Laptop: పడుకొని ల్యాప్ టాప్ లో వర్క్ చేస్తున్నారా..అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే?

రాను రాను టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో ప్రతి ఒక్కరి ఇంట్లో ల్యాప్ టాప్ తప్పనిసరిగా ఉంటుంది. ఉద్యోగుల కోసం

  • Written By:
  • Publish Date - October 14, 2022 / 08:30 AM IST

రాను రాను టెక్నాలజీ డెవలప్ అవ్వడంతో ప్రతి ఒక్కరి ఇంట్లో ల్యాప్ టాప్ తప్పనిసరిగా ఉంటుంది. ఉద్యోగుల కోసం కొందరికి ల్యాప్ టాప్ లు ఉపయోగిస్తుంటే మరికొందరి మాత్రం ఇంట్లో ఉంటే చదువుకునే స్టూడెంట్స్ కి ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది అని ల్యాప్ టాప్ ను కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకుంటున్నారు. అయితే ల్యాప్ టాప్ ను ఉపయోగించి వర్క్ చేసే వాళ్ళు, లేదంటే ల్యాప్ టాప్ ముందు సినిమాలు లాంటివి చూసేవాళ్ళు ఒళ్ళు పెట్టుకుని లేదంటే టేబుల్ పై పెట్టుకొని ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా చేయడం మంచిదే. కానీ కరోనా మహమ్మారి తరువాత చాలామంది వర్క్ ఫ్రం హోం తో వర్క్ చేస్తుండడం వల్ల లాప్టాప్ ను ఏ విధంగా అంటే ఆ విధంగా ఉపయోగిస్తున్నారు.

కొంతమంది ల్యాప్ టాప్ ను బోర్లా పడుకునే ల్యాప్ టాప్ యూజ్ చేస్తున్నారు. ఈ విధంగా బోర్ల పడుకుని ల్యాప్ టాప్ ని యూజ్ చేయడం వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ల్యాప్ టాప్ ముందు పడుకుని గంటల తరబడి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా చేయడం వల్ల మెడ నొప్పి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఒకే పొజిషన్ లో అలాగే చూస్తూ ఉండటం వల్ల ఆ సమస్య వస్తుంది. అంతేకాకుండా ఆ పొజీషన్ లో గంటలకు అలాగే ఉండడం వల్ల వెన్ను నొప్పి సమస్య కూడా వస్తుంది.

అలాగే ఏళ్ల తరబడి లాప్టాప్ ను ఉపయోగిస్తున్నట్లయితే గర్భాశ నొప్పి కూడా వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ల్యాప్టాప్ ని బోర్ల పడుకొని ఉపయోగించకూడదు. పొట్టపై పడుకుని ల్యాప్ టాప్ ను ఎక్కువ సేపు ఉపయోగించడం వల్ల వెన్ను పాము పై చెడు ప్రభావం పడుతుంది. అలా పడుకోవడం వల్ల వెన్ను కండరాలు సాగి,ఎముక నొప్పి కూడా వస్తుంది. కొన్నిసార్లు ఆ సమస్యను ఏమీ కాదు అని అలాగే ఉంటే పూర్తిగా వికలాంగులుగా అయ్యే అవకాశం ఉంటుంది. బోర్ల పడుకొని లాప్టాప్ ముందు పని చేయడం వల్ల అది జీర్ణ క్రియపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ విధంగా పడుకొని వర్క్ చేయడం వల్ల జీర్ణ క్రియ దెబ్బతింటుంది. తద్వారా గ్యాస్టిక్ మలబద్ధకం సమస్య వస్తుంది. అలాగే ఆ విధంగా పడుకుని వర్క్ చేయడం వల్ల కంటి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.