Anupam Kher : సమిష్టి కృషి ఎలా ఉంటుందో తెలుగు సినిమాల ద్వారా తెలుసుకున్నా..!!!

Bollywood vs south cinema అనే అంశంపై ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ స్పందించారు.

  • Written By:
  • Updated On - August 27, 2022 / 12:11 PM IST

Bollywood vs south cinema అనే అంశంపై ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ స్పందించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుపమ్ ఖేర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది చిత్రాలు, విజయాలు, హిందీ చిత్రాలు వరుసగా పరాజయం పాలవ్వడంపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. దక్షిణాది వారు స్టోరీకి ప్రాధాన్యతనిస్తే…బాలీవుడ్ కేవలం స్టార్స్ పైన్నే దృష్టిసారిస్తున్నారన్నారు. సమిష్టి క్రుషి వల్ల ఎలాంటి ఫలితాలను చూడవచ్చనేది తెలుగు సినిమాల ద్వారా తెలుసుకున్నానని…ఈ మధ్య ఓ తెలుగుతో పాటు తమిళ చిత్రాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు.

ఓ మలయాళ మూవీలో యాక్ట్ చేసేందుకు తాను రెడీ అవుతున్నట్లు తెలిపారు. నార్త్ వర్సెస్ సౌత్ డిబేట్ పై కిచ్చా సుదీప్, అక్షయ్ కుమార్ ల మధ్య కొన్ని నెలల క్రితం ట్వీట్ వార్ జరిగిన సంగతి తెలిసిందే. సినిమాల గురించి వారిద్దరూ వారించుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాతే ఈ అంశం సినీ ఇండస్ట్రీలో చర్చకు తెరలేపింది. ఇంటర్వ్యూలలో పాల్గొన్న నటులకు ఈ టాపిక్ ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. కాగా అనుపమ్ ఖేర్ బాలీవుడ్ నటుడు. అయినప్పటికీ తెలుగు ఆడియన్స్ బాగా దగ్గరయ్యారు. 1987లో త్రిమూర్తులు అనే మూవీతో టాలీవుడ్ రంగం ప్రవేశం చేశారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కార్తికేయ 2 తో తెలుగు తెరపై కనిపించారు.