Bigg Boss 6: రేవంత్ కి ఊహించని సర్ప్రైజ్.. కానీ అంతలోనే ఏడిపించేసిన బిగ్ బాస్?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 ఫ్యామిలీ ఎపిసోడ్ కి విశేష ప్రేక్షకాదరణ లభిస్తోంది. గడిచిన వారాలతో

  • Written By:
  • Updated On - November 25, 2022 / 02:41 PM IST

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 ఫ్యామిలీ ఎపిసోడ్ కి విశేష ప్రేక్షకాదరణ లభిస్తోంది. గడిచిన వారాలతో పోల్చుకుంటే ఈ వీక్ రేటింగ్ పరంగా కూడా దూసుకెళ్తుంది అని చెప్పవచ్చు. కాగా ఇప్పటికే హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్లకు సర్ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇనయా తల్లి అలాగే కీర్తి ఫ్రెండ్ నటుడు మహేష్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా రేవంత్ కోసం వాళ్ళ అమ్మ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా బిగ్ బాస్ షో కి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఆ ప్రోమోలో రేవంత్ ఒక్కసారిగా కంటెస్టెంట్ లతో ఆడియన్స్ కి కూడా కన్నీరు తెప్పించాడు.

ఆ ప్రోమోలో రేవంత్ భార్య అన్విత వాయిస్ వినిపించడంతో రేవంత్ కొద్దిసేపు హౌస్ లో అటు ఇటు ఎక్కడ వినిపిస్తోందా అని తిరిగాడు. ఆ తర్వాత చివరికి వీడియో కాల్ చేసి చూపించడంతో రేవంత్ తన భార్యను చూడగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. ఇలా ఉన్నావు నీ హెల్త్ ఎలా ఉంది అని అడగడంతో అందరూ ఉన్నా నువ్వు లేని లోటు నాకు బాగా కనిపిస్తోంది అని అన్విత అనడంతో రేవంత్ మరింత ఎమోషనల్ అయ్యాడు. అప్పుడు మాట్లాడుతుండగానే బిగ్ బాస్ వీడియో కాల్ కట్ చేయడంతో రేవంత్ మరింత ఎమోషనల్ అయ్యాడు. బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ నా భార్యతో వీడియో కాల్ మాట్లాడతాను అని వేడుకున్న కూడా బిగ్ బాస్ కనికరించలేదు.

దాంతో బాధపడుతున్న రేవంత్ కి మరొక ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇంతలోనే తన తల్లిని హౌస్ లోకి పంపించి ఏడిపించిన రేవంత్ ని వెంటనే నవ్వించాడు. ఇక తన తల్లిని చూసి ఎమోషనల్ అయిన రేవంత్ టెన్షన్ పడుతుండగా టెన్షన్ పడకు ధైర్యంగా ఉండు అనడంతో వెంటనే శ్రీహాన్ టెన్షన్ పడడు ఆంటీ మమ్మల్ని టెన్షన్ పెడతాడు అంటూ ఆటపట్టించాడు. అప్పుడు రేవంత్ కి వాళ్ళ అమ్మ చెవిలో కోపం తగ్గించుకో అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా పళ్లుమని నవ్వారు. అప్పుడు రేవంత్ ని చూసిన వాళ్ళ అమ్మ గడ్డం కొద్దిగా తీసేయ్ నాన్న అని అనగా తీయకూడదు అన్నారు కదా అమ్మ అనడంతో తీయవచ్చు అని చెప్పడంతో సరేలే ఫేస్ వాష్ చేసుకుని వస్తాను అని చెప్పిన రేవంత్ లోపలికి వెళ్లి మొత్తం గడ్డం క్లీన్ చేసుకొని రావడంతో అది చూసిన మిగతా కంటెస్టెంట్లు షాక్ అయ్యారు. అప్పుడు రేవంత్ వాళ్ళ అమ్మ ఇప్పుడు బాగా ఉన్నావు అని మెచ్చుకుంటూ ముద్దు పెట్టింది. ఆ తర్వాత శ్రీహాన్, రేవంత్ ల నిహా నీ పొగుడుతూ మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని అంటుంది. ఆ తర్వాత అమ్మ కీర్తి ఇలా రా అని చెప్పి కీర్తిని ముద్దుపెట్టుకొని నీకు అమ్మ లేదన్నావు. నేను ఉన్నాను కదా ఎప్పుడైనా నువ్వు మా ఇంటికి రావచ్చు అని చెబుతుంది.