Corona: మరో కొత్త వేరియంట్..ఒమిక్రాన్ కన్నా వేగంగా వ్యాప్తి

  • Written By:
  • Updated On - January 19, 2022 / 04:22 PM IST

కరోనా మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఒమిక్రాన్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త మ్యుటేషన్ ఐహెచ్ యూ (బీ.1.640.2) గా గుర్తించారు. ఫ్రాన్స్ లోని ఐహెచ్ యూ మెడిటరనీ ఇన్ ఫెక్షన్ కు చెందిన సైంటిస్టులు ఈ కొత్త మ్యుటేషన్ ను గుర్తించారు. ఆ సంస్థ పేరునే వేరియంట్ కూ పెట్టారు. ప్రస్తుతం ఫ్రాన్స్ లోని మార్సెయ్ అనే నగరంలో 12 కేసులను నిర్ధారించారు. వారంతా కూడా ఆఫ్రికా దేశమైన కామెరూన్ నుంచి వచ్చారని అధికారులు గుర్తించారు.

ఈ వేరియంట్ లో 46 మ్యుటేషన్లు జరిగాయని, దీంతో ఒమిక్రాన్ కన్నా వేగంగా అది సోకుతోందని సైంటిస్టులు చెబుతున్నారు. వ్యాక్సిన్లకు కూడా అది లొంగడం లేదని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ కొత్త వేరియంట్ ఇతర దేశాలకు వ్యాపించలేదని డబ్ల్యూహెచ్ వో చెబుతోంది. దీనిని ‘వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్’ జాబితాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేర్చింది.