Kedarnath : కేదార్‌నాథ్ సమీపంలో భారీ హిమపాతం.. ఆలయానికి ముప్పు లేదని వెల్లడి

ఉత్తరాఖండ్ లోని కేదార్‌నాథ్ ఆలయ సమీపంలో భారీ హిమపాతం సంభవించింది. అకస్మాత్తుగా మంచు పెళ్లలు వేగంగా కొండల మీద నుంచి జారి పడ్డాయి.

  • Written By:
  • Updated On - October 1, 2022 / 12:21 PM IST

ఉత్తరాఖండ్ లోని కేదార్‌నాథ్ ఆలయ సమీపంలో భారీ హిమపాతం సంభవించింది. అకస్మాత్తుగా మంచు పెళ్లలు వేగంగా కొండల మీద నుంచి జారి పడ్డాయి. ఈ ఘటన ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉ‍న్న చోరాబరి గ్లేసియర్‌ పరిసర ప్రాంతంలో జరిగింది. దీనివల్ల కేదార్‌నాథ్ ఆలయానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని బద్రీనాథ్- కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ తెలిపారు. పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. హిమపాతం సంభవించిన ప్రాంతం కేదార్‌నాథ్ కు 5 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు.ఇక రుద్ర ప్రయాగ్‌లోనూ ఎలాంటి ఆస్తి నష్టం గాని, ప్రాణ నష్టం గానీ జరగలేదన్నారు.రుద్ర ప్రయాగ్‌లోని జాతీయ రహదారిని బ్లాక్‌ చేయడానికి కొద్ది క్షణాల ముందే ఈ హిమపాతం సంభవించడం గమనార్హం. వాస్తవానికి ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే వాతావరణ శాఖ రానున్న రెండు రోజుల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్‌ అలర్ట్‌ కూడా జారీ చేసింది.