Independence Day 2023 : మహాత్ముడి వెంట ఉన్నవారిలో ఆ 8 మంది మహిళలు చాల ప్రత్యేకం..

గాంధీ వెంట నడిచిన సమరయోధుల గురించి కూడా మాట్లాడుకుంటుంటాం. (Independence Day) కానీ ఆలా గాంధీ వెంట నడిచిన వారిలో మహిళలు కూడా ఉన్నారు.

  • Written By:
  • Updated On - August 14, 2023 / 11:21 AM IST

Independence Day 2023  : మోహన్ దాస్ కరంచంద్ గాంధీ .. బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన వారిలో అగ్రగణ్యుడు. ప్రజలు గాంధీని ‘జాతిపిత’ అని గౌరవిస్తారు. సత్యము, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంత మూలాలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము అతని ఆయుధాలు. కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి చెప్పిన ఘనుడు.

గాంధీ గురించి చాల విషయాలు.. చాలామంది .. చాల చోట్ల చెపుతూ.. మాట్లాడుకుంటుంటారు. గాంధీ ఎన్నో పోరాటాలు చేసారని , ఎన్నో ఉద్యమాలు చేసి ప్రజల్లో చైతన్యం నింపారని.. ప్రజలందరికి ఎన్నో మార్గదర్శకాలను గాంధీ సూచించారని..బ్రిటిష్ వారిలో వణుకు పుట్టించారని ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. అలాగే గాంధీ వెంట నడిచిన సమరయోధుల గురించి కూడా మాట్లాడుకుంటుంటాం. కానీ ఆలా గాంధీ వెంట నడిచిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఎనిమిది మంది మాత్రం చాల ప్రత్యేకం. మరి ఆ ఎనిమిది మంది ఎవరు..? గాంధీకి వారంటే ఎందుకు ఇష్టం..? వారి ప్రత్యేకత ఏంటి అనేది తెలుసుకుందాం.

ఆ ఎనిమిది వీరే..

  1. మెడెలిన్ స్లెడ్ (మీరాబెన్), (1892-1982 )
  2. నిలా క్రైమ్ కుక్, (1972-1945 )
  3. సరళా దేవి చౌధురాణి (1872-1945)
  4. సరోజినీ నాయుడు (1879-1949)
  5. రాజకుమారి అమృత్ కౌర్ (1889-1964)
  6. డాక్టర్ సుశీలా నయ్యర్ (1914-2001)
  7. అభా గాంధీ (1927-1995)
  8. మను గాంధీ (1928-1969)

సరోజినీ నాయుడు (1879-1949) :

భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు, కవయిత్రి కూడా. సరోజినీ దేవి 1925 డిసెంబరులో కాన్పూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు, స్వతంత్ర భారతదేశపు (Independence Day) తొలి మహిళా గవర్నరు కూడా.

సరోజినీ, గాంధీ తొలిసారి లండన్‌లో కలుసుకున్నారు. గాంధీ అరెస్టు తర్వాత ఉప్పు సత్యాగ్రహం నడిపించాల్సిన బాధ్యత ఆమెపైనే పడింది. ‘‘ఆయన ఎత్తు తక్కువ. నెత్తిపై జట్టు కూడా లేదు. నేలపై కూర్చొని ఆలివ్ నూనెలో వేయించిన టమాటలను తింటున్నారు. ప్రపంచ ప్రఖ్యాత నాయకుడిని అలా చూసి నాకు ఆనందంతో నవ్వు వచ్చింది. అప్పుడు ఆయన నా వైపు చూశారు. ‘మీరు కచ్చితంగా నాయుడు గారి శ్రీమతి అయ్యుంటారు. నాతోపాటు తినండి’ అని అన్నారు. నేనేమో ఇదేం పనికిరాని పద్ధతి అని అడిగా’’ అంటూ సరోజినీనాయుడు ఓ సందర్భంలోతెలిపారు.

