డుల డిజిటలైజేషన్ విభాగానికి బదిలీ చేస్తామని తాజాగా బిల్లులో ప్రతిపాదించారు. పన్నులు, వారసత్వ దావాలతో ముడిపడిన వ్యవహారాలు తలెత్తినపుడు సరైన ఆధారాలు, రికార్డులు లభించేలా చేయాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని కొందరు నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ పరిధిలోని స్వామిత్వ (SVAMITVA) పథకం కింద డ్రోన్‌లను ఉపయోగించి దేశంలోని భూమి రికార్డుల సమాచారాన్ని డిజిటలైజ్ చేస్తున్నారు. దీని ఆధారంగా ప్రాపర్టీ కార్డ్‌లు, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (GIS) మ్యాప్‌లను రూపొందిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు పొందేందుకు మాత్రమే ఆస్తి పత్రాలకు ఆధార్‌ను అనుసంధానించాలని గతంలో సుప్రీం కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ఇప్పుడు జనన, మరణ ధృవీకరణ పత్రాల సమాచారాన్ని ఆస్తి రికార్డుల డిజిటలైజేషన్ విభాగాలకు ఇవ్వడం అనేది .. బ్యాక్ డోర్ నుంచి ఆస్తి రికార్డులపై “ఆధార్‌ కార్డు”  వినియోగాన్ని పరోక్షంగా రుద్దడమే అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇకపై నమోదయ్యే బర్త్ సర్టిఫికెట్లు అన్నింటిలో పేరెంట్స్ ఆధార్ డిటైల్స్ కూడా ఉంటాయనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలని నిపుణులు అంటున్నారు.