Shocking Comments of Actor Rajasekhar: నెల రోజుల తర్వాత హీరో రాజశేఖర్ నన్ను డైరెక్ట్ చెయ్యద్దన్నారు.. ముత్యాల సుబ్బయ్య!

సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో ఎన్నో సినిమాలకు ఆయన

  • Written By:
  • Updated On - September 13, 2022 / 05:48 PM IST

సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో ఎన్నో సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ముత్యాల సుబ్బయ్య ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆనాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. మొదట తాను మూడుముళ్ల బంధం సినిమాతో దర్శకుడుగా మారాను అని తెలిపారు ముత్యాల సుబ్బయ్య. అయితే అప్పటికే తనకు పెళ్లి అయింది అని నవ్వుతూ తెలిపారు ముత్యాల సుబ్బయ్య.

ఇక అప్పుడు ఆలీ ఏదో సినిమా విషయంలో మీరు ఇండస్ట్రీని వదిలే పోదామని అనుకున్నారట అది నిజమేనా అని ప్రశ్నించగా? ఆ విషయం పై స్పందించిన ముత్యాల సుబ్బయ్య.. జగపతిబాబు హీరో, ఇంద్రజ హీరోయిన్. నేను మాత్రం సౌందర్య కరెక్ట్ అనుకున్నాను. కానీ ఆయన మాత్రం ఇంద్రజను తీసుకున్నారు. నాకు ఆ విషయంలో చాలా బాధ కలిగింది అని చెప్పుకొచ్చారు ముత్యాల సుబ్బయ్య. ఆ సమయంలోనే తాను సినీ ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోదామని అనుకున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.

ఇక సీనియర్ హీరో రాజశేఖర్ కథానాయకుడిగా తెరకెక్కిన మా అన్నయ్య సినిమాకు ముత్యాల సుబ్బయ్య నెల రోజులపాటు దర్శకుడిగా వ్యవహరించారట. కానీ నెల రోజుల తర్వాత సుబ్బయ్య గారు ఈ సినిమా మానేయండి అని అన్నారు అంటూ అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే పలు విషయాలను తలుచుకొని ఎమోషనల్ కూడా అయ్యారు ముత్యాల సుబ్బయ్య. అలాగే ఆలీతో మాట్లాడుతూ సరదా సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.