Also Read:  Independence Day 2023: 1000 మంది పోలీసుల నిఘాలో ఎర్రకోట.. మొగల్ కాలం నాటి భద్రత ఏర్పాట్లు

రాజకుమారి అమృత్ కౌర్ (1889-1964) :

స్వతంత్ర భారతదేశ (Independence Day) మొట్టమొదటి ఆరోగ్య శాఖా మంత్రి. 1947లో బ్రిటీష్ పాలన నుండి భారతదేశం స్వతంత్రం పొందాకా (Independence Day) ఏర్పడిని మొట్టమొదటి కేబినెట్ లో ఆమె మంత్రిగా పనిచేశారు. దాదాపు 10ఏళ్ళ పాటు ఆరోగ్య శాఖా మంత్రిగానే కొనసాగారు. ఆమె గాంధీ అనుచరురాలు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న అమృత్ కౌర్ సామాజిక ఉద్యమ కార్యకర్తగానూ పనిచేశారు. భారత రాజ్యాంగ నిర్మాతల్లో అమృత్ కౌర్ కూడా ఒకరు. కపూర్థలా రాజు హర్‌నామ్ సింగ్ కుమార్తె అమృత్ కౌర్. ఆమె ఇంగ్లండ్‌లో చదువుకున్నారు. గాంధీకి అత్యంత సన్నిహితులైన సత్యాగ్రహ ఉద్యమకారుల్లో ఒకరిగా ఆమె పేరును విశ్లేషకులు చెబుతుంటారు.

1934లో తొలిసారి ఆమె గాంధీని కలిశారు. ఇద్దరూ వందల సంఖ్యలో లేఖలు రాసుకున్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం సందర్భాల్లో అమృత్ కౌర్ జైలుకు కూడా వెళ్లారు. అమృత్ కౌర్‌కు గాంధీ ‘మేరీ ప్యారీ పాగల్ ఔర్ బాగీ’ అంటూ లేఖలు రాసేవారు. చివర్లో తనను తాను ‘తానాషా’ (నియంత)గా అందులో పేర్కొనేవారు.

డాక్టర్ సుశీలా నయ్యర్ (1914-2001) :

సుశీల నయ్యర్ , ‘నాయర్’ (1914 – 2001) అని కూడా పిలుస్తారు, ఈమె ఓ వైద్యురాలు. గాంధీ వ్యక్తిగత కార్యదర్శి ప్యారేలాల్ నయ్యర్‌‌కు సుశీలా చెల్లెలు. తమ తల్లి వద్దన్నా వినకుండా ఈ అన్నాచెల్లెళ్లు గాంధీతోపాటు ఉండేందుకు వెళ్లారు. అయితే, తర్వాతి రోజుల్లో వారి తల్లి కూడా గాంధీ సమర్థకురాలిగా మారిపోయారు. వైద్యం చదివిన తర్వాత గాంధీకి సుశీలా వ్యక్తిగత డాక్టర్‌గా ఉన్నారు. వృద్ధాప్యంలో గాంధీ.. మనూ, అభా గాంధీల తర్వాత సుశీలా‌పైనే ఎక్కువగా ఆధారపడేవారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో కస్తూర్భా గాంధీతోపాటు సుశీలా అరెస్టయ్యారు. పూనాలో కస్తూర్భా గాంధీ ఆఖరి రోజుల్లో ఉన్నప్పుడు ఆమె వెంట సుశీలా ఉన్నారు.

మను గాంధీ (1928-1969) :-

మను గాంధీ..మహాత్మా గాంధీకి దూరపు చుట్టం. ఈమెను గాంధీ తన మనవరాలిగా భావించేవారు. అతి చిన్న వయసులో మను..గాంధీ వద్ద చేరారు. గాంధీ నోవాఖాలీ‌లో ఉన్న రోజుల్లో అభాతోపాటు మను ఆయనకు సాయంగా ఉండేవారు. వాళ్లద్దరి భుజాల ఆసరాతోనే గాంధీ నడుస్తుండేవారు. గాంధీని వ్యతిరేకించే కొంతమంది ఆయన నడిచే దారుల్లో ఓసారి మలమూత్రాలు వేసినప్పుడు, వాటిని గాంధీతో పాటు శుభ్రం చేసినవారిలో మనుగాంధీ ఉన్నారు. అలాగే కస్తూర్భాకు చివరి రోజుల్లో సపర్యలు చేసినవారిలోనూ మనుగాంధీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. గాంధీ జీవితంలో ఆఖరి కొన్నేళ్లు ఎలా గడిచాయన్నది ఆమె డైరీలో వివరంగా రాసుకున్నారు.

