Site icon HashtagU Telugu

100 Phones Lost Per Day : 100 రోజుల్లో 10వేల ఫోన్లు పోగొట్టుకున్నారు..వాటిలో 4వేల ఫోన్లే దొరికాయ్

100 Phones Lost Per Day

100 Phones Lost Per Day

100 Phones Lost Per Day : తెలంగాణలో 100 రోజుల వ్యవధిలో ఎంతమంది ఫోన్లు పోగొట్టుకున్నారో తెలుసా ?

9, 720 మంది తమ మొబైల్ ఫోన్లను 100 రోజుల టైమ్ లో పోగుట్టుకున్నారు..  

వీటిలో కొన్ని ఫోన్లు చోరీకి గురికాగా.. ఇంకొన్ని ఫోన్లను మరిచిపోయి వదిలేశారని పోలీసుల ఎంక్వైరీలో తేలింది.

ఈ దర్యాప్తులతో ముడిపడిన మరిన్ని ఆసక్తికర వివరాలివీ..   

ఫోన్లను పోగొట్టుకున్నామని.. అవి చోరీకి గురయ్యాయని పోలీసులకు జనం కంప్లైంట్స్ ఇస్తుంటారు. అలా పోయిన ఫోన్లను ట్రాక్ చేయడానికి  తెలంగాణ పోలీసులు  సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) వెబ్ సైట్‌ను ఉపయోగిస్తారు. CEIR అనేది కేంద్ర  టెలి కమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ కు చెందిన వెబ్ సైట్‌. పోయిన ఫోన్లను ట్రాక్ చేయడానికి CEIR వెబ్ సైట్ లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇందుకోసం రాష్ట్రంలోని మొత్తం 780 పోలీస్ స్టేషన్‌లకు లాగిన్ ఐడీలు ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 100 రోజుల వ్యవధిలో పోయిన 9,720 ఫోన్లను తెలంగాణ పోలీసులు CEIR వెబ్ సైట్ ద్వారా ట్రాక్ చేయగా 4,083  ఫోన్లు(100 Phones Lost Per Day) దొరికాయి. పోలీసులు వాటిని ఆ ఫోన్ల అసలు యజమానులకు అప్పగించారు. ఈవిధంగా సైబరాబాద్‌ కమిషనరేట్  పరిధిలో 554 ఫోన్లను, రాచకొండ కమిషనరేట్  పరిధిలో  321 ఫోన్లను, వరంగల్‌ కమిషనరేట్  పరిధిలో 300 ఫోన్లను, హైదరాబాద్‌ కమిషనరేట్  పరిధిలో 265 ఫోన్లను పోలీసులు తిరిగి దొరకబట్టి వాటిని ఓనర్స్ కు హ్యాండోవర్ చేశారు.

ఫోన్ పోగొట్టుకోగానే ఇలా చేయండి .. 

ఫోన్ ఆచూకీ  దొరకగానే ఇలా చేయాలి ..