Maaveerudu: ‘మహావీరుడు’ షూటింగ్ స్టార్ట్

  • Written By:
  • Updated On - August 6, 2022 / 11:33 AM IST

హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా మడోన్ అశ్విన్ దర్శకత్వంలో శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వా నిర్మాణంలో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘మహావీరుడు’. అదితి శంకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. పూజా కార్యక్రమానికి లెజండరీ డైరెక్టర్ శంకర్ ముఖ్య అతిధిగా హాజరై చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ అందించారు. కాగా ఇటివలే సూపర్ స్టార్ మహేష్ బాబు ఆవిష్కరించి ఈ సినిమా టైటిల్‌ వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చింది. భరత్ శంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. విధు అయ్యన్న డీవోపీ ,ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.