Exercise: మహిళలకు బెస్ట్ వ్యాయామాలేంటో మీకు తెలుసా?

ఈ రోజుల్లో మహిళలు థైరాయిడ్, హార్మోన్స్ హెచ్చు తగ్గులు వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే అధికంగా బరువు పెరిగిపోతున్నారు. అది తగ్గించుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు.

  • Written By:
  • Updated On - January 20, 2022 / 03:55 PM IST

ఈ రోజుల్లో మహిళలు థైరాయిడ్, హార్మోన్స్ హెచ్చు తగ్గులు వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే అధికంగా బరువు పెరిగిపోతున్నారు. అది తగ్గించుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు. మరి…ఇలాంటి సమస్యలను తగ్గించుకోవాలంటే శరీరానికి వ్యాయామం చాలా అవసరం. కోవిడ్ ప్రారంభం నుంచి మహిళలు ముఖ్యంగా ఎనిమిది లేదా తొమ్మిది గంటలపాటు ఉద్యోగం చేసేవారు తమ లైఫ్ స్టైల్లో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. జీవన శైలిలో ప్రధాన మార్పులలో ఒకటి శారీరక శ్రమను తగ్గించుకోవడం. బెడ్ రూమ్స్, లివింగ్ రూమ్స్ లో పనిచేసే కల్చర్ చాలా మంది ఉద్యోగులకు కంఫర్ట్ గా కనిపించినప్పటికీ…అది వారి ఆరోగ్యంపై బయటకు కనిపించని ప్రభావాన్ని స్రుష్టిస్తోంది.

మహిళలు వ్యాయామం చేయడం వల్ల ముఖ్యమైన ప్రయోజనం శరీర బరువును నియంత్రించుకోవడం. మహిళలు సడెన్ గా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్సర్ సైజులు చేసి బరువు తగ్గించుకోవచ్చు. 40 ఏళ్లు పై బడిన మహిళలు శరీర శ్రమను తగ్గించుకున్నట్లయితే…ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరాన్ని యాక్టివ్ గా ఉంచుకున్నట్లయితే గుండె సమస్యలు, షుగర్, కీళ్ల నొప్పులు వంటి అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది.

నడక….: ప్రతిరోజూ నడవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేసినట్లవుతుంది. ఆర్థరైటిస్ ఫౌండేషన్ ప్రకారం, నడక రక్త ప్రసరణను మెరుగుపరచడంతోపాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కండరాలను బలంగా ఉంచేలా చేస్తుంది. నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కీళ్లకు సపోర్టునిస్తుంది. ఊపిరితిత్తుల కెపాసిటి మెరగవుతుంది. మానసీక క్షీణతను తగ్గిస్తుంది. అల్జీమర్స్ తగ్గిచడంతోపాటు రుతుక్రమం ఆగిపోయిన మహిళలపై జరిపిన అధ్యయనంలో ప్రతిరోజూ 30 నిమిషాల పాటు నడిచింనట్లయితే తుంటి పగుళ్ల ప్రమాదాన్ని తగ్గించవచ్చని కనుగొన్నారు. హార్వర్డ్ హెల్త్ సర్వే ప్రకారం 155 పౌండ్ అంటే 70 కిలోలు ఉన్న వ్యక్తి 6.4 KM/H వేగంతో 30 నిమిషాలు నడిచినట్లయితే 167 కేలరీలు బర్న్ చేస్తారని అంచనా వేశారు. కాబట్టి మహిళలకు నడక అనేది చాలా అవసరం.

జాగింగ్….
మీకు 30 నిమిషాలపాటు నడవడం ఈజీగా అనిపించినట్లయితే…మీ నడకను సాధారణ జాగింగ్ కి అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. నడక కంటే జాగింగ్ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే హానికరమైన విసెరల్ కొవ్వు లేదా బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

సైక్లింగ్….
మీకు సైక్లింగ్ అలవాటు ఉన్నట్లయితే….ఈజీగా బరువు తగ్గే ఛాన్స్ ఉంటుంది. హార్వర్డ్ హెల్త్ జరిపిన ఓ పరిశోధనా ప్రకారం శారీరక శ్రమ, బరువులో మార్పుల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసేందుకు పరిశోధకులు 16 ఏళ్ల పాటు 18,000కంటే ఎక్కువ మంది మహిళలను అనుసరించారు. వారి పరిశోధనలో నడవడం, జాగింగ్ కంటే కూడా సైక్లింగ్ పై ఎక్కువ ఫలితాలను చూపించింది.

స్విమ్మింగ్…
స్విమ్మింగ్ చేయడం వల్ల ఈజీగా కెలరీలను బర్న్ చేయవచ్చు. ఈత కొట్టడం అనేది గొప్ప వ్యాయామం. దీన్ని అలవాటు చేసుకోవడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఈత కొట్టడం వల్ల హార్ట్ బీట్ రేటు పెరుగుతుంది. కండరాలను టోన్ చేయడంతో మొత్తం శరీరానికి వ్యాయామం లభిస్తుంది.

యోగా…
క్రమం తప్పకుండా ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల సులభంగా బరువు తగ్గించుకోవచ్చు. అంతేకాదు…ఒత్తిడిని కూడా తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందించడంలో సహాయపడుతుంది.