అభా గాంధీ (1927-1995) :-

అభా గాంధీ .. గాంధీ మునిమనవడు కను గాంధీని ఈమె వివాహం చేసుకుంది. గాంధీ ప్రార్థన కార్యక్రమాల్లో అభా గాంధీ భజనలు పాడేవారు. కను ఫోటోలు తీసేవారు. 1940లో మహాత్మ గాంధీ ఫోటోలను కను చాలా తీశారు. అభా గాంధీ నోవాఖాళీలో గాంధీతోపాటు ఉండేవారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా హిందూ – ముస్లిం అల్లర్లు జరిగాయి. గాంధీ వాటిని ఆపేందుకు ప్రయత్నించారు. నాథూరామ్ గాడ్సే గాంధీని హత్య చేసిన సమయంలో అభా గాంధీ అక్కడే ఉన్నారు.

Also Read:  Independence Day 2023 : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో భారీ భద్రత

నిలా క్రైమ్ కుక్ (1972-1945) :-

నిలా క్రైమ్ కుక్ అమెరికా లో జన్మించారు. 1931లో భారత్ కు వచ్చి.. ఆ త‌ర్వాత గాంధీజీని అనుస‌రిస్తూ ప‌లు సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేది. ఈ క్ర‌మంలోనే అంట‌రానిత‌నానికి వ్య‌తిరేకంగా చేస్తున్న కార్య‌క్ర‌మాల గురించి 1932లో గాంధీకి వివ‌రిస్తూ ఆమె ఒక లేఖ రాసింది. అప్ప‌టి నుంచి వీరిద్ద‌రి మ‌ధ్య లేఖ‌ల ద్వారా సంభాష‌ణ‌లు జ‌రిగేవి. 1933లో య‌ర‌వాడ జైల్లో గాంధీని నిలా క్రైమ్ కుక్ క‌లిశారు. అప్పుడు ఆయ‌న నిలాను స‌బ‌ర్మ‌తీ ఆశ్ర‌మానికి పంపించారు. కొంత‌కాలం అక్క‌డ గ‌డిపిన నిలాకు ఆశ్ర‌మ స‌భ్యుల‌తో మంచి అనుబంధం ఏర్ప‌డింది. ఆశ్ర‌మంలో అంద‌రూ ఆమెను నాగిని అని కూడా పిలిచేవారు. కానీ ఉదార‌వాద ఆలోచ‌న‌లు ఉన్న నిలాకు ఆశ్ర‌మ జీవితం గ‌డప‌డం న‌చ్చ‌లేదు. దీంతో అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆమె అమెరికా వెళ్లి అక్కడ ఇస్లాం స్వీకరించి, ఖురాన్‌ను అనువాదం చేశారు.

మెడెలిన్ స్లెడ్ (మీరాబెన్), (1892-1982) :

మ‌హాత్మా గాంధీకి ద‌గ్గ‌రైన మ‌హిళ‌ల్లో ఒక‌రు మీరాబెన్. ఈమె అస‌లు పేరు మెడ‌లిన్ స్లెడ్‌. ఈమె బ్రిటిష్ అడ్మిర‌ల్ స‌ర్ ఎడ్మండ్ స్లెడ్ కుమార్తె. జ‌ర్మ‌న్ పియానో విధ్వాంసుడు బోథోవెన్ అంటే మెడెలిన్‌కు అభిమానం. అదే స‌మ‌యంలో సంగీత‌కారుల గురించి ఫ్రెంచ్ ర‌చ‌యిత రోమైన్ రోలెండ్ ర‌చ‌న‌లు చేసేవారు. అలాగే బోథోవెన్ గురించి కూడా రోలెండ్ ప‌లు ర‌చ‌న‌లు చేశారు. ఈ క్ర‌మంలోనే రోలెండ్‌తో మెడ‌లిన్‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అయితే గాంధీ జీవిత చ‌రిత్ర‌ను కూడా రోలెండ్ రాశారు.

