Work From Home: వర్క్ ఫ్రం హోం విధానంపై స్పందించిన ఎలాన్ మస్క్.. అనైతికం అంటూ?

కరోనా మహమ్మారి పుణ్యమా అని లాక్ డౌన్ లో చాలా వరకు సాఫ్ట్ వేర్ వాళ్లకు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. అప్పటినుంచి దాదాపు

  • Written By:
  • Updated On - May 17, 2023 / 11:36 PM IST

కరోనా మహమ్మారి పుణ్యమా అని లాక్ డౌన్ లో చాలా వరకు సాఫ్ట్ వేర్ వాళ్లకు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. అప్పటినుంచి దాదాపు రెండేళ్లపాటు వర్క్ ఫ్రం హోం విధానాన్ని నిర్వహించారు. ఇప్పటికీ చాలా వరకు కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానాన్ని పాటిస్తున్నాయి. అయితే చాలామంది ఈ తరహా పనికి అలవాటు పడిపోయిన ఉద్యోగులు ఆఫీసులకు రమ్మని కంపెనీలు కబురు పెడుతున్నా కూడా ఏకంగా కంపెనీలను బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి ఎదిగిపోయారు.

దీంతో అయ్యే కంపెనీలో హైబ్రిడ్ మోడ్ లో ఉద్యోగులతో పని చేయించుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే వర్క్ ఫ్రం హోం విధానం పై పలువురు కంపెనీ యజమానులు పెదవి విరుస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే ప్రపంచ కుబేరుడు టెస్లా ట్విట్టర్ సీఈవో వర్క్ ఫ్రం హోం విధానం పై మరోసారి స్పందించారు. ఈ సందర్భంగా స్పందిస్తూ వర్క్ ఫ్రం హోం విధానం ప్రోడక్టివిటీకి సంబంధించిందే కాకుండా నైతికంగా సరైంది కాదని అన్నారు. ఇంటి నుంచి లాప్టాప్ తో పని సాగించడంతో పని సామర్థ్యం పై ప్రభావం చూపడమే కాకుండా వర్క్ ఫ్రం హోంకు పనిచేసే అవకాశం లేని ఫ్యాక్టరీ కార్మికులు ఇతర ఉద్యోగులకు తప్పుడు సంకేతాలు పంపుతుంది అని ఎలాన్ మస్క్ తెలిపారు.

భవన నిర్మాణ కార్మికులు ఆహార తయారీదారులు కార్లు తయారు చేసేవారు మరమ్మత్తులు చేసేవారు వస్తువులను తయారు చేసే వారందరూ కూడా తప్పకుండా పని ప్రదేశాలకు వెళ్తారని. కానీ టెక్ కంపెనీలకు సంబంధించిన ఉద్యోగులు మాత్రం ఇంకా ఇంటి నుంచే పని చేస్తున్నారు అని సీఎన్బికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్ తెలిపారు. టెస్లా ఉద్యోగులు ఆఫీసుల నుంచే పని చేయాలని ఆయన తెలిపారు. ఉద్యోగులు వారానికి కనీసం 40 గంటలు తప్పకుండా ఆఫీసులో గడపాలని ఆయన తెలిపారు. కోవిడ్ 19 విపత్కర పరిస్థితిలో వర్క్ ఫ్రం హోం పనిచేశారు అంటే అర్థం ఉంది కానీ కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా ఇలా వర్క్ ఫ్రం హోం చేయించడం సరైనది కాదు అని ఆయన తెలిపారు. కొందరు వర్క్ ఫ్రం హోం చేయడం వల్ల ఆ ప్రోడక్టివిటీకి ఏమీ తగ్గదు కాబట్టి దీనిని కొనసాగించిన తప్పు ఏమీ కాదు అంటున్నారు ఎలాన్ మస్క్.