Pingali Venkaiah Birth Anniversary : పింగళి వెంకయ్య జయంతి

దేశ సమగ్రతలో సార్వభౌమత్వాన్ని ప్రతిబింప చేసే ఆ జెండాకు ప్రాణం పోసింది మన తెలుగువాడే..ఆయనే కృష్ణాజిల్లా వాసి పింగళి వెంకయ్య (Pingali Venkaiah).

  • Written By:
  • Updated On - August 2, 2023 / 05:02 PM IST

Pingali Venkaiah Birth Anniversary : దేశాన్ని బానిస సంకెళ్లా నుండి విముక్తి చేసేందుకు ఎంతోమంది ఎన్నో ఉద్యమాలు చేసారు. వారినందరిని ఒకేతాటిపైకి తీసుకొచ్చింది మాత్రం మువ్వన్నెల జెండా. అలాంటి జెండా ఆవిష్కారణ వెనుక ఎన్నో ఆసక్తికర అంశాలు దాగున్నాయి. మూడు రంగుల ఏర్పాటు దగ్గరినుండి మధ్యలో అశోక చక్రం ముద్రణ వరకు ఎన్నో విశేషాలు ఉన్నాయి. దేశ సమగ్రతలో సార్వభౌమత్వాన్ని ప్రతిబింప చేసే ఆ జెండాకు ప్రాణం పోసింది మన తెలుగువాడే.. ఆయనే కృష్ణాజిల్లా వాసి పింగళి వెంకయ్య (Pingali Venkaiah). పింగళి వెంకయ్య 1876 వ సంవత్సరంలో మచిలీపట్టణంలోని భట్లపెనుమర్రు గ్రామం, హనుమంత రాయుడు మరియు వెంకట రత్నం అనే బ్రాహ్మిన దంపతులకు జన్మించారు. మచిలీపట్నం లోనే తన స్కూల్ విద్యను పూర్తిచేసారు. 19 సంవత్సరాల వయస్సులో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరి ఆఫ్రికాలో ఆంగ్లో-బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే మహాత్ముడితో పరిచయం ఏర్పడి 50 ఏళ్ల పాటు అది కొనసాగింది.

త్రివర్ణ పతాకం ఎలా ఏర్పాటు అయ్యిందంటే..

యుద్ధ సమయంలో సైనికులు బ్రిటిష్ ప్రభుత్వ జాతీయ పతాకానికి సెల్యూట్ చేయాల్సి వస్తుండడం..అలాగే కాంగ్రెస్ మీటింగ్ లలో కూడా బ్రిటీష్ ప్రభుత్వ జెండా ఎగరవేయటం వెంకయ్య (Pingali Venkaiah) కు నచ్చేది కాదు. ఆ సమయంలో వెంకయ్యకు భారతదేశానికి కూడా ఒక జాతీయ పతాకం ఉండాలి అనే ఆలోచన వచ్చింది.

1906 వ సంవత్సరంలో దాదాభాయ్ నౌరోజీ పర్యవేక్షణలో ఏర్పాటు చేయబడ్డ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో వెంకయ్య హాజరు అయినప్పుడు, భారత జాతీయ కాంగ్రెస్ (Indian National Congress) కోసం ఒక జాతీయ పతాకాన్ని రూపకల్పన చేయాలని నిర్ణయించుకున్నారు. భారతీయ చరిత్ర మరియు సంస్కృతిని ఆధారం చేసుకొని 30 జాతీయ పతకాల నమూనాలను పింగళి వెంకయ్య (Pingali Venkaiah) తయారు చేసారు.

1916 వ సంవత్సరంలో భరత దేశానికి ఒక జాతీయ పథకం అనే పుస్తకం ను కూడా రాసారు. ఈ పుస్తకంలో 30 రకాల జాతీయపతకాల నమూనాల గురించి వివరించారు. విజయవాడ వేదికగా 1921లో అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభలు జరిగినప్పుడు గాంధీజీ.. వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులు, మధ్య రాట్నం గల ఒక జెండాను రూపొందించాలని కోరారు.

గాంధీజీ ప్రోద్బలంతో త్రివర్ణపతాకం బెజవాడలో పుట్టింది. కాషాయం హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లింలకని పేర్కొనడంతో, ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయం వెలువడడంతో గాంధీజీ సూచనపై కాషాయం త్యాగానికి, తెలుపు స్వచ్ఛతకు, పచ్చదనం సాఫల్యతకు చిహ్నాలు కాగా అశోక చక్రం ధర్మానికి ప్రతీక అని త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించారు.

వెంకయ్య (Pingali Venkaiah) గొప్ప రచయిత :

వెంకయ్య గొప్ప దేశభక్తుడు మాత్రమే కాదు.. జియాలజిస్ట్, రచయిత కూడా. 1911-44 వరకు బందరు జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో భూగర్భ శాస్త్ర పరిశోధనలు చేసి డిప్లొమా పొందారు. 1924 నుంచి 1944 వరకు నెల్లూరులో మైకా గురించి పరిశోధనలు చేశారు. బొగ్గు వజ్రంగా మారే విధానాన్ని గురించి ‘తల్లిరాయి’ అనే పుస్తకం రాశారు. 1916లో ‘భారతదేశానికి ఒక జాతీయ పతాకం’ అనే పుస్తకాన్ని రచించారు. ఈ గ్రంథంలో సుమారు 30 రకాల పతాకాలను ప్రదర్శించారు.

వెంకయ్య కు ముద్దు పేర్లు ఎన్నో :

వెంకయ్య ను ఎన్నో ముద్దు పేర్లతో పిలిచేవారు. ఈయనకు భూగర్భ శాస్త్రం లో మంచి అనుభవం ఉండటం వల్ల డైమండ్ మైనింగ్ లో నిపుణుడు అయ్యారు. డైమండ్స్ మైనింగ్ లో ఉన్న అనుభవం వల్ల వెంకయ్య ను “డైమండ్ వెంకయ్య” అని పిలిచే వారు. అలాగే వివిధ రకాల పత్తి గింజలపై చేసిన పరిశోధన కారణంగా ప్రజలు ” పత్తి వెంకయ్య” అని పిలిచే వారు.

అలాగే వెంకయ్య ఓబహుభాషావేత్త, జాపనీస్ మరియు ఉర్దూ భాషలతో పాటు పలు భాషలలో ప్రావిణ్యం ఉండడం తో 1913 లో బాపట్లలో జాపనీస్ భాషలో ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఉపన్యాసం తరవాత ఆయనను ” జపాన్ వెంకయ్య ” అని పిలిచేవారు. అలాగే జనద వెంకయ్య అని కూడా కొంతమంది పిలిచేవారు.

వెంకయ్య మరణం :

వెంకయ్య తన జీవితం మొత్తం గాంధీ సిద్ధాంతాలను పాటిస్తూ 1963 సంవత్సరంలో మరణించారు. ఆగస్టు 2న ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుడి సేవలను స్మరించుకుందాం.

Also Read:  Anasuya Bhardwaj : చేతిలో డ్రింక్ గ్లాస్.. ఎదపై టాటూ అనసూయ హాట్ షో