CM KCR : యువత మీరు జర భద్రం…విద్వేషాల జోలికి పోకండి!!

దేశంలో కొన్నిపార్టీలు విద్వేష రాజకీయాలు చేస్తున్నారు...యువత మీరు భద్రంగా ఉండాలంటూ సూచించారు సీఎం కేసీఆర్.

  • Written By:
  • Updated On - October 1, 2022 / 04:08 PM IST

దేశంలో కొన్నిపార్టీలు విద్వేష రాజకీయాలు చేస్తున్నారు…యువత మీరు భద్రంగా ఉండాలంటూ సూచించారు సీఎం కేసీఆర్. విద్వేషాలకు లొంగకండి…కాస్త ఏమరుపాటుగా ఉన్నా బతుకులు దుర్భరంగా ఉంటాయో ఇదివరకే చూశామన్నారు. అజాగ్రత్తగా ఉన్నందుకే…మన రాష్ట్రం చాలా ఏళ్లుగా పరాయివాళ్లు ఉండిపోయారని గుర్తు చేశారు.

వరంగల్ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ప్రతిమ మెడికల్ కాలేజీలను, క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించారు. తర్వాత జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు కేసీఆర్. ఈ దేశం సహనశీలతదేశమని..పోరాటాలకు వెనకాడదన్నారు. కొందరు దుర్మార్గుల వల్లే రాజకీయాల్లో విధ్వేషాలు రగులుతున్నాయని ఆరోపించారు. కాగా ప్రతిమ ఆసుపత్రిని 350 పడకల సామర్థ్యంతో నిర్మించారు. ఈ మెడికల్ కాలేజీ ద్వారా ప్రతి ఏడాది 150 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.