Diwali 2023: సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కడుతున్న బాధితులు

బాణాసంచా కాల్చేవారు జాగ్రత్త వహించాలని ప్రభుత్వాలు అరిచి మొత్తుకుంటున్నా కొందరు మాత్రం అజాగ్రత్తతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీపావళి వేడుకలు ఎంత సంబరాన్ని ఇస్తాయో, అజాగ్రత్త వహిస్తే అదే స్థాయిలో ప్రమాదం పొంచి ఉంటుంది.

Diwali 2023: బాణాసంచా కాల్చేవారు జాగ్రత్త వహించాలని ప్రభుత్వాలు అరిచి మొత్తుకుంటున్నా కొందరు మాత్రం అజాగ్రత్తతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీపావళి వేడుకలు ఎంత సంబరాన్ని ఇస్తాయో, అజాగ్రత్త వహిస్తే అదే స్థాయిలో ప్రమాదం పొంచి ఉంటుంది. ఏ ఈ ఏడాది దీపావళి వేడుకల్లో కొందరు ప్రాణాలు కోల్పోవడం, మరి కొందరు కళ్ళు కోల్పోవడం జరిగింది. దీంతో నగరంలో కంటి ఆస్పత్రి వద్ద బాధితులు క్యూ కడుతున్నారు. నగరంతో పాటు శివార్లలో కనీసం 50 మందికి కంటి గాయాలు అయ్యాయి.

హైదరాబాద్‌లో దీపావళి వేడుకల నేపథ్యంలో ప్రమాదానికి గురైన దాదాపు 50 మంది యువకులు ఆసుపత్రికి వచ్చినట్లు సరోజినీ దేవి కంటి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వారిలో 45 మందిని చికిత్స అనంతరం ఇంటికి పంపించగా, ఐదుగురు తీవ్రగాయాలతో ఆసుపత్రిలోనే ఉన్నారు, వారికి ఆపరేషన్ చేశారు. క్షతగాత్రులు మెహిదీపట్నంలోని ఆసుపత్రికి క్యూ కట్టారు. వీరిలో అత్యధికులు 15 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సు గలవారే. పటాకులు పేల్చే క్రమంలో కొందరికి గాయాలు కాగా, మరికొందరికి సమీపంలోనే వెలిగించిన క్రాకర్స్ అంటుకున్నాయి.

హైదరాబాద్ పోలీసులు రాత్రి 8 గంటల నుండి 10 గంటల మధ్య మినహా బహిరంగ రోడ్లు మరియు బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా పేల్చడాన్ని నిషేధించారు. అయితే చాలా చోట్ల సోమవారం తెల్లవారుజాము వరకు బాణసంచా పేల్చుతూనే ఉన్నారు. పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో క్రాకర్లు పేల్చడాన్ని నిషేధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిలియా నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్ ప్రకారం ఉత్తర్వులు నవంబర్ 12 నుండి నవంబర్ 15 వరకు అమలులో ఉంటాయి.

Also Read: APSRTC : శబరిమల, పంచారామ క్షేత్రాల దర్శనం.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు