Medico Preethi : ముగిసిన వైద్య విద్యార్థిని ప్రీతి అంత్య‌క్రియ‌లు.. క‌న్నీటీ విడ్కోలు ప‌లికిన బంధువులు

వ‌రంగ‌ల్ వైద్య విద్యార్థిని ప్రీతి అంత్య‌క్రియ‌లు ముగిశాయి. బంధువులు, గ్రామ ప్ర‌జ‌ల అశ్రున‌య‌నాల మ‌ధ్య ఆమె

  • Written By:
  • Updated On - February 27, 2023 / 01:44 PM IST

వ‌రంగ‌ల్ వైద్య విద్యార్థిని ప్రీతి అంత్య‌క్రియ‌లు ముగిశాయి. బంధువులు, గ్రామ ప్ర‌జ‌ల అశ్రున‌య‌నాల మ‌ధ్య ఆమె అంతిమ‌యాత్ర సాగింది. ఆమె స్వ‌గ్రామంలోని గిర్ని తండాలో త‌ల్లిదండ్రులు అంతిమ సంస్కారాలు నిర్వ‌హించారు. ప్రీతి ఇంటి వ‌ద్ద నుంచి ట్రాక్ట‌ర్‌పై ఆమె పార్థీవ‌దేహాన్ని స్మ‌శాన‌వాటిక‌కు తీసుకెళ్లారు. దారి పోడవునా ప్రీతికి గ్రామ‌స్తులు క‌న్నీటి వీడ్కోలు ప‌లికాలు. గిర్ని తండాలో డాక్ట‌ర్ చ‌దివిన మొద‌టి మ‌హిళ‌గా ప్రీతి ఉంది. ఉన్న‌త స్థాయిలో ఉండాల్సిన ప్రీతి ఇలా తిరిగివ‌స్తుంద‌నుకోలేద‌ని గ్రామ‌స్తులు రోదిస్తున్నారు. గిరిజ‌న సంప్ర‌దాయం ప్ర‌కారం ఆమె అంతిమ సంస్కారాల‌ను కుటుంబ‌స‌భ్యులు నిర్వ‌హించారు.

అంతిమయాత్ర‌లో మంద‌కృష్ణ మాదిగ‌, ప్ర‌జాసంఘాల నేత‌లు, ఇత‌ర రాజ‌కీయ పార్టీల నేతు పాల్గొన్నారు. ప్రీతి మృతి కార‌ణ‌మైన ప్రిన్సిప‌ల్‌, హెచ్‌వోడీ, సైఫ్‌ల‌ను క‌ఠినంగా శింక్షించాల‌ని గ్రామ‌స్తులు డిమాండ్ చేస్తున్నారు. డాక్ట‌ర్ ప్రీతి అంతిమ‌యాత్ర సంద‌ర్భంగా గిర్ని తండాలో భారీగా పోలీసులు బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌కుండా పోలీసులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప్రీతిని సైఫ్ చంపాడ‌ని.. అత‌నితో పాటు మ‌రో ముగ్గురు, న‌లుగురు పాత్ర ఉంద‌ని కుటుంబ‌స‌భ్యులు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.