Shahrukh Khan: రూ. 4.98 కోట్ల విలువైన వాచీ ధరించిన షారుఖ్ ఖాన్

పఠాన్ (Pathan) సినిమా అందించిన అపురూప విజయంతో మాంచి ఊపుమీదున్న

పఠాన్ సినిమా అందించిన అపురూప విజయంతో మాంచి ఊపుమీదున్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌ (Shahrukh Khan) తాజాగా ఓ ఈవెంట్‌లో కనిపించి చర్చనీయాంశంగా మారాడు. అందుకు కారణం అతడు ధరించిన వాచీనే. బ్లాక్ సూట్‌లో దర్శనమిచ్చిన షారుఖ్.. చేతికి బ్లూ కలర్ రిస్ట్ వాచ్ ధరించాడు. ఆ వాచీ ఖరీదు ఎంతో తెలిస్తే ముక్కున వేలేసుకోవడం ఖాయం. చాలామంది తమ జీవితకాలంలో సంపాదించిన దానికంటే ఆ వాచీ విలువే ఎక్కువ. ఒక్క ముక్కలో చెప్పాలంటే దాని ఖరీదు రూ. 4.98 కోట్లు.

‘పఠాన్’ జోడీ దీపికా పదుకొణే ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో షారుఖ్ (Shahrukh Khan) ఈ వాచీతో కనిపించాడు. ఇద్దరూ ముస్తాబవుతున్నట్టు ఉన్న ఆ వీడియో ‘పఠాన్’ ఈవెంట్ కు ముందు తీసినది. షారుఖ్ ధరించిన ఆ వాచీపై అభిమానుల దృష్టి పడింది. దీంతో ఫ్యాషన్ బ్లాగింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ‘డైట్ సబ్యా’లో ఆరా తీశారు. ఆ వాచీ ‘అడెమర్స్ పిగెట్‌’ అనే స్విట్జర్లాండ్‌కు చెందిన లగ్జరీ వాచ్ తయారీ కంపెనీకి చెందినదని సమాధానం వచ్చింది. ఇది ఆ కంపెనీ రాయల్ ఓక్ పెర్‌పెచ్యుయల్ క్యాలెండర్ వాచీ అని, దాని విలువ రూ. 4.98 కోట్లని డైట్ సబ్యా నుంచి రిప్లై వచ్చింది.

Also Read:  Baby Born under Earthquake: భూకంప శిథిలాల కిందే ఆ పాప జననం..