Site icon HashtagU Telugu

Chandrayaan – 3 Landing in 4 Stages : చివరి 17 నిమిషాలలో.. 4 దశల్లో ల్యాండింగ్.. వివరాలివీ

Chandrayaan - 3 Landing 4 Stages

Chandrayaan3 Landing 4 Stages

Chandrayaan – 3 Landing in 4 Stages : చంద్రయాన్-3 సక్సెస్ అయ్యే క్షణం కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.. 

ప్రస్తుతం చంద్రుడి ఉపరితలంపై దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ వైపే అందరి చూపు ఉంది. 

అది చంద్రుడిపై ఇవాళ  సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు అడుగు మోపడానికి 17 నిమిషాల ముందు.. 4 కీలక దశలను దాటాల్సి ఉంటుంది.

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Also read : Foods For Kidneys: మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే చేయాల్సింది ఇదే..!

రఫ్ బ్రేకింగ్.. స్పీడ్ కంట్రోల్ చేయడమే లక్ష్యం 

రఫ్ బ్రేకింగ్ దశలో చంద్రయాన్ ల్యాండర్ స్పీడ్ ఎంతో తెలుసా ?  గంటకు 6వేల కిలోమీటర్లు. చంద్రుడిపై దిగే టైంలో ఎంత స్లోగా ఉంటే అంత మంచిది. రఫ్ బ్రేకింగ్ దశలో ఈ స్పీడ్ ను తగ్గించేందుకు దానిలో ఉన్న నాలుగు చిన్నపాటి ఇంజన్లను 11 నిమిషాల పాటు మండిస్తారు. చంద్రుడి ఉపరితలానికి 7.4 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఈ ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహిస్తారు.

ఆటిట్యూడ్ హోల్డ్.. దిగబోయే ప్లేస్ గుర్తింపు 

చంద్రుడి ఉపరితలానికి 6.8 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఆటిట్యూడ్ హోల్డ్ దశ వస్తుంది. ఈ దశలో ల్యాండర్ తన యాంగిల్ ను 50 డిగ్రీస్ కి చేంజ్ చేసుకుంటుంది. ల్యాండర్ లో ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా ఉంటుంది. దీన్ని ఇస్రో శాస్త్రవేత్తలు యాక్టివేట్ చేస్తారు. ఇది ల్యాండర్ దిగటానికి అనువైన  ప్లేస్ ఎక్కడుంది అనేది వెతుకుంది. దిగబోయే ప్లేస్ లో రాళ్లు రప్పలు ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేస్తుంది. దీనిపై కేవలం 10 సెకన్లలో అది ఒక నిర్ణయం తీసుకొని ఇస్రోకు చేరవేస్తుంది.

Also read :Today Horoscope : ఆగస్టు 23 బుధవారం రాశి ఫలితాలు.. వారికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు

ఫైన్ బ్రేకింగ్ దశ.. వేగం సున్నాకు డౌన్  

ఫైన్ బ్రేకింగ్ దశకు చేరుకోగానే ల్యాండర్  స్ట్రైట్ (నిలువు)  పొజిషన్ లోకి వచ్చేస్తుంది. దాని స్పీడ్ మొత్తం సున్నాకు డౌన్ అవుతుంది. ఈ దశలో ల్యాండర్ స్లోగా  చంద్రుడి ఉపరితలం వైపుగా 3 నిమిషాల పాటు  జర్నీ చేస్తుంది. ఈక్రమంలో ప్రతి పది సెకన్లకు ఒకసారి కదలకుండా గాల్లోనే వేలాడుతూ ఉంటుంది. ఈక్రమంలోనే ల్యాండర్ లో ముడుచుకొని ఉన్న 4 కాళ్లు ల్యాండ్ అయ్యేందుకు బయటికి విచ్చుకుంటాయి. ఈ టైములో చంద్రుడి ఉపరితలానికి మన ల్యాండర్ కు మధ్య దూరం ఒక్క  కిలోమీటరు మాత్రమే ఉంటుంది. ల్యాండింగ్ ప్రదేశాన్ని మరోసారి కెమెరాతో సరిచూసుకుని.. ఫైనల్ స్టేజ్ మన ల్యాండర్ విక్రమ్ సిద్ధం అవుతుంది.

టచ్ డౌన్.. దిగటం స్టార్ట్ చేస్తుంది 

టచ్ డౌన్ దశ అనేది ఫైనల్ స్టేజ్.  ఈ దశలో చంద్రుడి ఉపరితలానికి 60మీటర్ల దూరంలోకి ల్యాండర్ చేరుకుంటుంది. రెండు నిమిషాల పాటు ఈ దశలో ల్యాండర్ జర్నీ చేస్తుంది. ఈక్రమంలో దిగబోయే ప్లేస్ బాగుందా లేదా అనేది మరోసారి  చెక్ చేసుకుంటుంది. ఒకవేళ దిగబోయే ప్లేస్ బాగా లేకుంటే.. కొంచెం పక్కకు జరిగి మరోచోట ల్యాండ్ అవుతుంది.ఇలా గరిష్టంగా 150 మీటర్లు పక్కకు జరిగే కెపాసిటీ మన ల్యాండర్ విక్రమ్ కు ఉంది. ఆ విధంగా తాను దిగాల్సిన ప్లేస్ ను ల్యాండర్  కన్ఫర్మ్ చేసుకుంటుంది. మొత్తం ల్యాండర్ 4 కాళ్లు చంద్రుడి దక్షిణధృవం ఉపరితలంపై ఆనుతాయి. ఆ వెంటనే  ల్యాండర్ లో ఉండే టచ్ డౌన్ సెన్సర్లు మన ఇస్రోకు సాఫ్ట్ ల్యాండింగ్ పై (Chandrayaan3 – Landing 4 Stages) సమాచారాన్ని పంపిస్తాయి.

Also read : Chandrayaan Telecast: తెలంగాణలో ఆగస్టు 23న సాయంత్రం 6.30 వరకు స్కూల్స్ ఓపెన్

Exit mobile version