Gudivada : వెనిగళ్ల రాము కు కొడాలి నాని సవాల్..నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయను

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఒక్క ఎకరం కూడా పేదలకు ఇవ్వలేదని ..జగన్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొడాలి నాని చెప్పుకొచ్చారు

  • Written By:
  • Updated On - March 28, 2024 / 11:44 PM IST

ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజుకు కాక రేపుతోంది. అధికార పార్టీ వైసీపీ – టిడిపి(YCP-TDP) మధ్య మాటల యుద్ధం మరింత పెరుగుతుంది. సై ..అంటే సై అంటున్నారు. కేవలం పార్టీల అధినేతలే కాదు అభ్యర్థులు సైతం ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతివిమర్శలు , సవాళ్లు , ప్రతిసవాళ్లు చేసుకుంటున్నారు. తాజాగా గుడివాడ (Gudivada) అభ్యర్థులు వెనిగళ్ల రాము – కొడాలి నాని (Kodali Nani – venigalla Ramu) ల మధ్య సవాళ్ల పర్వం మొదలైంది.

We’re now on WhatsApp. Click to Join.

గుడివాడ ప్రజలు నానిని నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని.. అయినా కూడా నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయలేకపోయారని వెనిగళ్ల రాము..నానిపై విమర్శలు కురిపించారు. ఈ విమర్శలకు కొడాలి నాని కౌంటరిస్తూ..గుడివాడలో అర్హులందరికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని, అర్హత ఉండి ఇళ్ల స్థలం రాలేదని ఒక్కరు చెప్పిన తాను ఎన్నికల్లో పోటీ చేయనని సవాల్ విసిరారు.

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఒక్క ఎకరం కూడా పేదలకు ఇవ్వలేదని ..జగన్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొడాలి నాని చెప్పుకొచ్చారు. తాను ఐదోసారి గెలవబోతున్నానని నాని ధీమా వ్యక్తం చేశారు. తనపై పోటీకి అమెరికా నుంచి వచ్చిన వ్యక్తిని చంద్రబాబు టికెట్ ఇచ్చారని… వచ్చే ఎన్నికల్లో అంతరిక్షం నుంచి అభ్యర్థిని తెచ్చుకుంటారని ఎద్దేవా చేశారు. ఏపీలో మళ్లీ వచ్చేది వైసీపీనే అని.. గుడివాడలో మళ్లీ గెలిచేది తానే అని జోస్యం తెలిపారు.

Read Also : Vivek : ఆస్తులు కాపాడుకోవడానికే వివేక్ పెద్దపల్లిని ఉపయోగించుకుంటున్నారు – బాల్క సుమన్