Bigg Boss 6: జీవితంలో డబ్బు చాలా ముఖ్యం.. శ్రీ సత్య ఎమోషనల్ కామెంట్స్?

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ చూస్తుండగానే అప్పుడే 10 వారాలను విజయవంతంగా పూర్తి

  • Written By:
  • Updated On - November 16, 2022 / 02:48 PM IST

తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ చూస్తుండగానే అప్పుడే 10 వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని 11వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. 11వ వారం బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లకు ఊహించని షాక్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. ఇప్పటికే హౌస్ విన్నర్ ప్రైస్ మనీ 50 లక్షలు నుంచి కొద్దికొద్దిగా కోత పెట్టడం మొదలు పెట్టేసాడు. ఇప్పటికే తాజాగా టాస్క్ లో భాగంగా రాజ్ గెలవడంతో ఆ ప్రైజ్ మనీ 44,00,300 కు చేరుకుంది. అయితే బిగ్ బాస్ ఇంతటితో ఆగలేదు ఆ 44 లక్షల నుంచి మళ్లీ కోత కోయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోని తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సభ్యులకు డబ్బులు ఎందుకు అవసరం?వారు డబ్బు వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు?

వారికి ప్రైజ్ మనీ ఎందుకు అవసరం? ఆ ప్రైజ్ మనీ తో వారు ఏం చేయాలనుకుంటున్నారు?అన్న విషయాల గురించి చెప్పమని ఆదేశించాడు. ఈ క్రమంలోనే ఒక్కొక్క కంటెస్టెంట్ వారి బాధల గురించి చెప్పుకొచ్చారు. మొదట పైమా మాట్లాడుతూ మా అమ్మకు మేము నలుగురు ఆడపిల్లలైతే చిన్నప్పటినుంచి చాలా కష్టాలను ఎదురు కొన్నాము. ప్రతిరోజు పొలం పనికి వెళ్లి నిత్య అవసరాలు తీర్చుకునే వాళ్ళం. ఒకరోజు మాకంటే వేరే వాళ్ళు ఎక్కువ అద్దెకు ఇస్తారని వెంటనే మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు. కానీ ఎంత వెతికినా కూడా ఉండటానికి ఇల్లు దొరకలేదు.

కాబట్టి మా అమ్మకు మంచి ఇల్లు కట్టివ్వాలి అన్నది నా కోరిక అని చెప్పుకొచ్చింది పైమా. అనంతరం శ్రీ సత్య మాట్లాడుతూ.. అదృష్టమో లేకపోతే దురదృష్టమో తెలియదు కానీ మా నాన్న చిన్నప్పటి నుంచి నాకు ఎటువంటి లోటు లేకుండా తెలియకుండా పెంచారు. కష్టం అనేది తెలియకుండా మా నాన్న నన్ను పెంచి పెద్ద చేశారు. కానీ ఒకానొక సమయంలో ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ మొదలవడంతో మొదటిసారిగా మా కుటుంబం అందరూ కలిసి మూడు రోజులు తిండి లేక పస్తులు ఉన్నాము. ఇక అమ్మకు వైద్యం చేయించడం కోసం ఇల్లు కూడా అమ్మేశాము. నేను సంపాదించినదంతా అమ్మ వైద్యానికి ఖర్చు అవుతోంది. కాబట్టి నేను బిగ్ బాస్ షో ప్రైజ్ మనీ తో మా అమ్మ కోలుకునే విధంగా మంచి వైద్యం చేయించడంతోపాటు ఒక సొంత ఇల్లు కొనాలని ఉంది అని చెప్పుకొచ్చింది శ్రీ సత్య.