ఈ బ‌యోగ్ర‌ఫీని మెడ‌లిన్ చ‌దివింది. ఆ త‌ర్వాత గాంధీ ప్ర‌భావం ఆమెపై చాలావ‌ర‌కు ప‌డింది. దీంతో గాంధీ చెప్పిన మార్గంలోనే న‌డ‌వాల‌ని ఆమె నిర్ణ‌యించుకుంది. మ‌ద్యం సేవించ‌డాన్ని మానేసింది. శాక‌హారిగా మారిపోయింది. అంతేకాదు స‌బ‌ర్మ‌తీ ఆశ్ర‌మానికి రావాల‌ని నిర్ణ‌యించుకుని గాంధీజీకి లేఖ కూడా రాసింది. 1925 అక్టోబ‌ర్‌లో మెడెలిన్ గుజ‌రాత్‌కు వ‌చ్చింది. అప్ప‌టి నుంచి మ‌హాత్మాగాంధీతో ఆమెకు మంచి అనుబంధం ఏర్ప‌డింది. ఆహ్మ‌దాబాద్ వ‌చ్చిన త‌ర్వాత మెడెలిన్ పేరు మీరాబెన్‌గా మారింది.

సరళా దేవి చౌధురాణి (1872-1945) :

సరళా దేవి చౌధురాని విద్యావేత్త రాజకీయ కార్యకర్త. ఈమె 1910 లో అలహాబాద్‌లో భారత స్త్రీ మహామండలాన్ని స్థాపించింది. ఇది భారతదేశంలో మొట్టమొదటి మహిళా సంస్థ. ఈ సంస్థ ముఖ్య ప్రాథమిక లక్ష్యాలలో ఒకటి స్త్రీ విద్యను ప్రోత్సహించడం. ఈ సంస్థ భారతదేశంలోని మహిళల పరిస్థితిని మెరుగుపరచడానికి లాహోర్ (అప్పుడు విభజించని భారతదేశంలోని భాగం), అలహాబాద్, ఢిల్లీ, కరాచీ, అమృత్ సర్, హైదరాబాద్, కాన్పూర్, బంకురా, హజారీబాగ్, మిడ్నాపూర్, కోల్‌కతా ఇలాఅనేకచోట్ల కార్యాలయాలను ప్రారంభించింది.

రవీంద్రనాథ్ ఠాగూర్ మేనకోడలు సరళా దేవి చౌధురాని. ఉన్నత చదవులు అభ్యసించిన సరళ దేవీ సంగీతం, భాషలు, రచనల పట్ల చాలా ఆసక్తి చూపించేవారు. ఓసారి లాహోర్‌లోని సరళ ఇంట్లో గాంధీ బస చేశారు. సరళ భర్త, స్వాతంత్ర్య ఉద్యమకారుడు రామ్‌భుజ్ దత్త్ అప్పుడు జైల్లో ఉన్నారు. గాంధీ, సరళల మధ్య చాలా సాన్నిహిత్యం ఉండేది. సరళను తన ‘ఆధ్యాత్మిక భార్య’గా గాంధీ వర్ణించేవారు. తమ సాన్నిహిత్యం కారణంగా రామ్‌భుజ్‌తో సరళ వైవాహిక బంధం తెగిపోయే పరిస్థితులు కూడా వచ్చాయని గాంధీ తర్వాతి రోజుల్లో అంగీకరించారు.

ఖాదీ గురించి ప్రచారం చేసేందుకు గాంధీ, సరళ కలిసి భారత్‌లో పర్యటించారు. వీరి బంధం గురించి గాంధీ సన్నిహితులకు కూడా తెలుసు. కానీ, కొంత కాలం తర్వాత సరళను గాంధీ దూరం పెట్టారు. కొన్నాళ్లకు హిమాలయాల్లో ఏకాంత జీవితం గడుపుతూ సరళ మృతిచెందారు.

ఇలా ఈ ఎనిమిది మంది గాంధీతో పాటు నడిచిన వారిలో చాల ప్రత్యేకం. Independence Day సందర్బంగా వీరి గురించి తెలుసుకోవడం ఎంతో సంతోషం.

Also Read:  Three Foreign Women : భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ముగ్గురు బ్రిటీష్ మహిళలు.. ఎవరు ?